నీతులు చెప్పే మారాజులందరినీ వాడల వాడల వెంట త్రిప్పి వీళ్ళని చూపించాలి. ఛీ, యాక్ అంటూ. వాంతి వచ్చినట్టు మొహం పెట్టె అమ్మలక్కలకి వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన చూపులు మారాలి . సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వాళ్ళు . వికృత ఆలోచనల సమాజం తయారుచేసిన ఆకలి కేకలు వీళ్ళు. వాళ్ళలో పూట గడవని అతి పేదవాళ్ళు వాళ్ళని పీక్కు తినే పోలీస్ వాళ్ళు కూడా వుంటారు. రోగాలు రోష్టులతో, మల మూత్రాల మధ్య, మురుగు కాలవలు ప్రక్కన, ఈగలు ముసిరి, దోమకాటులకి బలి పోతూ , కాట్ల కుక్కల మధ్య జీవచ్చవాలై బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి కోరికలతో కాదు మానవత్వం చూపడానికి వెళ్ళాలి ".. అన్నాడు అభి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి