5, ఆగస్టు 2011, శుక్రవారం

ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్

ఒక ఆసక్తికరమైన..విషయం చూడండీ!

క్రింద చిత్రం లో ఉన్న నటీ మణి .. అందరికి కాకపోయినా కొందరికి అయినా తెలుసు.


బాలీవుడ్ నటీ మణి  "మల్లికా ఆరోరా" ధరించిన జార్జెట్ శారీ..చాలా బాగుంది కదా! అందులో..పెద్ద విశేషం ఏంలేదు.కానీ.. ఆమె ధరించిన బ్లౌస్ ఉంది చూసారు..ఆ బ్లౌస్ ఖరీదు ..చెపితే..కళ్ళు తిరిగి టపీ మని  పడిపోయాను నేను.మీరు అలా పడకుండా చూసుకోండి ..మరి.

ఆ బ్లౌస్ తయారీలో.. అక్షరాలా అయిదు వందల కేరట్ విలువ కల్గిన బెల్జియం డైమండ్స్ తో..తయారు చేసారట. ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్ ..అట.

ఏమిటో.. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే వారు..కానీ..ఇలా.. బ్లౌస్ ల  పాలు కూడా..అన్నమాట.
ఈ బ్లౌస్ ని  ఈమె కి..ప్రదర్శించడానికి  కట్టబెట్టారో.. లేక..అచ్చంగా..ఇచ్చేసారో.. వివరంగా..తెలియదు. మొత్తానికి..ధరించి మాత్రం  హొయలు ఒలకబోస్తుంది.. చూడండీ!
  
celebritysaree.com వారి సౌజన్యం తో..  ఈ  చిత్రం సేకరణ. 

3 కామెంట్‌లు:

కొత్తావకాయ చెప్పారు...

విత్తం కొద్దీ వైభవం! శ్రావణ శుక్రవారానికి కొంటారేమో అడగాలి ఇంటాయనని. హ్హహ్హహా..

ఆత్రేయ చెప్పారు...

నేను సినిమాలు చూడక పోయినా
మలైకా నా అభిమాన నటి
పొద్దున్నే మంచి బొమ్మ సూపించారు.
ధన్యవాదములు!!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

హ్మ్... ఎవరిపిచ్చి వారికి ఆనందం. ఇన్నిన్ని డబ్బులు బ్లౌసుకు ఖర్చుపెట్టాలా?