ఈ రోజు వుదయాన్నే యింట్లో పూజ ముగించుకుని తులసి పూజ కూడా చేసుకుని ప్రదక్షిణం చేయడం మొదలెట్టాను.సగం కళ్ళు మూసుకుని ప్రదక్షిణం చేస్తూ..యానికాని పాపానిచ జన్మాంతర కృతానిచ అని చెప్పుకుంటూ గిరగిర తిరిగేస్తున్నాను.
"వచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్రక్కకు త్రప్పుకో.." అని మాటలు వినబడుతున్నాయి. ఎవరబ్బా అనుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను.చెపుతుంటే వినవచ్చు కదా వాళ్ళకెలాగు తొందరే! నీకు కూడా అంత తొందరెందుకు ? వాళ్ళ పద ఘట్టనల కింద పడితే బతికి బయటపడటం యె౦త కష్టం, చెపుతుంటే వినవు అన్న మాటలు దీర్ఘంగా మళ్ళీ వినబడుతున్నాయి.
ఈ సారి వులికిపడ్డాను. ఎవరబ్బా యింతగా క్లాసు తీసుకుంటున్నారు అని పరీక్షగా చూసాను. ఎవరు కనబడలేదు.ఈ మధ్య నాకన్నీ బ్రాంతిగా వుంటున్నాయి.కాస్త జాగురకత వుండాలి.లేకపోతే అభాసుపాలు కాగలను అనుకుని.. మూడవ ప్రదక్షిణం ముగించబోతుండగా ఒక జీవిని తొక్కేసాను.
వెంటనే ఈ సారి గావుకేకలే వినబడ్డాయి. అయ్యో! నేను చెపుతుంటే వినడమే మానేసావు, ఇప్పుడు చూడు యేమైందో..

ఈ మానవులంతా కర్కశ హృదయులు. ఎప్పుడూ కళ్ళు పైనే వుంటాయి.వాళ్లకి కావాల్సింది సాధించుకోవడానికి, నిర్ధాక్షిణ్యంగా యితర జీవజాతిని నాశనం చేస్తారు. ఇప్పుడు నీ నడుములు విరిగిపోయాయి.ఇంకా నయం, యింకొద్దిగా వుంటే ప్రాణాలే పోయేవి. అంతా నా ఖర్మ అని వినబడుతుంటే..అనుమానం వచ్చి పరీక్షగా క్రిందికి చూసాను.
రెండు చీమలు..ఒక చీమ నేను ప్రదక్షణలు చేస్తున్నప్పుడు..పొరబాటున తొక్కేసినట్లు ఉన్నాను.ఆ చీమని నేను తొక్కేయడం మూలంగా అడ్డంగా పడిపోయి వుంది.
ఇక రెండో చీమ ఆందోళనగా గాయపడిన చీమ చుట్టూ తిరుగుతూ మాట వినని భర్త చీమని చూసుకుని యేడుస్తూ, ముక్కు చీదుతూ, వాపోతూ వుంది.(ఇవన్నీ నాకెలా తెలుసు అనుకోకండీ. ఒకోసారి అన్నీ అవే తెలుస్తాయి.పశుపక్ష్యాదుల,కీటకాల,మొక్కల భాషలు అన్నీకూడా..ఎంతైనా మనిషి మహా మేధావి కదా ఈ మధ్య కాస్త జ్ఞానం పెరిగింది కూడా )
నేను కొంచెం బాధ పడుతూ.. అయ్యొయ్యో! యెంత పని చేసాను ? అనుకుంటూ..చేతిలో అక్షతలు తులశమ్మమూలం దగ్గర వొదలి చటుక్కున వొంగి చీమని పరీక్షగా చూసి వైద్యురాలి అవతారమెత్తాను.
రెండో..చీమ హడావిడిగా తిరగడం మొదలెట్టింది.
తన పతి ప్రాణానికి యేమి హాని కలిగిస్తానో అనుకుని. అలా తిరుగుతూనే యేమిటో వెదకడం చేస్తుంది ..తన బలగాన్ని కూడబెట్టె ప్రయత్నం చేస్తున్నట్టు వుంది.
నేను కాస్త ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలెట్టి అది అయ్యేటప్పటికి చీ చీ ..అనుకుంటూ పదిమందిని పోగేసింది .
ఆ పోగైన జీవులని చూడగానే నాకు భయం వేసింది. ఎక్కడ పట్టుకుని కసిదీరా కుట్టి పడేస్తాయేమోనని రెండు నిమిషాలు దూరం జరిగాను .అన్ని చీమలు క్రమశిక్షణతో లైన్లో వెళ్లి గాయపడిన చీమని పరామర్శించి వస్తున్నాయి .ఇవతలకి వచ్చి సంభాషణలు జరుపుకుంటున్నాయి.
ఏమైనా సరే వదలకూడదు. నీకు ఈ స్థితి కల్పించిన ఈ మానవ స్త్రీని శిక్షించవలసిందే అని తీర్మాని౦చుకోవడం వినబడుతుంది. మెల్లగా జారుకోబోయి.. యెహే..ఈ చీమలకి భయపడటం యేమిటి? అయినా నేను కావాలని త్రొక్కానా యేమిటి? నా పని నేను చేసుకుంటుంటే..అవే వచ్చితెగ తిరుగుతూ ఆహారం కోసం అన్వేషణ అనుకుంటూ తెగ ఫోజులు కొడుతుంటాయి.ఆ మాత్రం వేటాడకుండా తేరగా మానవులకి కూడా వచ్చేస్తున్నాయి కాబోలు. వెదవ బిల్డప్పులు యివీను అని అనుకున్నాను మనసులో .
చూసారా చూసారా? ఎన్ని మాటలు అంటుందో, మనకి తెలియవనుకుంటుందేమో అన్న మాటలు వినబడ్డాయి. వులికి పడ్డాను .అమ్మో, యిదేమిటి ? యిలా మనసులో అనుకున్న మాటలు వినబడుతున్నాయి.
ఇప్పుడిక్కడ నుండి కదలడం కూడా మంచిది కాదనుకుంటూ యెoదుకైనా మంచిదనుకుని అక్కడున్న కుర్చీలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకుని మరీ కూర్చున్నాను . ఆ చీమలదండు వైపు చూస్తూ కూర్చున్నాను. ఆర్ .నారాయణమూర్తి గారి చీమలదండు చిత్రం గుర్తుకువచ్చింది. అప్రయత్నంగా భయం వేసింది కూడా.
ఏం చేస్తున్నాయా? అని దొంగచూపులు చూస్తున్నాను. ఒక రెండు చీమలు వెళ్లి తులశమ్మ కుండీ ప్రక్కనే ఉన్న పుట్టలోకి వెళ్లి మూడవ చీమతో తిరిగి వచ్చాయి.ఆమె "రాణి చీమ " అనుకుంటాను. కాస్త పెద్దగా స్టైల్గా వుంది. హుందాగా వొక సైనిక చీమ దారిచూపుతుండగా వెనుక రాణి వెడలె దర్పంతో మందగమనంతో వచ్చుచున్నది.
నా పై ప్రాణాలు పైనే పోయేటట్లు వున్నాయి ఆమెని చూసి.
పట్టుకుందంటే నలిపేసే లోపే కండ కంది చురచురలతో మంటెంత్తాల్సిందే, అలా వుంది. రాణి చీమని తీసుకొచ్చి గాయపడిన చీమని చూపాయి మిగతా చీమలు..
ఎలా జరిగింది యిది..అని అడిగింది విచారణ ప్రారంభిస్తూ. యే౦ఫాస్ట్! ఈ చీమల్ని చూసి మనం సిగ్గుపడాలి అనుకున్నాను.
ఆడ చీమ చెప్పడం మొదలెట్టింది. రోజు మేమిక్కడే ఆహార సేకరణ చేస్తాము.ఆ.. మానవ స్త్రీ..నిత్యం ప్రాతః కాలాన్నే వచ్చి అదీ పుట్టలో..మన ఆహారపునిల్వ గదులలో ఆహారం చేర్చుచుండగా వచ్చి రెండు చెంబుల నీరు గ్రుమ్మరించి మన రాజ్యాన్ని వరదలమయం చేసేస్తుంటుంది. అలాగే ఆ తులసి మొక్క చుట్టూ తిరుగుతూ నిత్యం మనవాళ్ళ ప్రాణాల్ని బలితీసుకుంటుంది .ఆమెని అసలొదల వద్దు. యే మాత్రం వుపేక్షించక శిక్ష అమలుచేయండి రాణి వారు అంటుంది ఆక్కసుగా గాయపడిన చీమ వారి భార్యామణి .
నాకు కొంచెం భయం ,ఆసక్తి రెండు పెరిగాయి యే౦ జరగబోతుంది అని.
"ఊహు..అని మీరేమంటారు మంత్రి వర్యా " అన్నారు రాణి చీమవారు.
మనం కాదు రాణివారు గాయపడిన చీమవారి అభిప్రాయం కనుక్కుని..ఆ విధముగా తీర్పు నివ్వండి అని మంత్రి చీమగారు సెలవివ్వగానే..
చెప్పండి, మీ భాద యేమిటో? అలాగే యే౦ శిక్ష యిమ్మందురో? అని ఖండిత చరణములతో వున్నమగ చీమ ని అడుగగానే..
అబద్దం... అంతా అబద్దం రాణి వారు..ఈ మానవ స్త్రీ గతంలో..కూడా శివాలయంలో 108 దినములు 108 ప్రదక్షిణములు చేస్తూ.. కళ్ళు నెత్తిమీద పెట్టుకుని అడ్డదిడ్డంగా మన జాతిని కర్కశ పాదాల క్రింద తొక్కేసి పుణ్యం సంపాదించుకున్నాను అనుకుంటుంది. ఇతర ప్రాణులకి హాని చేయకుండా వుండటమే అసలైన పుణ్యం అని అన్నీ తెలుసు అనుకున్న యీ మానవులకి తెలియదా అంది ఆవేశంగా..
ఇదిగో, ఇంటాయనా! నువ్వెన్ని అయినా చెప్పు.ఒక్కసారైనా ఆమెని నేను కుట్టకుండా వదలను. అప్పుడు గాని నా కక్ష తీరదు అంది అక్కసుగా కోపంగా.
అప్పుడు మన బిడ్డలకి..నేనున్నా వొకటే నువ్వు లేకపోయినా వొకటే అన్నారు..మగచీమ.
సరే సరే..యింతటితో వదిలేయండి. ఇప్పటికే చాలా సమయం పని గంటలు వృధా.
ఆ గాయపడిన సైనిక చీమవారిని..వైద్యశాలకి..పంపి..ఈ..ఆడ చీమవారికి పని గంటలు యెక్కువ యిచ్చి ఆహారం యెక్కువ యివ్వండి అని ఆదేశములు యిచ్చి వెనుదిరిగి వెళ్ళారు రాణి చీమవారు.
భలే భలే రాణివారు. మీ తీర్పు అద్భుతం అని నేను యెగిరి గంతులేస్తున్నాను. మొత్తానికి నాకూ పిపీలిక భాష వచ్చేసిందోచ్! అనుకుని సంతోష పడుతున్నాను.
ఎవరు..ఆ రాణి వారు! యేమా తీర్పు, లేచి "టీ" పెట్టు ..అని ఆర్డర్స్ . టక్కున మేల్కొని ఓస్ ..యిదంతా కలా ? అనుకున్నాను వులికిపడి లేచి చుట్టూ చూసుకుంటూ వంట గదిలోకి వెళ్లాను.
ఇది వో చీమ కథ. కథే కదా అని తక్కువ చేయకండీ..

రాణి వారూ, ఆ మానవ స్త్రీ తప్పిదం యే౦ లేదు. నేనే ప్రతి నిత్యం ఆమె..పూజ చేసేటప్పుడు ఆమె చెప్పుకునే మంత్రోచ్చారణ వినడం కోసం, ఆలాగే ప్రదక్షిణం చేసేటప్పుడు ఆమెతో కూడా తిరుగుతూ వుంటే ..నాకు కూడా ఫుణ్య ఫలం దక్కునను వుద్దేశ్యంతో నేను ప్రదక్షిణం చేయుచుండెడదను. పైగా ఆమె పెట్టేడు ప్రసాదం వలన మనకి యె౦తో ఆహార భద్రత కూడా. ఆమెని మన్నించ వచ్చును అని చెప్పుకొస్తుంది.
అబద్దం... అంతా అబద్దం రాణి వారు..ఈ మానవ స్త్రీ గతంలో..కూడా శివాలయంలో 108 దినములు 108 ప్రదక్షిణములు చేస్తూ.. కళ్ళు నెత్తిమీద పెట్టుకుని అడ్డదిడ్డంగా మన జాతిని కర్కశ పాదాల క్రింద తొక్కేసి పుణ్యం సంపాదించుకున్నాను అనుకుంటుంది. ఇతర ప్రాణులకి హాని చేయకుండా వుండటమే అసలైన పుణ్యం అని అన్నీ తెలుసు అనుకున్న యీ మానవులకి తెలియదా అంది ఆవేశంగా..
నువ్వు..వూరుకుంటావా కాసేపు. నన్నసలు మాట్లాడనివ్వవా అని మగ చీమ భార్యని కసురుకుని చెప్పనారంభించింది.
మానవులు వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి,కోర్కెలు కోరుకొవడానికి గుడికివచ్చి నైవేద్యాలు పెట్టి మనకి ఇంత ఆహారం పెడుతుంటారు. కానీ మనం మన ఆత్రం కొద్ది ఆ ఆహారాన్ని జేరవేసుకునే ప్రయత్నంలో..వారి దారికి అడ్డువచ్చి వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగి పోతున్నాం, అది వాళ్ళ తప్పు యెలా అవుతుంది.
బలవంతునిదే రాజ్యం. బలవంతుల చేతుల్లో బలహీనులు నలిగి పోవాల్సిందే కదా అంది.
ఆడ చీమ ఓరి దేవుడో, నా మొగుడికి గుళ్ళు గోపురాలు తిరిగి జ్ఞానం వచ్చేసినట్లుంది.
ఇప్పుడు కాళ్లు,నడుము విరకొట్టుకుని అవిటితనంతో అటుచావకక బతకక మంచంలో పడి వుంటే నేను నా బిడ్డలు యెలా బతకాలి. నా పిల్లలు యింకా కసుచీమలు. నా నౌఖరిగిరి యేమగును. నేను యేమి చేయను అని ఆరునొక్కరాగం మొదలెట్టింది.

నాకు గుండెలు దడ దడలాడుతున్నాయి.నష్ట పరిహారం క్రింద యేమడుగుతుందో, యిక లాభంలేదు డిఫెన్స్ మొదలెట్టాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా నోరువిప్పాను.
రాణి చీమ గారు నా వల్ల పొరబాటు జరిగినది వాస్తవం. నేను కాదనడం లేదు.
అయినా మీ సైనికులు మా యిండ్లలో రాజాలా దొరబడి మా ఆహారపదార్ధాలని దొంగిలించి దొంగదారులలో మీ గిడ్డంగులకి తరలిస్తుంటే కూడా గెమాక్సిన్ చల్లకుండా,రక్షణ రేఖ గీయకుండా వూరుకుంటున్నాను.
నా కొడుకైతే..మీ పుట్టలు వెతుక్కుంటూ వచ్చి అక్కడ బియ్యం, బెల్లం, పంచదార లాటివి జల్లి మరీ వస్తాడు.
నేనయితే మీ కోసం వొక డబ్బాలో..పంచదార పోసి పెట్టి మీకు వదిలేసి వేరొక డబ్బాలో పంచదార పోసి ప్రిజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మా పదార్దాలన్నీ మీ కంపుతో వాడకోను వీలు లేకుండా వుంటే కూడా చూస్తూ వూరుకుంటున్నాను మిమ్మల్ని చంపడం పాపమని. అదీ కాకుండా నిత్యం పూజలో పండు, ప్రసాదం కాకుండా మీ కోసమని పటికబెల్లం పలుకులు ప్రత్యేకంగా తెచ్చి అవే ప్రసాదంగా పెడుతున్నాను.
సాద్యమైనంత జాగ్రత్తగా మిమ్మల్ని మీ బిడ్డలని త్రోక్కకుండా నిర్దాక్షణ్యంగా వూడ్చి పడేయకుండా మా తుడుపుడు చర్యలలో రుద్దిపడేయకుండా సమయం వెచ్చించి జాగ్రత్తలు తీసుకుని మీకు హాని కలగకూడదని తాపత్రయపడతాను.
అల్లాగే మా ఏ.సి.గదుల్లో మా మంచాల కింద పరుపుల కింద చేరి కాపురాలు పెట్టి చల్లగా గుడ్లు పెట్టి మీ సంతతి వృద్ది చేసుకుంటుంటే మమ్మల్ని యే౦ చేయడంలేదు కదా అని తీవ్రంగా అడుగుతూ నేను చూసి చూడనట్లు వూరుకుని యింట్లో వారితో యెన్ని తిట్లు తింటున్నానో, అది మీకు తెలుసా?
దోమల లాగా మీరు యే మలేరియనో,చికెన్ గున్యా నో..యిస్తారనుకుంటే..ఒక్క పిపీలికం వుండేదా? యే హిట్టో ,పెస్ట్ కంట్రోల్ మందో కొట్టి సమూలంగా నాశనం చేసేవారిమి అన్నాను.
నాకు మీజాతి పై గౌరవభావం. మీ క్రమశిక్షణ,ఆహారపు వేట,సేకరణ,ముందుచూపు,కష్టించి పనేజేసే తత్వం అన్నీ..నాకిష్టం. మీ జాతిని చూసి నేర్చుకోవాల్సిన విషయాల గురించి అందరికి చెపుతుంటాను అని వాస్తవాన్నేఅందంగా నాటుకునేటట్లు చెప్పాను.
అవును రాణివారు ఆ..మానవ స్త్రీ చెప్పినది నిజం అని గాయపడిన చీమ నన్నే సపోర్ట్ చేసింది.
రాణి చీమ గారు నా వల్ల పొరబాటు జరిగినది వాస్తవం. నేను కాదనడం లేదు.
అయినా మీ సైనికులు మా యిండ్లలో రాజాలా దొరబడి మా ఆహారపదార్ధాలని దొంగిలించి దొంగదారులలో మీ గిడ్డంగులకి తరలిస్తుంటే కూడా గెమాక్సిన్ చల్లకుండా,రక్షణ రేఖ గీయకుండా వూరుకుంటున్నాను.
నా కొడుకైతే..మీ పుట్టలు వెతుక్కుంటూ వచ్చి అక్కడ బియ్యం, బెల్లం, పంచదార లాటివి జల్లి మరీ వస్తాడు.
నేనయితే మీ కోసం వొక డబ్బాలో..పంచదార పోసి పెట్టి మీకు వదిలేసి వేరొక డబ్బాలో పంచదార పోసి ప్రిజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మా పదార్దాలన్నీ మీ కంపుతో వాడకోను వీలు లేకుండా వుంటే కూడా చూస్తూ వూరుకుంటున్నాను మిమ్మల్ని చంపడం పాపమని. అదీ కాకుండా నిత్యం పూజలో పండు, ప్రసాదం కాకుండా మీ కోసమని పటికబెల్లం పలుకులు ప్రత్యేకంగా తెచ్చి అవే ప్రసాదంగా పెడుతున్నాను.
సాద్యమైనంత జాగ్రత్తగా మిమ్మల్ని మీ బిడ్డలని త్రోక్కకుండా నిర్దాక్షణ్యంగా వూడ్చి పడేయకుండా మా తుడుపుడు చర్యలలో రుద్దిపడేయకుండా సమయం వెచ్చించి జాగ్రత్తలు తీసుకుని మీకు హాని కలగకూడదని తాపత్రయపడతాను.
అల్లాగే మా ఏ.సి.గదుల్లో మా మంచాల కింద పరుపుల కింద చేరి కాపురాలు పెట్టి చల్లగా గుడ్లు పెట్టి మీ సంతతి వృద్ది చేసుకుంటుంటే మమ్మల్ని యే౦ చేయడంలేదు కదా అని తీవ్రంగా అడుగుతూ నేను చూసి చూడనట్లు వూరుకుని యింట్లో వారితో యెన్ని తిట్లు తింటున్నానో, అది మీకు తెలుసా?
దోమల లాగా మీరు యే మలేరియనో,చికెన్ గున్యా నో..యిస్తారనుకుంటే..ఒక్క పిపీలికం వుండేదా? యే హిట్టో ,పెస్ట్ కంట్రోల్ మందో కొట్టి సమూలంగా నాశనం చేసేవారిమి అన్నాను.
నాకు మీజాతి పై గౌరవభావం. మీ క్రమశిక్షణ,ఆహారపు వేట,సేకరణ,ముందుచూపు,కష్టించి పనేజేసే తత్వం అన్నీ..నాకిష్టం. మీ జాతిని చూసి నేర్చుకోవాల్సిన విషయాల గురించి అందరికి చెపుతుంటాను అని వాస్తవాన్నేఅందంగా నాటుకునేటట్లు చెప్పాను.
అవును రాణివారు ఆ..మానవ స్త్రీ చెప్పినది నిజం అని గాయపడిన చీమ నన్నే సపోర్ట్ చేసింది.
ఇదిగో, ఇంటాయనా! నువ్వెన్ని అయినా చెప్పు.ఒక్కసారైనా ఆమెని నేను కుట్టకుండా వదలను. అప్పుడు గాని నా కక్ష తీరదు అంది అక్కసుగా కోపంగా.
అప్పుడు మన బిడ్డలకి..నేనున్నా వొకటే నువ్వు లేకపోయినా వొకటే అన్నారు..మగచీమ.
సరే సరే..యింతటితో వదిలేయండి. ఇప్పటికే చాలా సమయం పని గంటలు వృధా.
ఆ గాయపడిన సైనిక చీమవారిని..వైద్యశాలకి..పంపి..ఈ..ఆడ చీమవారికి పని గంటలు యెక్కువ యిచ్చి ఆహారం యెక్కువ యివ్వండి అని ఆదేశములు యిచ్చి వెనుదిరిగి వెళ్ళారు రాణి చీమవారు.
భలే భలే రాణివారు. మీ తీర్పు అద్భుతం అని నేను యెగిరి గంతులేస్తున్నాను. మొత్తానికి నాకూ పిపీలిక భాష వచ్చేసిందోచ్! అనుకుని సంతోష పడుతున్నాను.
ఎవరు..ఆ రాణి వారు! యేమా తీర్పు, లేచి "టీ" పెట్టు ..అని ఆర్డర్స్ . టక్కున మేల్కొని ఓస్ ..యిదంతా కలా ? అనుకున్నాను వులికిపడి లేచి చుట్టూ చూసుకుంటూ వంట గదిలోకి వెళ్లాను.
ఇది వో చీమ కథ. కథే కదా అని తక్కువ చేయకండీ..
(నిత్యం మనకి తెలియకుండానే మన చేత బాధింపపడి ప్రాణాలు కోల్పోతున్న జీవాల గురించి ఆలోచనతో)
4 కామెంట్‌లు:
మొదట్లో కథ కొంచం హాస్యంగా అనిపించినా అందులోని నిజాలు, అవున కదా అనిపించాయి. బాగుంది చీమలకథ.
వనజవనమాలి గారు బాగుందండి. చీమల విషయం లో ఇంట్లో నేనే ప్రవర్తించే తీరు చూసి ఇలానే ఇంట్లో వాళ్ళు నవ్వు కుంటారు . మనుషులకు భార్య, భర్త పిల్లలు ఉన్నటుగానే వాటికి ఉంటాయని నా ఫీలింగ్ . అలా ఆలోచించడం నా ఇష్టం దీని వల్ల సమాజానికి కానీ , మీకు కానీ నష్టం లేదు కదా అని వాదిస్తాను. ఒక సారి ఈ క్రింది లింక్ చూడండి ....
http://kalanijamayega.blogspot.com/2011/07/blog-post.html?authuser=0
వనజ వనమాలి గారు మీ చీమా కథ బాగుంది, చీమా కున్న లక్షణాలు మానవులకు ఉండి ఉంటె మనం చాలా అబివృది చెందే వాళ్ళం, చీమలు చుడండి ఎంచక్కా లైన్ లో నడుస్తూ ఉంటాయి, కానీ ఇంత తెలివి ఉన్న మానవులు మాత్రం ట్రాపిక్ సింగనల్ దెగ్గర వెనుక వచ్చి అగరు , ముందు ఆగిన వాడి ముందు అడ్డగ్గా ఆపుతారు, లైన్ లో వెళ్లారు రోడ్ మీద ఉన్న లైన్ ని అసలు పట్టిచుకోరు, చీమలు చుడండి వాటికీ ఏమి లైన్ ఉండదు ఐన సక్కగా పోతాయి, లైన్ కనపడుతున్న మనకు మాత్రం తలకాయ ఉండదు, కష్ట పడే విషయ లో ఐన చీమా లను చూసి మనం చాలా నేర్చుకోవాలి , అవి తాన బరువు కన్నా 20 రెట్లు ఎక్కువ బరువు ని తీసుకొని తన వారి కోసం తీసుకొని పోతాయి , కానీ మానవులు దొరికిన కాడికి మింగ్గేస్తారు, మనం చీమా లతో పోలుచుకోవటానికి కూడా అర్హత లేదు అని నాఅభిప్రాయం , మీ పోస్ట్ బాగుంది ధన్యవాదములు
మొదట్లో నవ్వుకుంటూ చదువుతూ ఆలోచింపజేసేటట్టు రాసారు .సృష్టిలో ప్రతి జీవి మనషి లాగే ఉహిస్తూ ఉంటుంది అని బాగా చెప్పారు.ఒక సారి ఈ క్రింది లింక్ చూడండి.
http://gavidipydinaidu.blogspot.com/2011/07/blog-post_11.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి