ప్రకృతి పుస్తకం -వనజ తాతినేని.
నా చుట్టూ నక్షత్రాలు అక్షరాల రూపంలో కాంతులు విరజిమ్ముతున్నాయి.
మదిలో మెదిలే భావాలు అడవిపూల సౌంగంధాన్ని వెదజల్లుతున్నాయి.
పుట తిరగేయని ఓ మొహమాటపు మర్యాద సిగ్గు పడుతూ మేఘాల మాటున జాబిలి లా తొంగి చూస్తుంది.
నా చిన్నారి మనసు తుళ్ళి తుళ్ళీ పదాల వాన చినుకుల్లో సంబరంగా ఆడుకుంటుంది
వాన వెలిసాక ఇంద్రధనుస్సు లోని రంగుల్లన్నీ పుస్తకాల సీతాకోకచిలుకలై తోటలోఆడుకుంటున్నాయి.
ఓ తుంటరి సీతాకోక చిలుక నా ముఖంపై వాలింది. కాలమెందుకో స్థంభించిపోయింది.
మమేకమైతే ప్రకృతి ఓ పెద్ద పుస్తక భాండాగారం కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి