కృష్ణా గుంటూరు జిల్లాల్లో మా బంధువుల్లో చాలామంది మతం మారారు. వారి ప్రార్థనలు వారివి. వారి సమూహాలు వారివి. నిజానికి హిందువులుగా వున్నవారు వారిని గతంలో వారి మాదిరిగానే మంచీ చెడు కి కలుపుకోవాలని చూసినా వారు కలవరు. కొత్త మతం పుచ్చుకున్న వారికి గుర్తులెక్కువ అన్నట్లు ప్రసాదాలు తీసుకోరు భోజనం చేయరు. ప్రతిదానికి ప్రార్ధనలు చేస్తారు. హిందువులు తిథి నక్షత్రం వారం వర్జ్యం చూసినట్టు. వివాహ గృహప్రవేశ ముహూర్తాలు మళ్ళీ హిందూ సంప్రదాయమే! హిందువుల ఇళ్ళ మధ్య కావాలని చర్చి నిర్మిస్తారు. తొలి ఏకాదశి వస్తే శివరాత్రి వస్తే కావాలని తెల్లవారుఝామున ప్రార్ధనలు మొదలెడతారు వారి ప్రార్ధన రోజులు కాకపోయినా. ఆరోగ్యం బాగోకపోయినా ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నా బైబిల్ తో వెళ్ళి కూర్చుంటారు. ఇష్టం లేదు మొర్రో అన్నా ఊరుకోరు. అయినా దశాబ్దాల తరబడి మా పల్లెల్లో ఎక్కడా గొడవలు లేవు. క్రిస్టమస్ వస్తే కేక్ కట్ చేస్తే నిరభ్యంతరంగా తీసుకుంటాం. అలాగే మా ఊరిలో శివాలయంలో ముస్లిం లు అభిషేకాలు చేయించుకుంటారు. నేను ఎన్నోసార్లు చూసాను. మాకు డ్రైవర్ గా వచ్చే అతను ముస్లిమ్. కళ్యాణీ బిర్యానీ తెచ్చుకుని కార్ ట్రంక్ లో పెట్టుకుంటాను అంటే కోప్పడతాను. పర్వాలేదు లోపల పెట్టుకో అంటాను. వద్దు మేడమ్! మీరు తినరు గా! వాసన మీకు ఇబ్బంది కల్గిస్తుంది ఏ సి వేస్తాం గా అంటాడు. నా చిన్నప్పటి నుండీ చూసాను.. ఎవరూ ఎవరితోనూ గొడవ పడలేదు. తిట్టుకోలేదు. కొట్టుకోలేదు. మా అమ్మ నా చిన్నప్పుడు దిష్టి మంత్రం ముస్లిమ్ ఆమెతో పెట్టించేది. కాలికి నల్ల దారం కట్టేది. మేము పీర్లు పండక్కి జెండా చెట్టుదాకా వాళ్ళతో కలిసిన జ్ఞాపకం. మా ఊర్లో గంగానమ్మ గుడిలో కడవ పూజకు కప్పల పెళ్ళికి పొంగళ్ళు పెట్టేటప్పుడు జంతు బలి అప్పుడు ముస్లిమ్ లు డప్పు శబ్దానికి చిందేయడం హడావిడి చేయడం సర్వసాధారణం.
ఏమిటో హిందూ ముస్లిమ్ క్రిష్టియన్ అంటూ మనుషులను విడదీసే సంస్కృతి నాకు భూతద్దం వేసి వెతికినా కానరాదు. స్వయానా మా నాన్నగారి అక్క అంటే నా మేనత్త తాను చనిపోయాక అంతిమ సంస్కారం చర్చి వారే నిర్వహించాలని ముందుగానే డబ్బు చెల్లించుకున్నారు. మాకు ఎవరికీ అభ్యంతరం లేదు.
సాహిత్యంలో హృదయాన్ని విశాలం చేసుకునే కథలెన్నో చదివాను. కొన్ని కథలు పలుకురాళ్ళ లా తగిలినా.. కథ లో ఏదో వొక కోణం బాగుందనిపించి.. ఊరుకుంటాను. బాహాటంగా చెప్పి గెలవలేం. వాక్ఫటిమ విసృతజ్ఞానం నాకు లేదులే అనుకుంటా! కొంతమంది కొన్ని కట్టు కథలు చెప్పి మెప్పించడానికి చూసేవారిని ఎండగడుతూ నిర్మొహమాటంగా చెప్పినట్టు రాసినప్పుడు .. చూసి సంతోషిస్తాను. సాధారణమైన మనిషిని. ఏవేవో చదివి భయభ్రాంతులకు గురికావడం నాకిష్టం లేదు.
కులం గురించి మతం గురించి మాట్లాడకూడదు అనుకుంటూనే.. ఈ మాట చెప్పాలనిపించింది. అంతే!
కొందరు మత విద్వేష కథలు రాస్తూనే వుంటారు.ఎందుకు అంటే చెప్పలేం. మళ్ళీ వారు ఈ దేశంలో కూడా నివసించేవారు కాదు.
ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో జరుగుతూ వుంటాయి. నిజమే కావచ్చు కాకపోవచ్చు.మీడియా కూడా సరిగ్గాలేదు కాబట్టి నిజాలు తెలుసుకోలేం. బాబ్రీ మసీదు కూల్చేసారని గుజరాత్ అల్లర్లు జరిగాయని దేశం అంతా ప్రజలు తమ జీవితాలను అగ్ని గుండాలుగా మార్చుకోలేరు. కారంచేడు లో జరిగిన సంఘటన చుండూరు లో జరిగిన సంఘటనల బట్టి ప్రపంచంలో వున్న కమ్మ రెడ్డి దళిత సోదరులు రక్తం చిందించుకోవడం లేదు. సంఘటనల వెనుక కారణాలు వుంటాయి. మన వ్యక్తిగత జీవితాల్లో వుండటం లేదా? అలాగే! సమస్య అనే వృత్తం లో కూర్చుని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోం. బయటపడి జీవితం కొనసాగిస్తాం. పక్కవాళ్ళకు ఆ సమస్య గురించి చెప్పి భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదు. రేప్ లు జరపడం తప్పు అని అనగల్గం కానీ ఆపే శక్తి మనకు లేదు. రేప్ గురించే మాట్లాడుతూ వుండిపోవడం కూడా సైకోయిజానికి గుర్తు. పసి పిల్లలను హౌస్ అరెస్ట్ చేసే వుంచండి అన్నట్టు వుంటుంది. అది నా అభిప్రాయం. రచనలు కూడా అలా వుండకూడదు అని నా అభిప్రాయం. అక్షరం రెండు వైపులా పదునువున్న కత్తి. మంచి చెడూ రెండూ సృష్టించగలదు.అధ్యయనాలు చేసి పాఠకుడు కథ చదవడు. అందుబాటులో వున్నది చదువుతాడు. అధ్యయనం చేసిన వారే చదవాలనుకుంటే ఆదివారం పత్రికలు వొదిలేసి వెబ్ లో ముద్రించుకోవచ్చు కదా! సాధారణ పాఠకుడిని భయభ్రాంతులకు గురిచేయడం ఎందుకు?
ఈ మధ్య news channel లో చూసాను. ఒక నాయకుడు అంటాడు. వంద కోట్ల మంది భారతీయులను చంపే ఆయుధం నా దగ్గర వుంది. బహుశా పాకిస్థాన్ దగ్గరున్న అణ్వస్త్రం అని అతని ఉద్దేశ్యం ఏమో! అతను అలా అన్నాడని నూట యాభై కోట్ల కు దగ్గరగా వున్న దేశ జనాభాలో వందకోట్ల మంది పక్కనే వున్న ముస్లిమ్ ని అనుమానంగా చూడాలా? నమ్మకంగా ప్రశాంతంగా తన బతుకు తను బతకాలా? కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం మాత్రమే ఈ మాటల తూటాలు అడప దడప జరిగే సంఘటనలు. వాటిని తలుచుకుంటూ భయపడుతూ బ్రతుకు దుర్భరం చేసుకోం. మనుషుల్లో దాగున్న పైశాచికాన్ని అక్షరాల ఆయుధం తో ప్రేరేపించకూడదు అని నా అభిప్రాయం. ప్రేరేపిస్తే ఎలా వుంటుందో చదువుకున్న అందరికీ తెలుసు. పద్నాలుగేళ్ళ పైగా ఈ రాష్ట్రంలో కులకాష్టం రగిలిస్తూనే వున్నారు. ఈ సారి ప్రజలు వివేకవంతులైనారు. అయినా PayTM batch ఇంకా విషం కక్కుతూనే వుంది.
నిన్న ఒక చిన్న కామెంట్ పెట్టాను ABN channel live లో. అక్కడ KGF summit జరుగుతుంది సత్యవాణి గారూ మాట్లాడుతున్నారు అప్పుడు. పెనమలూరు బాలికల వసతి గృహం గురించి చెబుతున్నారు. అది నిజం కూడా! మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టాను. మా పోరంకి యువకుడు తోటకూర గోపిచంద్ అంతరిక్ష యాత్రికుడు గా వెళ్ళి వచ్చాడు అని . అంతే నా కామెంట్ కింద ఇద్దరు ముగ్గురు ఎంత అసహ్యంగా వ్యాఖ్యానించారో.. రిపోర్ట్ కొట్టి ఆ కామెంట్ డిలీట్ చేసుకుని వచ్చాను. మనసంతా పాడైపోయింది. మత ద్వేషాలు కుల ద్వేషాలు దేశ దురభిమానం తో మనుషులు కుంచించుకుపోయారు. అందరికీ సంఘాలు వున్నాయి. మా కులానికి వుంటే తప్పేంటి? మా కులం లో పేదవారు లేరా? వాళ్ళ సంక్షేమం కోసం మా కుల అంతర్జాతీయ సంఘం వుంటే తప్పేమిటి? నాకేమీ అర్ధం కావడం లేదు. గర్వంగా మా ప్రాంతపు యువకుడు అంతరిక్షానికి వెళ్ళివచ్చాడు అనే మాట కూడ బూతు లా కనబడితే యెలా? ప్రతి దాంట్లో కులం మతం ప్రాంతం దేశం అద్దడమే! ఇవన్నీ చదువుకోని వారిలో లేవు. మేధావులుగా చెప్పుకునే వారిలోనే వున్నాయి. ఆ భూతాలు మిగతా వారిని భయపెడతాయి మనుగడ లో వుండటానికి అంతే! వీలైతే కథ రూపంలో పెట్టాలి. మనిషి మారలేదు🥲
కమ్మ రాజధాని అమరావతి
కమ్మ పరిపాలన
కమ్మోళ్ల రాజ్యం మాకొద్దు
కమ్మ లం... లు
ఏమిటిరా ..బాబూ ఈ శిక్ష మాకు .. ఎందుకు మా మీద ఇంత ద్వేషం ? ఎందుకు మా మీద ఇంత శిక్ష ? యూ ట్యూబ్ లో ఛానల్స్ చూడాలంటే భయం న్యూస్ చూడాలంటే చాట్ వైపు దృష్టి వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి పేస్ బుక్ తెరవాలంటే భయం మెసెంజర్ లో నోటిఫికేషన్ చూస్తే జంకు
ఒక్కటి మాత్రం చెప్పగలను మీలా ..మాకు PayTM బ్యాచ్ లేరు మీ అంత ద్వేషం నీచ సంస్కారం ఉన్నవాళ్ళం కాదు కానీ ఎల్లకాలం చూస్తూ ఊరుకోము ... ఊరుకోము ఊరుకోము . అని బాహాటంగా చెప్పడం నేర్చుకున్నాను. కులం పేరిట జరిగే వివక్ష అవమానాలను క్షమించం.
సాహిత్యం సోషియల్ మీడియా రెండూ పతనావస్థ కి చేరుకున్నాయి.😢😢
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి