7, ఏప్రిల్ 2012, శనివారం

లవ్ లీ Ankhiyon Ke Jharokhon Se

నాకు   నచ్చిన  హిందీ  పాట ఇక్కడ   వింటూ  ఈ పాట గురించి చూడండి.

అఖియోంకే జరోఖోన్ సే ... 

ఈ పాటకి పెద్దగా పరిచయం అక్కరలేదు. చూస్తే తప్పకుండా మీకు నచ్చేస్తుంది. నాకు అయితే బాగా నచ్చిన పాట.

ఏమిటండీ..రోజు ఇలా హిందీ పాటలతో చంపేస్తున్నారు అంటారా?

ఏమిటో నండీ ..ఇలా నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి. మరీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే..దీర్ఘకాలిక రోగాలు పాలబడతాయని..హాయిగా పాటలు ప్రక్కనే నా ప్రపంచం నిర్మించుకుంటాను.

అందుకేనేమో..మిన్ను విరిగి మీద పడ్డా. పాట లో లీనమై..పోయి  పాలు పొంగబెట్టు కుంటూనో, కూరలని ..బొగ్గులాగా ముద్దుగా చూసుకుంటూనో..అక్షింతలు వేయించుకోవడం అలవాటు అయిపొయింది.

మనిషికొక వెర్రి .. ఆ వెర్రి లో యెంత ఆనందం ఉందొ..ఈ పాట విని నా వెర్రికి ఓటేయడం మరువకండి.

ఒక అమ్మాయి తన మనసులోని భావాలని ఎలా చెపుతుందో..చూడండి.    

హిందీ కి తెలుగు అనువాదం ఇలా .. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది..వెనుకది  ముందు ముందుది వెనుకగా ..

కళ్ళ హెచ్చరికతో నేను చూసాను 
ఈ ఆహ్లాదకర వాతావరణం లో నువ్వు దూరంగా కనబడ్డావు 
ఆ హెచ్చరికని కొంచెం మూసివేసి నేను ఆలోచిచడానికి కూర్చున్నాను.
మనసులో నవ్వుతూ..నీవున్నావు 
మనసులో నవ్వుతూ నీవున్నావు (కళ్ళ)

ఒక మనసు ఉండేది నాదగ్గర ఇప్పుడు అది పోయింది 
నిన్ను పొందాక నాకు ఏదో (అయింది)జరుగుతుంది 
ఒకే ఒక భరోసాతో నేను అన్నీ వదిలి మర్చి పోయి కూర్చున్నాను (ఒకే)
ఇలానే ఈ వయసు జరిగిపోవాలి నీ తోడుతో జరిగి పోవాలి (కళ్ళ)  

బతుకుతున్నాను నిన్ను చూస్తూనే నీ కోసం చచ్చిపోతాను కూడా 
నువ్వు ఎక్కడ ఉంటావో ప్రియా ..అక్కడే నా లోకం కూడా 
రాత్రింబవళ్ళు (నీ క్షేమం కోసం)  నా మనసు ప్రార్దిస్తూ ఉంటుంది. 
నా ఈ నమ్మకాన్ని ఏది ఎప్పుడు కూడా పువ్వులా వాడిపోకుండా ఉండాలి(కళ్ళ)

ఎప్పటి నుంచి అయితే నేను నీ ప్రేమ (రంగులో)లో కరిగిపోతూ ఉన్నానో
మేల్కొని ఉండి నిద్రిస్తూనే ఉంటా,నిద్రలోను మెలుకువగా ఉంటాను 
నా ప్రేమ నిండిన కలలు (ను )ఎవరు,ఎక్కడ దోచుకోకూడదు (బలవంతంగా లాక్కోకూడదు)
మనసు ఇదే ఆలోచిస్తూ గాభరా పడుతుంటుంది 
ఇదే ఆలోచిస్తూ గాభరా పడుతూ ఉంటుంది 

కళ్ళ హెచ్చరికతో నేను చూసాను 
అందమైన వాతావరణాన్ని.
అక్కడ దూరంగా నువ్వు కనబడ్డావు 
కళ్ళు మూసి ఆ హెచ్చరికని ప్రక్కన పెట్టి కూర్చుని ఆలోచించ సాగాను 
మనసులో నవ్వుతూ నీవున్నావు
నా మనసులోనే నవ్వుతూ నీవున్నావు  

ఇంత హృద్యంగా మనసుని రాగరంజితం చేసే దృశ్య సమాహారమే ఈ పాట. నాకు బాగా నచ్చిన స్క్రీన్ ప్లే కూడా. ఇప్పటి సినిమాలతో పోల్చుకుంటే.. వేయి రెట్లు మేలైన పాట. వింటూ ఉంటేనే ఓ..మంచి భావనతో అలా తడిచి పోతాం.
 పాట చూసేయండి. ఎప్పటిలా నా ఫీలింగ్ ని చెప్పడం లేదు. ఎందుకంటె.. పాట చూస్తే మీకు ఓ.. డీప్ ఫీల్ లోకి  వెళ్ళడం ఖాయం కాబట్టి.    

 హిందీ సాహిత్యం.పాట వివరాలు ...

very touchy song.This song has soul in it.
lyrics ankhiyon ke jharokhon se
Ankhiyon Ke Jharokhon Se Maine Dekha Jo Saanware
Tum Door Nazar Aaye Badi Door Nazar Aaye
Band Karke Jharokhon Ko Zara Baithee Jo Sochne
Man Mein Tumhi Muskaye Man Mein Tumhi Muskaye
Ankhiyon Ke Jharokhon Se

Ek Man Tha Mere Paas Woh Ab Khone Laga Hai
Paakar Tujhe Hai Mujhe Kuchh Hone Laga Hai
Ek Tere Bharose Pe Sab Baithee Hoon Bhool Ke
Yoon Hi Umar Guzar Jaye Tere Saath Guzar Jaye
Ankhiyon Ke Jharokhon Se...

Jeeti Hoon Tujhe Dekh Ke Marti Hoon Tumhi Pe
Tum Ho Jahan Saajan Meri Duniya Hai Wahin Pe
Din Raat Dua Maange Mera Man Tere Waaste
Kabhi Apni Ummeedon Ka Kahin Phool Na Murjhaye
Ankhiyon Ke Jharokhon Se...

Maein Jab Se Tere Pyar Ke Rangon Mein Rangi Hoon
Jaagte Hue Soi Nahin Neendon Mein Jagi Hoon
Mere Pyar Bhare Sapne Kahin Koi Na Chheen Le
Man Soch Ke Ghabraye Yahi Soch Ke Ghabraye
Ankhiyon Ke Jharokhon Se...
Directed by Hiren Nag
Produced by Tarachand Barjatya
Starring Sachin
Ranjeeta Kaur
Music by Ravindra Jain
Distributed by Rajshri Productions
Release date(s) 1978

15 వ్యాఖ్యలు:

♛ తెలుగు పాటలు ♛ చెప్పారు...

!! వనజవనమాలి !!గారు పాట చాలా బాగుంది అండి.. మనసు ఒక మనసుని ప్రేమించినప్పుడు మదిలో కలిగే బావలు ఎలా ఉంటాయో బాగా చెప్పారు... మీరు కామెంట్స్ అల్లౌ చేసినందుకు చాలా సంతోషము అండి...

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ.. కామెంట్స్ Accept చేస్తున్నందుకు థాంక్సండీ..
మంచి పాట పరిచయం చేశారు..
ఈ పాట నా హిందీ సాంగ్స్ బ్లాగ్ లో కూడా పెట్టాలి!

వనజవనమాలి చెప్పారు...

Balu .. Thank you very much. song nacchinanduku chaalaa santOsham

@ Rajee gaaru.. Thank you very much.
paata nacchinanduku dhanyavaadamulu.

జలతారువెన్నెల చెప్పారు...

వనజ గారు..మీరు కామెంట్స్ accept చెయ్యడం నాకెంతో సంతోషంగా ఉంది.
నా చిన్నప్పుడు దూరదర్షన్ tv లో హిందీ సినిమాలు ప్రతి ఆదివారం ఒకటి ప్రసారం చేసేవారు.ఆణిముత్యాల్లంటి ఎన్నో సినిమాలు అప్పుడు చూసాను హిందీ లో.అందులో నాకు ఇప్పటికి గుర్తు ఉండిపోయిన కొన్ని సినిమాలలో ఇది ఒకటి. అసలు ఈ పాట గురించి ప్రస్తావించి నా చిన్నప్పటి రోజులు గుర్తుచేసారు నాకు. ఆ సినిమా చూసి రాత్రి అంతా ఏడ్చాను నేను. song ఒక్కటే కాదు touching,entire movie is so touching!Tragedy మూవీ కదా..కాని superb song అండి!

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు మీరు ఈ పాట పట్ల యెంత ఫీల్ అయ్యారో..మీ వ్యాఖ్య చెబుతుంది. కొన్ని చిత్రాలు,కొన్ని పాటలు మన మనసులపై బలమైన ముద్ర వేసి వెళతాయి.వాటిని మన మిత్రులందరితో పంచుకోవడం బాగుంటుందని నా ఉద్దేశ్యం. ఇలా ఎవరో ఒకరు.. చూసి అబ్బ..యెంత మంచి పాటో! అని అనుకుంటే సంతోషం.
ధన్యవాదములు.

జయ చెప్పారు...

చాలా మంచి పాటండి. ఏనాటికీ మర్చిపోలేను. మనసులో ముద్ర పడిపోయిన పాటిది. చాలా బాగా చెప్పారు.

వనజవనమాలి చెప్పారు...

Jaya gaaru.. Thank you very much.

Meraj Fathima చెప్పారు...

Ek Man Tha Mere Paas Woh Ab Khone Laga Hai...
"Jeeti Hoon Tujhe Dekh Ke Marti Hoon Tumhi Pe...."
"Tum Ho Jahan Saajan Meri Duniya Hai Wahin Pe"
అద్భుతమైన పాట వనజ గారూ. ఈ పాట రచన సంగీతం రెండూ రవీందర్ జైన్ గారు చేసారు. రెండిటికి కూడా ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి మరియు ఉత్తమ చిత్రం అవార్డులు కూడా లభించాయి. గాయని హేమలత గారి గాత్రం అద్భుతం. song is really soul stirring. మీ అభిరుచి అభినందనీయం.

వనజవనమాలి చెప్పారు...

Meraj Fathima .. గారు.. ఈ చిత్రం గురించిన వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. నేను చిత్రం చూడలేదు. ఈ రోజే చూసే ప్రయత్నం చేస్తాను. నాకు ఎప్పుడు పాటలే పరిచయం.సాహిత్యం సంగీతం నచ్చితే పదే పదే వింటూ ఉంటాను.ఈ పాట పట్ల నా ఫీలింగ్ అందుకే ఎక్స్ ప్రెస్ చేయలేదు. లవ్లీ సాంగ్.

మీకు వీలయితే నాకు నచ్చిన హిందీ పాటలు అన్న లేబిల్ లో ఉన్న పాటలు అన్నీ చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. ధన్యవాదములు.

Shabbu చెప్పారు...

Super Song... i like this song verymuch,,,, but, i listned in male version,,, but ur Video was superbbb,,,, Thank you very much,,,
I relaxed a moment with this song.


Shabbu,Knr

వనజవనమాలి చెప్పారు...

shabbu .. Thank you very much. ilaati manchi paatalani manaki parichayam chesina VBS mumbai ki yenno thanks cheppaali kadaa!

వనజవనమాలి చెప్పారు...

Ravishekhar gaaru..Thank you very much! sirivennela garipaatala kosam naa blog lo "sirivennela shobha" choodandi. marinni patalu..untaayi.

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ. Thank you. అద్భుతమైన సాహిత్యం పట్ల మీ ఇష్టం, మీ సాహిత్యాభిలాషని తెలియ చేస్తుంది. తప్పకుండా మీరు చెప్పిన లేబిల్ చూస్తాను. అప్పుడప్పడూ ఇలాంటి మలయమారుతం లాంటి పాటల్ని సంధిస్తూ ఉండండి..

అజ్ఞాత చెప్పారు...

ఈ టపా మీరు పబ్లిష్ చేసినప్పుడు వెంటనే కామెంట్ రాద్దామనుకున్నాను కాని కుదరలేదు . ఈ పాట నాకు నచ్చిన బెస్ట్ అఫ్ ది బెస్ట్ పాటలలో ఒకటండీ. చిత్రంలో ఈ పాట వచ్చే సందర్భం భారమైనది.. చాల moving గా వుంటుంది.. ఈ చిత్ర సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ అంధత్వాన్ని జయించిన వ్యక్తి ..తన సంగీతమే కాదు, తన సాహిత్యం కూడా బాగుంటుంది..

వనజవనమాలి చెప్పారు...

Merej Fhatima gaaru.. Thank you very much madam. Tappakundaa manchi paatalani parichayam chestaanu. inkaa chaalaa paatalu unnaayi. Thank you!!!!
@ Ramakrishna gaaru.. Thank you veru much.