2, ఏప్రిల్ 2012, సోమవారం

ప్రేమాభిషేకంలో 8 వ పాట ఇది.

నిన్నటి రోజున నేను చెప్పిన పాట .. ఇది. చాలా రోజుల క్రితం విన్నాను. గుర్తుచేసుకుని సాహిత్యం అందించాను. ఎక్కడైనా  చిన్న చిన్న తప్పులు ..కూడా..  లేకుండా ఉన్న సాహిత్యం ఇది.

జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో
మారుతుంది చూడు వింత వింత రంగుల్లో(జీ )
అదే.. జీవితం ..ఇదే.. శాశ్వతం..(జీ)

చీకటి వెలుగుల లోకంలో చీకటి కిటికీ మూసేయి 
కష్ట సుఖాల  కలయికలో కష్టాలకి తెర వేసేయి ..(చీ)
వెలుగులో వెలిగిపో ,సుఖములో మునిగిపో
నిన్నొక కథగా నేడొక భ్రమగా రేపొక కలగా
కథగా,భ్రమగా,కలగా మరచిపో..
నాలో కలసి పో..
జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో
మారుతుంది చూడు వింత వింత రంగుల్లో
అదే.. జీవితం ..ఇదే.. శాశ్వతం..
మూడునాళ్ళ జీవితానికి మూడుముళ్ళు వేయొద్దు
ముళ్ళు కోరే మనసుంటే నీ గుండెల్లో చోటివ్వద్దు (మూ)   
మనిషిగా మరచిపో ,మనసుగా నిలిచిపో
నీవొక అలగా, నేనొక శిలగా,విధి ఒక వలగా
అలగా,శిలగా,వలగా మరచిపో..
జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో
మారుతుంది చూడు వింత వింత రంగుల్లో
అదే జీవితం ..ఇదే శాశ్వతం..

ఈ పాట వినాలనుకుంటే.. ఆకాశవాణి  శబ్ద భండాగారం విజయవాడ  వారి వద్ద లభ్యం.