30, ఏప్రిల్ 2011, శనివారం

నీవే లేని నేనట - నీరే లేని ఏరట

వేటూరి పాట వినని పూట..ఏదో ఒక వెలితి  వెంటాడుతున్నట్లే ఉంటుంది..
ఒకప్పుడైతే..ఆడియో షాప్ ల చుట్టూ తిరిగి ఇష్టమైన పాటల లిస్టు ఇచ్చి అపురూపమైన కలెక్షన్ తో గర్వంగా ఫీల్ అవుతూ.. పెద్ద సౌండ్ తో వింటూ..వినిపిస్తూ.. ఇంకా చెప్పాలంటే తిట్టించుకుంటూ  వింటూ ఉన్న ఆనందం..

ఇప్పుడు  ఒక నిమిషం లోపే ఏ  పాట కావాలంటే ఆ పాట వినే ఈ రోజుల్లో.. లేదండీ..! నిజం  నేను ఇప్పుడు అంతగా పాటలు వినే ప్రయత్నం చేయడం లేదు.

చాలా బాగుంది అనుకున్న పాట కూడా వినబుద్దికావడం లేదు. అయితే.. ఎందుకో వేటూరి పాట పై.. కూసింత మమకారం ఎక్కువ. వేటూరి పాటల పై.. పి.హెచ్ .డి  చేయాలని నాకు  కోరిక ఉండేది అండీ అనేదాన్ని.అది ఒక కల లెండి. చేయ్యాలనుకున్నవన్ని చేస్తామా ఏమిటీ !? ఎవరో.. జయంతి గారని చేసేసారులెండి.

తెలుగు సిని సాహిత్యం ఎంత విస్తృతమైనమైనది!!. అందులో.. వేటూరి గారి..కలం చిందించిన భావాలు,పద ప్రయోగాలు.. ఆ సాహిత్యాన్ని మధించి భావామృతాన్నిగ్రోలితే కానీ తెలియరాదు.

 వేటూరి గారి పాటల్లో.. నాకు "గ్యాంగ్ లీడర్ " చిత్రంలో.. అన్ని పాటలకన్నా.. "వయసు వయసు వరుసగున్నది వాటం.. తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం " అనే పాట అంటే చెవి కోసుకుంటాను.

లేడీ అమితాబ్ గా పేరు గాంచిన విజయశాంతి ఆ.. చిత్రంలో.. చిరంజీవి పై పడి పడి.. నటించింది అని చెప్పుకునేవాళ్ళు. ఆ చిత్రం తర్వాత ఆవిడ చిరంజీనితో.. కలసి నటించ లేదనుకుంటాను.. ఆ సంగతి వదిలేసి.. అసలు సంగతి పాట విషయంలోకి వద్దాం.ఈ   పాట సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అందమైన సాహిత్యం మనసుని అంతగా దోచేసింది మరి.


వేటూరి పాటల్లో.. అసలే మాస్ పాట అంటే.. పదాల  పండగే..కదా!! అందులో బప్పిలహరి స్వరాలూ.. మెగా.. స్టార్..డాన్సు ఓరియంటెడ్ మూసలో నుండి విజయశాంతి  బయట పడే ప్రయత్నం. వెరసి ఈ పాట  సాహిత్యం  టిపికల్ ఏం కాదు.. అందరికి అర్ధమయ్యే అలతి అలతి పదాలు.. సూపరో సూపర్..

అసలు వేటూరి పాటల్లో.. శృంగారరసం పాళ్ళు ఎక్కువ. ఈ పాటలో.. మరీ ఎక్కువ. "శృంగేరి చేత్ కవి కావ్యేజాతం రసమయం జగత్ "అంటాడు ఆనందవర్ధనుడు. శృంగారి  అంటే కాముకడని భావం కాదు. ప్రకృతి సౌందర్యాన్ని  రసిక చిత్తంతో  ఆరాదించ గల్గె చిత్త వృత్తి కలవాడే కవి...ఆ కవి వేటూరి.

గాఢమైన ప్రేమ ఉంటే సహృదయుడు .. సౌందర్య రస సాధనతో.. కూడిన ప్రేమ ఉంటే సత్కవి...ఈ..రెండు ఉన్నవాడు.. "వేటూరి".. అందుకే.. ఆయన పాటలో.. చిరంజీవి.     


ఇక ఈ పాటలో..
"ఉదయం చుంబన  సేవనం, మద్యాహ్నం కౌగిలి భోజనం,సాయంత్రం పుష్ప నివేదనం,రాతిరి వేళ మహా నైవేద్యం.. " అని చక్కిలగింతలు.. పెట్టారు..

ఇంకో చరణంలో.. తారా తారా సందునా ఆకాశాలే అందునా.. నీవే లేని నేనట, నీరే లేని ఏరట.. కాలాలన్ని కౌగిట.. మరెందుకాలస్యం.. నయమారా అంటారు.

వేటూరి పాట చిత్రీకరణ కళ్ళల్లో మెదలుతుంది.. ఇక నేను చెప్పను, చెవులారా.. వినండి. లీనమై అర్ధం చేసుకోండి.  "వేటూరి " రసమయ హృదయానికి హాట్సాఫ్  చెప్పండి.. వయసు  వయసు వినండి..  నచ్చితే మరీ మరీ.. వినండి..చూడండీ !

 
.

7 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మంచి పాటని ప్రస్తాపించారు!

వేటూరి పాటల్లో, అసలే మాస్ పాట అంటే పదాల పండగే! కదా?

పదాలపండగ. కొత్త కొత్త భావాలుకూడా ఉంటాయ్.
"నీవే లేని నేనట, నీరే లేని ఏరట!" ప్రేమని ఇంతకన్నా గొప్పగా మాస్ పాటలో చెప్పలేం!

Shabbu చెప్పారు...

చాలా చక్కగా చెప్పారు,,,

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

dhanyavaadhamulu.. Iruvurikini.. Vanajavanamali

Phanindra చెప్పారు...

Thanks for the post. I thought this song is by Bhuvanachandra till now. Seems Veturi wrote this lyric and another in Gang Leader, remaining are by Bhuvanachandra.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదములు..ఫణీంద్ర గారు. ఈ.చిత్రంలో పాల బుగ్గ,వయసు వయసు..రెండు పాటలు వేటూరి గారు..మిగిలిన పాటలన్నీ భువనచంద్ర గారు వ్రాసినట్లు తెలుస్తుంది. ప్రతి పాట ఎవరు వ్తాసారో.. తెలుకున్నాకే నేను పరిచయం చేస్తాను. చాలా హోం వర్క్ చేసి నిర్ధారణ చేసుకున్నాకే పరిచయం చేసాను.థాంక్స్ ..ఒన్స్అగైన్.

Sandeep P చెప్పారు...

మీ పోష్టులో మొదటి పేరా చదివుతూ ఉంటే "ఇది నేనే వ్రాశానా ఏమిటి?" అనిపించింది. నా మనసులో భావం అక్కడ చాలా చక్కగా వివరించారు. వేటూరి మన తెలుగు చలనచిత్రరంగానికి దొరికిన ఆణిముత్యం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thankyou.. Sandeep garu..