1, నవంబర్ 2025, శనివారం

కొన్ని..



కొన్ని… 


వర్ష గీతం

ప్రకోపించిన కోపం

అదృశ్య దీవెన


ఆకాశంలో 

విరిసిన సుమాలు 

నక్షత్రములు. 


అతివలను

వదలనంటుందిగా 

సౌందర్యం 


విరిబోణికి

దుఃఖ సహచర్యం 

పతి వలనే


నేనో చీకటి 

ఉషస్సు ఉద్దీపన

మేల్కొన్నాను


కోకిల కూస్తే

గొంతెత్తి పిలిచినట్లు 

మధుర స్వప్నం 


మనోజ్ఞమైన 

ఆకుపచ్చ ఆకృతి 

తరుణి రూపం


జీవితం 

ఒక పట్టానా లొంగిందా 

కష్టాల పుటం పెట్టబట్టీ.. 


వాక్యాల బరువుకి 

కాగితం కన్నీరైంది

పుస్తకం బరువెక్కింది 


కాకుల రొదలో

ఏకాకి కోయిల  

గూడు కోసం 


నీ జీవితాన్ని 

మెరుగుపరచుకో

నిశ్శబ్దంగా.