ఎంతో మంది పిల్లలు ఉన్నత చదువుల పేరిట ,ఉద్యోగాల పేరిట ఇంటికి దూరంగా ఉన్నప్పుడు.. కమ్యునికేషన్ లేనప్పుడు కలిగే ఆదుర్దా ఎలా ఉంటుందో..నేను స్వయంగా అనుభవిస్తూ..చెబుతున్న పోస్ట్ ఇది. అమ్మలకి ..ఓ..మాటగా.. ఈ పోస్ట్ చదివిన పిల్లలకి ఓ.. సూచనగా..ఈ ..మాట.
తల్లిదండ్రులకి..పిల్లలకి మద్య దూరం ఉంటె అక్కడ నిత్యం మాట ఒక వారధి. ఆ వారధి కట్టకుంటే అమ్మలకి..మనసంతా గుబులు. బిడ్డ తిన్నాడా..?సరిగా నిద్ర పోతున్నాడా..? కాలేజ్ కి సరిగ్గా వెళుతున్నాడా!? మంచి స్నేహితులేనా? ఇంకా అమాయకంగా మోసపోతున్నడా? ఇలా ఆలోచనల రైళ్ళు గుండెల్లో పరుగులేడతాయి.
ఈ అమ్మలకి ఏం పని లేదు..బిడ్డలు ఏడిస్తే ఏడుస్తారు నవ్వితే నవ్వుతారు. అనుక్షణం వారి గురించే ఆలోచిస్తారు. టన్నులు కొద్ది పుస్తకాలని చదివి రుబ్బేసి జ్ఞానాన్ని పిండుకుని మెదడులో స్టోర్ చేసుకుని ఉద్యోగాల వేటలో, లేదా ఉన్నత చదువుల కోసం దూరంగా వెళ్ళేసి వారి వారి పనులతోనో, స్నేహితులతోనో గడుపుతూ ఇంటిని మరచిపోతారు అంత మాత్రాన పెద్ద వాళ్ళు ఓ..హైరానా పడిపోయి ఫోనులు మీద ఫోనులు చేసేయడం.. దిగులు పడుతూ.. కూర్చవడం ఏమన్నా బాగుంటుందా! మొన్న మొన్నటి దాకా అమ్మ-నాన్న కనుసన్నలలోనే ఉన్నారు కదా! వెంటబడి వెంటబడి మరీ జాగ్రత్తలు చెప్పే వాళ్ళం కదా! ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు తప్పటడుగులు వేస్తారేమో!? అయినా.. వాళ్ళు చిన్న పిల్లలా ఏమిటి?విచక్షణతో,వివేకం తో.. మెలగడం నేర్చుకోవాలి కదా! ముఖ్యంగా పని విలువ,శ్రమ విలువ,డబ్బు విలువ అన్ని తెలుసుకుంటున్నారు. దిగులు ఎందుకు చెప్పండీ?
అన్ని అమర్చిపెడితే ..లైట్ గా తీసుకున్నవాళ్లకి అమ్మ-నాన్న విలువ, మంచి-చెడు విలువ బాగా తెలియాలి కదా!తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో..అనుబంధాల విలువ ఎంత గొప్పవో..వాళ్ళు కోల్పోతున్నది ఏమిటో తెలుసుకోవాలి కదా! అలా తెలుసుకున్నప్పుడు..అయినా అమ్మ-నాన్న గుర్తుకు రాకుండా ఎలా ఉంటారు?
పిల్లలు తమ వాళ్ళతో..ప్రేమగా మాట్లాడాలి. మొక్కుబడిగా మాట్లాడకూడదు. వాళ్ళని దూరంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడటం అన్నదానిని ఒక డ్యూటీగా చేయమని ఆజ్ఞాపించకూడదు. వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతున్నారు అనుకుంటారో అప్పుడు కాల్ చేసి మాట్లాడితే కలిగే ఆనందాన్నివాళ్లకి మనం దూరం చేస్తున్నాం.కొత్త చోటు, కొత్త అలవాట్లు, కొత్త ఆహార పద్దతులు..వీటన్నిటి మద్య నిరంతర ఒత్తిడి కల్గిన జీవన పోరాటంలో.. బిడ్డలు అలసిపోతున్నారు.వాళ్ళని తల్లితండ్రులు అర్ధం చేసుకోవాలి. మీ బిడ్డలకి ఒక ఉత్తరం వ్రాయండి. అది చదివి మీకు ఆన్సర్ ఫోన్ కాల్ తో అయినారాలేదంటే అప్పుడు ఆదుర్దా పదండి తప్పు లేదు. వాళ్ళని కొత్త కోణంలో ప్రపంచాన్ని చూడ నివ్వండి.
ఇంకా ఇంకా బాగా చదివేసి ఉద్యోగాలు చేసేసి కాసుల వర్షం లో.. మిమ్మల్ని తడిపెయాలని.. లేదా.. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో.. బాధ పడవద్దు. పిల్లలని ప్రోత్సహించడం తో పాటు..వాళ్ళకి కలిగే ఇబ్బందులని గమనించి..వాళ్ళకి చేయూత నిచ్చి.. సానుభూతి చూపించి.. వీలైతే పిల్లల మనస్తత్వాన్ని బట్టి కోప్పడి..ఎప్పుడూ.. తోడుగా ఉండటమే..అమ్మ నాన్నల పని.పిల్లలు అమ్మానాన్నలని, వాళ్ళ సాన్నిహిత్యాని ఇష్టంగా కోరుకోవాలి.కష్టంగా భరించడం కాదు.
పిల్లలు కూడా.. ప్రపంచంలో.. అన్నిటికన్నా విలువైనవి తల్లిదండ్రుల ప్రేమ.. మంచి నడవడిక,భాద్యత అని తెలుసుకుంటే..ఎవరు ఎవరికికి ఎంత దూరంలో ఉన్నా.. మనసంతా ప్రేమగా.. స్నేహంగా ఉండటం సాధ్యమే కదా! అమ్మానాన్న స్నేహంగా ఉండటం ఎంత అదృష్టం.ఆ.. స్నేహాన్ని అందరు ఆస్వాదించాలని కోరుకుంటూ..
ఈ..పోస్ట్ ని తప్పకుండా చదివే ఐ మీన్ చూసే.. నా బంగారుకొండకి.. (నా కొడుకు కి) అలసి,సొలసి పోయే చిరునవ్వుల చంద్రుడికి ఈ..అమ్మలాలి. ఈ ప్రక్కనున్న లింక్ లో మీరు వినండి.
లాలి పాడుతుంది గాలి ..ఆ గాలిలో..హాయిగా ఊయలలూగాలి..
5 కామెంట్‌లు:
well said!
తల్లీతండ్రులకి దూరంగా వెళ్ళినపుడు ఎలా వ్యవహరించాలో పెద్దలకీ, పిల్లలకీ balanced గా చెప్పారు.
రెండురోజుల క్రితం సందీప్ రాసిన ఒక similar టపా...
http://manonetram.blogspot.com/2011/04/blog-post.html
this is my first time here ! meeru post chala baga rasaru ! From a parent point of view you expressed it , though parents have to understand they should stop sacrificing its children's time to show some gratitude to parents ..
meeru cheppevanni aacharna sadhyam kaanivi..
vastavamlo chala kastam..
balance of mind yentha mandiki untundi..
స్పందించిన అందరికి ధన్యవాదములు. జనరేషన్ గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేయడం ఆశావాద దృక్పధం అని.. భావన. అదే చెప్పే ప్రయత్నం చేసాను. మారతారా? అంటే..చెప్పలేను.ప్రయత్నం చేయాలి కదండీ!!thankyou..
కామెంట్‌ను పోస్ట్ చేయండి