11, ఏప్రిల్ 2012, బుధవారం

ఈ రోజుల్లో

ఈ రోజుల్లో...


అవునండీ .. ఈ రోజుల్లో...నే.. అది ఒక సినిమా పేరు.. అలాగే.. సమయోచితం కూడా గుర్తు చేస్తూ.. ఒక మహత్తరమైన పాట..(అబ్బే..నాలాటి కంట్రీ ఉమెన్ కి నచ్చని) యూత్.. కి బాగా నచ్చుతుంది అనుకుంటాను. 
సినిమాల లోని సంభాషణ లని యువత  అనుకరిస్తున్నారా..లేక యువత మాట్లాడే భాషని సినిమాల లోని సంభాషణ లాగా వ్రాస్తున్నారా?

ఇది పిల్లల దిగజారిన భాషా సంస్కారమా..లేక..సినిమా సంస్కారమా? 
పిల్లలు మాటలాడే భాషని పెద్దలు ఇండ్లలలో మర్చలేరా?  

ఏమిటో..నండీ..నాకు" రామ " అంటే..______ మాట లాగా వినబడుతుందని అనుమానంగా ఉందని తీర్మానిన్చేస్తారేమో.. అన్న దిగులు,భయం ఉంది. ఏం చేయాలి చెప్పండి. ?  

ఇదిగో..ఈ పాట విని   " సెల్ "    సంభాషణ లు.. పాటగా.. ఎలా ఉన్నాయో..కాస్త చెబుదురూ...! కొంత మంది అమ్మాయిలూ..తప్పేముంది? బయట  ఎలా మాట్లాడుకుంటున్నారో..అలాగే ఈ పాట ఉంది అన్నారట. 

అలా మాట్లాడే పిల్లల్లో.. మా అబ్బాయి  ఉండకూదదనుకుని.. ఈ పోస్ట్.
ఎవరికైనా ..ఇలాటి తరహా సంభాషణలు నచ్చకుంటే.. సినిమా బాగుందా లేదా అని కూడా చూడవద్దు..నిరసన తెలిపి.. గళం విప్పి చెప్పండి. "ప్రశ్నిస్తే.. పోయేది ఏం లేదు.. రాబోయే  చైతన్యం తప్ప".. 

7 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

జాగ్రత్తగా పరిశీలిస్తే అశ్లీలత అనేది ఒక పెధ్ద వ్యాపార వస్తువు అనేక రూపాల్లో. నిజానికి యేది అశ్లీలం యేది కాదు అని నిర్వచించటం కూడా చాలా కష్టమైన పనే! దీని పైన మనుష్యులకు సహజంగా ఉండే కుతూహల సహజాతజనికతమైన ఆసక్తిని తెలివైన వాళ్ళు రకరకాలుగా సొమ్ము చేసుకుంటున్నారు.

సాహిత్యంలో కూడా భక్తి ముసుగు తొడగబడిన అశ్లీలసామాగ్రికూడా చాలానే ఉంది. జయదేవుని అష్టపదులు కొత్తగా రాధ అనే శృంగారనాయకిని పరిచయంచేయటంతో పాటు విచ్చలవిడి సంభోగశృంగారవర్ణననూ అందించాయి. మనం అక్కడ భక్తిని పట్టుకుని పరవశిస్తున్నాం కాని, సంస్కృతభాషలోని పచ్చి కాముక వ్యవహారాన్ని కృష్ణపరమాత్మ మీద రుద్దబడటాన్ని గ్రహించలేకున్నాం. సమాజం తొందరగానే అటువంటి శృంగారం సాహిత్యంలో సరే ననే స్థితికి వచ్చింది. ఉదాహరణకు పోతనగారి భాగవతం దశమస్కంధం లోని యీ పద్యం చూడండి.

కం. నా కొడుకును నా కోడలు
నేకతముగ పెనగ పాము నీతడు వైవన్
కోక లెరుంగక పారిన
కూక లిడెన్ నీ సుతుండు గుణమె గుణాఢ్యా?

ఇందులో సున్నితమైన హాస్యం ఉన్నమాట వాస్తవమే కాని, ఇటువంటివి వ్రాయటానికి కారణం జయదేవాదుల ప్రభావమేమో! రాయల కాలంనాటి ముధ్దుపళని అనే వేశ్య వ్రాసిన రాదికా స్వాంతనం ఇటువంటి సంభోగశృంగారవర్ణనా ప్రధానమైన కావ్యమే. ఈ కావ్యాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులుగారు ప్రచురిస్తే అప్పటి బ్రిటిష్ దొరతనంవారు నిషేధించారు. ఆ నిషేదం విషయమై బెంగుళూరు నాగరత్నమ్మగారి పోరాటం చేసారు కూడా.

సాహిత్యక్షీణయుగంలో చంద్రరేఖావిలాపం వంటి అచ్చపు బూతు కావ్యాలూ తెలుగులో వచ్చాయి.

సరే సమకాలీన సమాజం విషయానికి వస్తే, సినిమాపాటలద్వారానే ప్రజలకు సాహిత్యం అందుతున్నదని యెవరో చంద్రబోసుగారట ఒక మాట అన్నారు. మొన్న ఈనాడు దినపత్రికలో వచ్చింది. నాకు నచ్చని మాటే. కాని తెలుగు భాషా సాహిత్యాల దుఃస్థితి అలాగే ఉన్నట్లుంది. వ్యావహారిక భాషోధ్యమం పుణ్యమా అని మనం మాట్లాడే భాషకు ఒక ప్రామాణీకత యోగ్యత అంటూ యేమీ పట్టించుకోకపోయే సరికి, తెలుగు దుర్గతిలో పడింది మరి.

కవులుగా చలామణీ అయ్యేవారిలోకూడా డొక్కశుద్ధి తగ్గుతున్నది కదా. నేటి సినిమా కవుల గురించి యేమి చెప్పాలి. వీళ్ళు ప్రచారం వస్తుందంటే దాని వలన డబ్బు వస్తుందంటే యే చెత్త అయినా వ్రాస్తారు. అందుకే దర్జాగా బూతులు వ్రాసుకుంటూ గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు తమ గురించి.

ఒక పాతకాలపు శతక కవి చౌడప్ప ఇలా అన్నాడు.
కం. బూతనిన నవ్వ్హుచుందురు
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
బూతులు నీతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా!

జనానికి వెగటు పుట్టేదాకా వేచిచూడటం తప్ప చేయగలిగింది కనిపించటం లేదు.

Madhav చెప్పారు...

నిజమేనండి ఈ సినిమా లో చాలా బీప్స్ వున్నాయి. మీ లాగే నేనూ ఆశ్చర్య పోయాను. నాకు తెలిసి చాలా కొద్దిమంది ఇలాంటి ---మాటలు వాడుతారు అనిపిస్తోంది, సినిమా కోసం ఇలాంటి ట్రిక్సు ప్లే చేయడం మామూలైపోయింది ఈ రోజుల్లో..

అజ్ఞాత చెప్పారు...

ఏమో! పూర్తిగా వినను కూడా లేకపోయా! రోజులలా ఉన్నాయి!! ఏమీ చెయ్యలేము, చూసి బాధపడటం తప్పించి!!!

వనజవనమాలి చెప్పారు...

Shaamaleeyam gaaru.. Thank you very much. mee vivaranaki dhanyavaadamulu.

@Madhav.. Thank you.

oddula ravisekhar చెప్పారు...

సినిమాలకు పిల్లలతో కలిసి వెళ్ళాలంటే ఆలోచించాల్సి వస్తుంది.,

వనజవనమాలి చెప్పారు...

రవిశేఖర్ గారు..మీరన్నది నిజం. సినిమాకి పిల్లలతో కలసి వేల్లగాల్గాతదమా!? భార్యాభర్తలు కూడా కలసి చూడలేనట్లు ఉంటున్నాయి. మీ అభిప్రాయానికి ధన్యవాదములు.

@కష్టేఫలే మాస్టారు... ఇప్పుడు వినలేక చెవులు మూసు కుంటున్నాం .ఇంకొన్నాళ్ళకి ఈ సినిమాలు,దృశ్య మధ్య్యమాలని వేలివేయలేక మనని మనమే వేలివేసుకుంటాం. ఓ..కొత్త ప్రపంచం కావాల్సి వస్య్హుంది తప్పదండి. ధన్యవాదములు..

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పచ్చి శృంగార కావ్యాల బాట నడిచి
వ్రాసినది గాని , చదివిన వారు గాని ,
పరవశించిన వారున్ను పరువు గల్గు
“ పండితోత్తములే” గాని – ప్రజలు గాదు

అక్షరాస్యత లేదు నాడంతగా , క
నంగ నేడు వాటిని జదువంగ దివురు
నాధుడే లేడు గాన , ఆనాటి అట్టి
కావ్యముల వల్ల నష్టమ్ము కనము , కాని...

నేటి సినిమాల , టీవీల ధాటి వల్ల
వారు వీరేమి యెల్ల చూపరులు చెడుట
ఖాయ , మశ్లీలమును బాప కలిసి నడిచి
ఉద్యమించుట యొక్కటే ఉత్త మంబు .

బ్లాగు సుజన-సృజన