స్నేహం అంటే..
నేను గతంలో.. ఈ విషయమై రెండు పోస్ట్ లు వ్రాసాను.అందుకే..మళ్ళీ వ్రాయబోను. నాకు చాలా ఇష్టమైన పాటలు రెండు.. నా చిన్నప్పుడు విన్న పాటలు..ఇప్పటికి వినే పాటలు.. ఒకటి రంగూన్ రౌడీ. లో..ఓ..జాబిలీ వెన్నెలా ఆకాశం ..వేటూరి గారు అరటి పండు ఒలిచి పెట్టినంత తేలికగా చిన్న చిన్న పదాలతో.. ఎంత గొప్ప భావాన్ని జోప్పించారో!.
అందుకు కారణం అంతకు ముందే వచ్చిన ముకద్దర్ కా సికిందర్ ..చిత్రంలో.. కళ్యాణ్ జీ ఆనంద్ జీ..అందించిన ట్యూన్స్ కావచ్చు..లేదా అంజాన్ సాహిత్యం కావచ్చు ఏమో! కానీ చిన్నతనం లోనే..ఆ పాట సాహిత్యం అంటే చాలా ఇష్టం ఏర్పడింది.
ఇంకొక విషయం ఏమంటే.. ఆ చిత్రాన్ని వడ్డే రమేష్ (వడ్డే నవీన్ వాళ్ళ తండ్రి.) వాళ్ళు నిర్మించిన చిత్రం ..నవీన్ తల్లి.. (నళిని) మా వూరి ఆడపడుచు.అందుకని.. వారి బేనర్ పై నిర్మించే చిత్రాలపై.. మావూరి వారందరికీ.. క్రేజ్ ఉండేది.పెద్ద వాళ్ళు..సినిమాలకి వెళుతూ.. పిల్లలని తోడ్కొని వెళ్ళేవారు. అలా ఆ చిత్రం చూసి.."ఓ..జాబిలీ" పాట కి ..వీరాభిమానిని అయ్యాను.
తర్వాత నేను ఇంటర్ లో ఉండగా.. డిల్లీ నుంచి వచ్చి మా కాలేజ్ లో చేరిన ఒక అమ్మాయి..రోజు అదే పాట పాడేది. తన గొంతు ఎంతో..బాగుండేది. అలా హిందీ పాటకి.. బానిస అయి పోయి..తర్వాత వివిదభారతిలో..రెండు బాషలలో..ఆ పాటలు విని.. తరాత దూరదర్శన్ లో.. ముకద్దర్ కా సికిందర్ చూసి..అమితాబ్..ఎక్స్ ప్రేషన్స్ కి.. హృదయం కరిగి కన్నీరు మున్నేరు అయిపోయి..(పైకి..కనపడుతూనే ఉండటం స్పెషల్ అన్నమాట) మహదానందంతో..లీనమైపోతూ ఉంటాను. ఇది ఈ పాటల వెనుక కథ.
ఎందుకో..ఓ..జాబిలీ సోలో..(పి.సుశీల)ఇష్టం నాకు.
పాట సాహిత్యం:
ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం
ఉన్నదే నీకోసం (ఓ )
ఎదురు చూసింది నిదుర కాసింది (ఎ)
కలువ నీ కోసమే..
వెలుగువై రావోయి
వెలుతురే తేవోయి
నువ్వు లేక నవ్వ లేక
ఎందరున్నా ఎవరు లేక
జంట గాని తోడు లేక ఒంటిగా నేనుండలేను ..
స్నేహ దీపాలు వెలగనీ చాలు
చీకటే లేదోయి వెలుతురే కావోయి
వెలుతురే తేవోయి..(ఓ)
గువ్వ లాగా నువ్వు రాగా
గూడు నవ్వే గుండె నవ్వే
వేకువల్లె నీవు రాగా
చీకటంతా చెదిరిపోయే
తుడిచి కన్నీళ్లు కలసి నూరేళ్ళు (తు)
జతగా ఉందామోయి
వెలుగువే నీవోయి వెలుతురే కావోయి..(ఓ)
బాల్యంలో.. మిత్రుని కోసం ఓ..అమ్మాయి పడే ఆరాటం..యెంత బాగా చెప్పారో కదా వేటూరి.
అలాగే .. డ్యూయెట్ కి..అదే సాహిత్యం.
తెలుగు పాట సాహిత్యానికి..దృశ్యానికి.. హింది పాట నేపధ్యం కి,భావానికి..అభిమాని ని.. అయి..ఈ పాటలు రెండు స్నేహం ..కోసమే..కదా! అందుకే గుర్తు చేస్తూ.. వింటూ..చూస్తూ..
ఏ వయసులో నైనా మనిషి కి.. మనసుకి..ఒక మనసైన స్నేహం కావాలి. ఆ స్నేహం కోసం ఆరాటపడే.. రెండు హృదయాల పాటలే.. స్నేహ హృదయానికి..ఈ నాటి బహుమతులు.. వనజ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి