6, ఆగస్టు 2011, శనివారం

సీతాకోక చిలుక..అందం..

మేడమ్! మేడమ్!! అని పిలుపులు.

ఊహు ..వినిపించుకుంటే కదా!మళ్ళీ మేడమ్! ఏక్ బార్ ఆవో..మేడమ్ ! జల్దీ ఆవో!

ఇక తప్పదు.ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ఈ పిలుపులు..

మేడమ్ మేడమ్..అని పిలుస్తూ ఏదో సి.ఈ.వో.ని పిలిచినట్లు.

మేడమ్ అన్నది ఒకటే తక్కువ నా మొహానికి..అనుకున్నా విసుగ్గా..

ఇప్పుడేగా కలర్ కాంబినేషన్, డిజైన్ పిల్లింగ్ చూపించి లోపలకి వచ్చాను.ఇంతలోనే మళ్ళీ పిలుపులు..

మళ్ళీ ఏమొచ్చిందో!? అనుకుంటూ వెళ్లాను.

వెళ్లి చూద్దునుకదా! మా వర్కర్స్ చాలా సంతోషంగా నవ్వుకుంటూ కనిపించారు.

ఏమిటి సంగతి? అన్నాను. "దేఖో మేడమ్! తితిలీ"అన్నారు.

చూద్దును కదా! అందమైన సీతాకోక చిలుక ఎంబ్రాయిడరీ చేసే చీరపై చక్కగా వాలి కనువిందు చేస్తుంది.

ఆ చిత్రం మీరు చూడండీ!

సీతాకొక చిలుక. చాలా ఆశ్చర్యంగా.. చూసాను.  మేము ప్యాచ్ చేస్తున్న సీతాకోక చిలుక ప్రక్కనే వాలి..అలాగే ఉండిపోయింది.

అది చూసి నవ్వుకుంటూ ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని  నాకు చూపటానికి..నన్ను పదే పదే..పిలిచారన్నమాట  అనుకుని


గబ గబ లోపలికెళ్లి.. కెమెరా తెచ్చి ..ఆ సీతాకోక చిలుకమ్మ విన్యాసాలని..క్లిక్ క్లిక్..మనిపించాను.

 ఆ చిత్రాలివే! చూసారు కదా!

నా కస్టమర్ ఆర్డర్ ప్రకారం..నేను కలంకారీ.. అద్దకం తో..తయారైన డిజైన్ పీస్ ని.. పట్టు బట్టపై..అతికించి..మళ్ళీ దాని పై ఎంబ్రాయిడరీ చేయడం మా పని.

దాదాపు నేను..కాట్ ఎంబ్రాయిడరీ ని.. ఒక చిన్న స్వయం ఉపాదిపధకంగా..మొదలెట్టి  పది ఏళ్ళు దాటింది.
మొదట ఆరుగురు తమిళ సోదరులతో.. మొదలెట్టి.. తర్వాత తర్వాత.పది పన్నెండు మంది  వర్కర్స్ తో..పెద్ద ఎత్తున వర్క్ షాప్ నిర్వహించి.. పది మందికి..పని కల్పించే  వృత్తిలో ఉన్నాను. ఈ వృ త్తి నాకు చాలా ఆసరాగా..నిలిచింది.

తమిళులు,నేపాలీలు,కలకత్తా,కేరళ మొదలగు ప్రాంతాల నుండి వచ్చి.. మా షాప్ లో..వర్క్ చేసేవారు. అలా ఇంకా కొనసాగుతూ.. సాగుతూ ఉంది..ఇప్పుడు కూడా..

ఇక క్రింద చూడండీ..
    


ఏ మాత్రం కదల కుండా ఒక పావుగంట సమయం అలాగే..మమ్మల్ని అందరిని..మురిపించి తర్వాత పక్కనే ఉన్న తులసి మొక్క పై వాలింది..ఆ సీతాకోక చిలుక.. ఆ చిత్రం చూడండీ!


 సీతాకోక చిలుక  సంగతులు.. ఇవండీ..

ఈ పోస్ట్ చదివేసాక .. వనజ గారు మీరు ఎంబ్రాయిడరీ వర్క్  షాప్... అట కదా! అనే మిత్రుల కోసం ఇంకొక మాట..

మహిళలు-స్వావలంబన ..ఇది నాకు బాగా తెలుసు. మా పెళ్లి అయ్యేటప్పటికి.. నా చదువు ఇంటర్ మీడియట్  చదువు మాత్రమే.

ఒక గృహిణి గా ఇక చదవటం అంటే కుదరని పని  కదా!

ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో.. నాకు.. ఆర్ధిక అవసరాల దృష్ట్యా.. ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు..అత్తెసరు చదువులతో..చిన్నాచితకా ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక.. అప్పటి పరిస్థిని బట్టి   చేయ వీలు కాక కూడా.. అన్వేషణ మొదలెట్టాను.

అప్పుడు అప్పుడప్పుడే మొదలైన ట్రెండ్..ఎంబ్రాయిడరీ.  కొంచెం బెరుకుగానే స్టార్ట్ చేసాను. 

చాలా మెలుకువలు నేర్చుకుని.. "ఘర్ కా దుకాన్ " రన్ చేయడం మొదలు పెట్టాను. ఆ.. ప్రయత్నంలో.. మన భారతదేశంలో.. వివిధ ప్రాంతాలకి..బొంబాయి,సూరత్,వారణాసి,కలకత్తా, బెంగుళూరు, కోయంబత్తూరు,పుట్టపాక ఇలా అన్నీ  చుట్టేసి రక రకాల వస్త్రాల మెటీరియల్స్, చీరలు..కొని తెచ్చిఇంట్లో ఉండే..అమ్మకాలు చేసి.. సంవత్సరానికి.. 20   లక్షల టర్నోవర్ తో సమర్దవంతంగా నిర్వహించాను.అలా ఆరేళ్ళ పాటు గడిచింది.

మేము  కొనుగోలుకి వెళ్ళినప్పుడు.. అయిదుగురు ఆరుగురు (అంతా స్త్రీలమే) కలసి సిండికేట్ గా వెళ్ళేవాళ్ళం.  తలచుకుంటే ఇప్పుడు అదంతా..ఒక వండర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. 

తర్వాత  తర్వాత.. వ్యాపార రహస్యాలు లేకపోవడం,కస్టమర్ టేస్ట్ మారడం,అప్పులు ఇవ్వ వలసి రావడం,ఇచ్చిన అప్పులని వసూలు చేసుకోలేకపోవడం లాంటి.. మైనస్ పాయింట్స్ వల్ల నష్టాలు రావడం తో.. సేల్స్ తీసేసి ఓన్లీ వర్క్   షాప్ నిర్వహిస్తూ.. ఎంతో మంది కస్టమర్స్ ..ఎన్నో..అనుభవాలు. లాభాలు-నష్టాలు  అదంతా నాకసలు లెక్కలోవే కావు 

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కలర్స్ కెమిస్ట్రీ నేర్చుకుని,డైయింగ్,ప్రింటింగ్.ఫ్లోరల్ డిజైన్..అన్నీ..చుట్టేసి.. మళ్ళీ విద్యార్ధిని..గా మారి.. నా అభిరుచికి తగ్గట్టుగా మాస్టర్స్ పట్టభద్రురాలినై..
కాస్త కవిత్వం.. ఇంకాస్త పైత్యం  వగైరాలతో.. జీవితాన్ని ఆస్వాదిస్తూ..ఈ బ్లాగ్ లోకం లో..పడ్డానండీ.

మాకు దగ్గరలో ఉన్న మహిళా  పారిశ్రామిక వాడలో ఒక  చిన్న  తరహా  పరిశ్రమ  స్థాపించాలని  ఉత్సాహపడ్డాను.కానీ అంత సులభతరం కాదని నానా  రకాల ప్రయత్నం తర్వాత  భోధపడింది.మహిళలకి అన్ని చోట్లా అవరోధాలే!

త్వరలో..ఓ..మంచి వ్యాపార కూడలిలో.."బోటిక్ " స్టార్ట్ చేయాలని..నా ప్రయత్నం కూడా.      

ఎన్ని అవాంతరాలు ఎదురైనా   ఎన్ని కష్ట-నష్టాలు  ఎదుర్కొన్నా  నన్ను వీడి వెళ్ళనివి  మాత్రం నా ప్రియ స్నేహితులు,  పుస్తకాలు.

రేడియో వినడం, మనసు స్పందిస్తే వ్రాయడం..ఇవి వ్యాపకాలు.

అందరూ  తీరిక సమయాలలో.. పుస్తకాలు చదువుతాం అంటారు. పుస్తకాలు చదవడం కోసమే..నేను తీరిక  చేసుకునేదాన్ని.

ఏం  సంపాదించుకున్నారంటే.. . నేను ఒకటే చెపుతాను. "మంచి మిత్రులు, జ్ఞాన సముపార్జనం ".

ఇవి రెండింటికి   ..ఏవి సరి పోవు, సరిరావు కూడా.. అని నా నిశ్చితాభిప్రాయం. 

అందుకే..  మేము ఎకరాలు కోల్పోయినా..నగలు నాణ్యాలు..కోల్పోయినా.. బాధ పడను. అవి మళ్ళీ...  రావచ్చు పోవచ్చుకదా.!

 నా అనుభవంలోనే  కాదు, ఇతరుల అనుభవాలనుండి ..నేర్చుకున్నది ఏమిటంటే .. అసలైన ఆస్తి ఆత్మ విశ్వాసం...అని.  

"డూ  మోర్, లెర్న్ మోర్, గివ్ మోర్, బి కమ్ మోర్.." అదే..నాకు..జీవిత పాఠం .

ఇదండీ. మహిళలు స్వావలంబన లో.. నా ఆవలంబన.  హమ్మ ! సీతాకోక చిలుకా..!! నా గురించి చెప్పేయించింది చూడండీ.. ఆమెని మెచ్చుకోండి. 

అలాగే.. మా వర్కర్స్.  నేను వాళ్ళని,వాళ్ళ కుటుంబాలని  పోషిస్తున్నానో.. లేక వాళ్ళ పని ఊత వల్ల నాకు ఆర్ధిక బలం చేకూరుతుందో..ఇద్దమిద్దంగా.. చెప్పలేను. కానీ వాళ్ళ చేతిలో.. పని మాత్రం అద్భుతం. వాళ్ల చేతుల్లో రూపు దిద్దుకున్న ఎన్నో..కళా ఖండాలు ఉన్నాయి. ఒక్కొక్కటి  ఒకోటి ఒకోటిగా ఇక ముందు పరిచయం చేస్తాను. 

ఇదండీ! ఒక్క పోస్ట్.. రెండు విషయాలు...  చదివినందుకు ధన్యవాదములు. సెలవండీ !!      

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

{నా గురించి చెప్పేయించింది చూడండీ.. ఆమెని మెచ్చుకోండి}

వనజగారూ సీతాకోకచిలుకలు మగవికూడా ఉంటాయి మరి! ఇదన్యాయం క్రెడిట్ అంటా ఆడ సీతాకోకచిలుకలకి ఇచ్చేయటం!!! :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మగ సీతాకోక చిలుక లు చీరలిపై వాలవు.:)))))) అయినా ప్రకృతిలో అందమైన వన్నింటిని..స్త్రీ తోనే పోల్చి చెప్పారు కదా..అదన్న మాట విషయం. ధన్యవాదములు అచంగ గారు.

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు జవహర్లాల్ నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడు ఓ సారి లిఫ్ట్ లో ఉన్నాక కరంట్ పోయింది ( నేను చూడలేదు చదివాను) సిబ్బంది అంతా భయంతో వణికి పోయారు. తరువాత నెహ్రు లిఫ్ట్ నుండి బయటకు వచ్చి , లిఫ్ట్ లో ఎప్పుడూ ఏదైనా మంచి పుస్తకం ఉంచండి అని చెప్పి వెళ్లి పోయారట. చదవాలనే ఆసక్తి ఉండాలి కానీ సమయం అదే లభిస్తుంది. చదువును వదలకుండా వ్యాపారం సాగిస్తున్న మీకు మరీ మరీ అభినందనలు (అలా చదివే అలవాటే నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది .. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది )

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"డూ మోర్, లెర్న్ మోర్, గివ్ మోర్, బి కమ్ మోర్..అదే..నాకు..జీవిత పాఠం"

మీ జీవిత పాఠం అందరూ అనుసరించాల్సినదేనండీ...
Happy Friendship Day!

Raj చెప్పారు...

చాలా ఇంఫర్మేటివ్ గా, సాటి మహిళలకి ప్రేరణగా ఉందండీ మీ వ్యాసం.. మీకు అభినందనలు..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

jOhArlu, vanaja gaaru :)