27, ఆగస్టు 2011, శనివారం

గాలి కదుపులేదు..నవమినాటి వెన్నెల

నాకు చాలా చాలా.. ఇష్టమైన పాటలు.. ఈ రోజు యూ ట్యూబ్ లో.. దొరికాయి. మనసంతా ఎంతో..ఆనందం. ఆ ఆనందం ముందు..ఏవి సాటి రావు.. మీరు..ఓ.. సారి చూసేయండి.
ఇది కథ కాదు చిత్రంలో.. గాలి కదుపులేదు కడలికంతు లేదు

గాలికదుపు లేదు కదలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా (గాలి )
ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలెన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో (నింగిలో)
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్ళి మళ్లి వసంతమొస్తే
మల్లెకేల ఆకు చాటు (గంగ)
ఓ..తెమ్మేరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళీ తరుణ య్యింది
పువ్వు పూచి మొగ్గయింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది (గంగ)
శివరంజని చిత్రంలో..

నవమినాటి వెన్నెల నేను.. 

3 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

గంగ వెళ్ళువ కమండలంలో ఇమిడేదేనా - ఈ లిరిక్ నేను డల్ గా ఉన్నప్పుడు నాన్ను బాగ ఉత్సాహపరుస్తుంది. ఇది కూడా మా గురువుగారికి గురువు ఆత్రేయ గారి కలం రాల్చిన ముత్యాలు :)

మురళి చెప్పారు...

నవమినాటి వెన్నెల.. ఎన్నిసార్లు వినమన్నా నేను రెడీ అండీ..

భలే టేస్ట్ మీది..

pydinaidu చెప్పారు...

మంచి పాటలను సాహిత్యం తో పంపినందుకు ధన్యవాదములు.