లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ...అంటూంటారు కదా!
అప్పుడెప్పుడో.. నాకు బాగా నచ్చి వ్రాసుకున్న రెండు కొటేషన్స్ గుర్తుకు వచ్చాయి.
ఆ రెండు కొటేషన్స్ ..ఇవీ ..
ఈ జీవితం ఎంతో విలువైనది.
నీ కంటూ ఒక లక్ష్యం ఉండాలి .
ఆ లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమించాలి.
లక్ష్యం చేరుకోవాలి ... స్వామీ శంకరానంద.
ఈ అనంత విశ్వంలో..
ఆది -అంతం ఏమి లేదు
అందుకే ఈ క్షణం నీది.
ఆ క్షణాన్ని సంపూర్తిగా అనుభవించు... ఓషో
లక్ష్యం కోసం శ్రమించాలా ?
లేక....
క్షణాల సముదాయం
అయిన జీవితాన్ని ఆస్వాదిస్తూ..బ్రతకాలా?
క్షణాల సముదాయం
అయిన జీవితాన్ని ఆస్వాదిస్తూ..బ్రతకాలా?
రెండూ పరస్పర భిన్నఅభిప్రాయాలని చెపుతున్నాయి.
రెండిటిని.. సమన్వయం చేసుకుని..లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ లా.. బ్రతకడంలో అర్ధం వుంది కదా అనుకున్నాను.
అప్పుడు అస్ఫష్టమైన ఆలోచనలతో.. ఇలా వ్రాసుకున్నాను. ఏ మార్పు లేకుండా యదాతధంగా యిదిగో...యి లా..
సముద్రమా ! నీ లోతెంత అని అడిగితే ..
గాయపడిన హృదయమంత అని..
కారు మేఘమా..నీకంత నలుపేల ..అని అడిగితే..
మనసులో ముసిరిన చీకట్లు నుండి అరువు తెచ్చుకున్నాను ..అని..
సెలయేటి గల గలలుని.. నీకెందుకింత చైతన్య మనిన
బండ రాళ్ళని అరగదీస్తూ..పరుగులిడుతున్నందుకు ..అని..
నిశ్చల సంద్రాన్ని అంత ప్రశాంతత యేల సాధ్యమని.అడుగగా .
బడబాగ్నులని దాచుకున్నందుకు.. అని..
కురిసి కురవని శ్రావణ మేఘాల్నిఅడిగా. ఎందుకింత అలక అని..
కొనకంటి కన్నీటి చుక్కని చూసి..వేదన చెంది..అని..
ప్రకృతిలో ధర్మాలన్నీ.. మనలోనూ వుంటాయి..
వాటి లోతుల్నిఅనుపానులని తెలుసుకుని..ఆనందం గా జీవించడమే జీవితంలో అందమని.. ఆనందమని..అందులోనే.. సంపూర్ణం చెందటం అని..
ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి కానీ అనుకున్నవన్నీ జరగడం యెలా కుదురుతుందీ. అని
ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి కానీ అనుకున్నవన్నీ జరగడం యెలా కుదురుతుందీ. అని
..
2 కామెంట్‌లు:
చాలా బావుందండి బాగా రాశారు
చాలా బాగుందండీ... :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి