కుక్క చనిపోయిందని గగ్గోలు పెడుతున్న ఈమెచెట్టంత మనిషి చనిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు, యే౦ మనిషో పాడు" అంటూ చెవులు కొరుక్కున్నారంట కూడా. భావోద్వేగాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి అప్పుడెందుకు రాలేదో నేను మాత్రం యే౦ చెప్పగలను, అయినా ఇంకెక్కడ ఉంటుంది దుఃఖం? ఇన్నేళ్ళ దుఃఖం లోలోపలికి యింకిపోయి కడలి లెక్కన లోన దాగుంది. దాన్ని తోడిపోసే చేద యెవరి చేతిలోనో,చేష్టలోనో అతని చావులోనో ఎందుకుంటుంది.? కనుల పొరల మధ్య పొంగుతున్న నదులని ఆపడం ఎవరికైనా సాధ్యమా!?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి