8, ఏప్రిల్ 2012, ఆదివారం

నా అభిరుచి

ఈ చిత్రంలో చిత్రాన్ని గమనించండి.

అప్పుడెప్పుడో.. అంటే 2004 లో అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రపటాన్ని నేనే చిత్రించి ఆకాశ వాణి వివిధ భారతి విభాగం కి పంపాను. ఈ చిత్రం పై శ్రోతల ఉత్తరాల కార్యక్రమం.."చిత్రలేఖావళి" లో పదునైదు నిమిషాల సేపు వర్ణిస్తూ.. ఈ చిత్రం లో నేను చిత్రాలతో ఉదహరించిన సాహిత్యాన్ని వివరిస్తూ.. కార్యక్రమం చేసారు. ఆ ఏనౌన్సర్ లు ఏ .శారద,బి .వెంకటేశ్వర్లు..గార్లు.

తరువాత కొన్ని నెలల పాటు ఆకాశవాణి శబ్ద భాండగారంలో  అందరికి కనువిందు చేసి.. మన శ్రోత "వనజ"గారి అభిరుచి గ్రేట్ అని కితాబులు ఇచ్చేవారు. ఆ రోజులు మర్చిపోలేను కూడా. ఏదో అభిరుచి కానీ అంత చేయి తిరిగిన ఆర్టిస్ట్ నేమి కాదండి. ఏదో..ఉత్సాహం అంతే! ఈ రోజు ఎందుకో అలా గుర్తుకు వచ్చింది.

ఇంతకీ నేను నాకు అత్యంత ఇష్టమైన పాట సాహిత్యాన్ని అనుసరించి  ఆ చార్ట్ రూపొందించాను. చిత్రం లో ఆ పాటకి వన్నె తెచ్చిన మురళీధరుడు ఉన్నారు. చిత్రం పేరునే తన పేరు గా ప్రసిద్ది గాంచిన వారి సాహిత్యం ఈ పాట ప్రత్యేకం .
ఇంతకీ ఏ పాట అంటారో.. గమనించి  చెప్పగలరా!?
 .
ఈ పాట ఏదో చెప్పండి. !?

16 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

వనజగారు.. అసలు picture clear గా లేదండి.. అసలు అందరి కంటే మీ ప్రశ్న కి జవాబు చెప్పలని ఉవ్విళూరుతూ చిత్రాన్ని చూడటానికి ప్రయత్నించాను. clear గా లేదు. మల్లి upload చెయ్యగలరా?

వనజవనమాలి చెప్పారు...

sorry Jalataaru vennela gaaru. mee peru lone konchem maarchite aa chitram peru. ide Clue!

intakannaa clear gaa pic saadhyapadaledu.sorry.

జలతారువెన్నెల చెప్పారు...

నాకు తెలిసిపోయిందొచ్! హరిప్రసాద్ చౌరాసియ బాన్సురి ప్లే చేస్తున్నట్టున్నారు!
సిరివెన్నెలగారి " విధాత తలపున" అంతే కదండి?

వనజవనమాలి చెప్పారు...

ఓహ్.. గుడ్.. "సిరివెన్నెల" చిత్రం లో విధాత తలపున .. పాట. భలే క్యాచ్ చేసారు. ధన్యవాదములు.వెన్నెల..సిరివెన్నెల..(శ్రీ) వెన్నెల .

ఈ లింక్ లో ఈ పాట గురించి నా స్పందన చూడండి.
http://vanajavanamali.blogspot.in/2011/01/naakistamaina-paata_8031.html

అజ్ఞాత చెప్పారు...

సిరివెన్నెల గారని ఊహించగలిగాను కాని... నేను అనుకున్న సాహిత్యం " చందమామ రావే..." అన్న పాట లోది అనుకున్నాను

♛ తెలుగు పాటలు ♛ చెప్పారు...

"వనజ"గారి అభిరుచి గ్రేట్.."వనజ"గారి బ్లాగ్ సూపర్.. "వనజ"గారి ఆప్యాయత అమోఘం...

వనజవనమాలి చెప్పారు...

mhsgreamspet ..Ramakrishna gaaru..

chandamaama raave paata gurinchi inko saari cheppukundaam. aa paata koodaa chaalaa ishtam. Thank you very much.
@ Balu.. Thank you very much. Thank you very much takkuvemo! THanks a lot a lot.

రాజి చెప్పారు...

"మన శ్రోత "వనజ"గారి అభిరుచి గ్రేట్"
వనజవనమాలి గారూ..
రేడియో వాళ్ళు చెప్పింది నిజమేనండీ
మీ అభిరుచులు నిజంగా గొప్పవే..

సామాన్య చెప్పారు...

very nice

వనజవనమాలి చెప్పారు...

రాజీ .. గారు..ధన్యవాదములు. ఉత్తమాభిరుచి కల్గిన స్నేహితులు ఉంటే..వారి సువాసనలు మనకి అబ్బుతాయి. నాకున్న అలాటి స్నేహితులలో మీరు ఉన్నారు.

వనజవనమాలి చెప్పారు...

Saamaanya gaaru Thank you very much!

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ మీరు మళ్ళీ కామెంట్ అక్సేప్ట్ చేస్తున్నారు..బావుందండీ..నిజంగానే మీ అభిరుచి గ్రేట్. మీరు అనువదించిన హిందీ పాటల అభిమానిని నేను..

జ్యోతి చెప్పారు...

వనజగారు ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.. అందుకే ఇలా రాసుకున్నా..

http://jyothivalaboju.blogspot.in/2009/07/blog-post_12.html

వనజవనమాలి చెప్పారు...

జ్యోతి గారు ధన్యవాదములు. ఈ పాట సాహిత్యంకి అర్ధం తెలిసి వింటే కావ్యమృతంని సేవించినట్లే ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాట.

నేను నా బ్లాగ్ కి సిరివెన్నెల,చందమామ ఈ రెండు పేర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు అవకాశం లేక ఇక నా పేరుతొ.. ఖరారు చేసుకోవాల్సి వచ్చింది. అలాగే పాట స్క్రూలింగ్ మీ ఈ బ్లాగ్ లో చూసి అయ్యో! నాకు అంతటి అదృష్టం దక్కలేదే అనుకున్నాను. ఈ పాటని ఇష్టపడని వారు ఉండరు. కానీ నన్ను ఎన్నో సార్లు అమ్మ ఒడిలా సేదీర్చిన పాట..ఈ పాట. ముఖ్యంగా పండిట్ హరిప్రసాద్ చౌరాసియ గారి బాన్సురి..మనని..మైమరపింపజేస్తుంది. నా అభిమానాన్ని చాటుకుంటూ.. ఇలా పాట సాహిత్యాన్ని చిత్ర పటం గా చేసి మురిసిపోయాను. అదండీ..విషయం. ఎవరికైనా ఎప్పటికైనా ఇష్టపడే పాట ఇది. అందులో మనం ఉన్నందుకు సంతోషకరం. ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. బాగున్నారా! నా పాటల అభిరుచి నచ్చినందుకు ధన్యవాదములు.

oddula ravisekhar చెప్పారు...

సిరివెన్నెల అభిమానులంతా ఒక చోట చేరారన్నమాట.నేను కూడా నండోయ్ .మొత్తానికి వనజగారు అందరిని కలిపారు .బాగుందండి మీ అభిరుచి.హరిప్రసాద్ వేణుగానం ఎప్పటికి సజీవం.