20, ఏప్రిల్ 2012, శుక్రవారం

ద్వై దీ భావం

ద్వై దీ భావం .. కలుగుతుందా మీకెప్పుడైనా.. !? 

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఒకే అభిప్రాయం తో ఎల్లెడలా ఉండలేం ఎందుకని అని!? . 

ఒకోసారి మన అభిప్రాయాలే.. మారి మనకి నచ్చక పోయినా సరే.. వెలిబుచ్చక తప్పని స్థితి లోకి   వెళుతుంటాం.. అలా ఎందుకో ఏమిటో.. అని ఆలోచిస్తూ ఉండగా.. మెదిలిన కొన్ని..  .

పుష్ప విలాపం వింటూ ఆక్రోశించడం 
మల్లెమొగ్గలు కోసుకుంటూ ఆనందించడం 

జీవకారుణ్యం గురించి వినేటప్పుడు నిజమేననిపించడం
దోమలు దాడిచేసినప్పుడు మాత్రం జీవ కారుణ్యం లోపించడం 

హత్య చేసేటప్పుడు కోపంతో వణకడం
హత్య చేయబడేముందు భయంతో వణకడం 

చికెన్ సెంటర్ కెళ్ళి కోళ్ళని చూడగానే ఊరేను  కన్నీళ్లు
చికెన్ చూడగానే ఊరేను నోట్లో నీళ్ళు ... 

 మీకు కూడా ఇలా సరదాగా ఏమైనా తడతాయేమో చూడండి.. :))))     

17 వ్యాఖ్యలు:

శరత్ 'కాలమ్' చెప్పారు...

"హత్య చేసేటప్పుడు కోపంతో వణకడం"

ఎన్ని హత్యలు చేసేరేంటీ మీరు :))

వనజవనమాలి చెప్పారు...

:)))శరత్ గారు.. అమ్మో.. హత్యే!? అంత కసాయి తనం నాకు లేదండీ! మా ఇంట్లో కోడిని పీక కోస్తుంటేనే దూరంగా పారి పోయేదాన్ని.

ఇక అనుభవం అంటారా?హత్యలు చేయడం అంటారా? కలలో.. ఓ..వందమందిని ఝాన్సీ లక్ష్మి భాయిలా,రుద్రమ దేవిలా మట్టి కరిపించి ఉంటాను. ఆ అనుభవం తో లెండి ఇలా..

జ్యోతిర్మయి చెప్పారు...

రామచంద్రప్రభో వనజగారి కల్లో నన్ను రాకుండా చెయ్యి స్వామీ...

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది వనజ గారు... జ్యోతిర్మయి గారు మీరు భయపడకండి... శత్రువులను అంతమొందిచింది అండి... మిత్రులను కాదు.. మీరు యేదేచ్చాగా ఈ రోజు కలలోకి వెళ్ళిపొండి...

జలతారువెన్నెల చెప్పారు...

శరత్ గారూ, వనజ గారు ఉండేది విజయవాడ అండి...తస్మాత్ జాగ్రత్త మీరు!
(వనజ గారు, కోపం తెచ్చుకోకండే!)

వనజవనమాలి చెప్పారు...

Jyothirmayi..gaaru:)))
Don't worry!
@ Jalataaru vennela gaaru..:)) avunu VIJAYAWADA ..ne!
Bejawada ani koodaa antaaru lendi:))))
Thank you very much!

వనజవనమాలి చెప్పారు...

Baalu..gaaru.. Yentha baagaa ardham chesukunnaaru!
Thank you very much!!

Meraj Fathima చెప్పారు...

అల్లుడికిచ్చే కట్నం పెరిగితే ... బాధ.
కోడలు తెచ్చే కట్నం తరిగితే ... బాధ.

కూతురు ఇంట్లో దీపం,
కోడలు కంట్లో కారం.

లక్ష్మీ శిరీష చెప్పారు...

Bagundandi. :)

వనజవనమాలి చెప్పారు...

Meraj Fhatima gaaru..supergaa cheppaarandi.
chaalaa baagunnaayi.
Thank you very much.
@Lakshmi sireesha gaaru.. Thank you very much.

Lakshmi Raghava చెప్పారు...

మీరు చెప్పాక చల విషయాలు ఆలోచిస్తే ఎన్నో రాయచ్చోమో అనిపిస్తుంది . బాగుంది
లక్ష్మీ రాఘవ

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పొరుగింటి తగవు జూడగ
దొరకు వినోదంబు మనకు , దురదృష్టమునన్
జరిగిన మనయింటి తగవు
పరితాపము నిచ్చు , జూడ ఫలితము మారెన్ .

బ్లాగు సుజన-సృజన

వనజవనమాలి చెప్పారు...

Lakshmi raghawa gaaru.. Thank you madam
@Venkata rajarao..Lakkakula..gaaru.. mee dvaidee bhaavam chaalaa baagundi..:) Dhnayavaadamulu.

oddula ravisekhar చెప్పారు...

ప్రతి మనిషి ఇలా రెండుగా విడిపోవటం సాధారణం .ఎందుకంటే అత్యవసర పరిస్తుతుల్లో అబద్ధం ఆడతాము .అంటే మనం తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నప్పుడు .సహజం గా ఆడం కదా౧అలాగె దోమలు కుడితే జబ్బులోస్తాయండి.పులి ముందు నిలబడి పాత పాడలేము కదా!జూలో సరదా పడతాము.మంచి టాపిక్ వ్రాసారు.

శ్రీ చెప్పారు...

దేశంలో అవినీతి పెరిగిందని చర్చిస్తాం...
ట్రైన్ లో బెర్త్ కోసం బేరమాడతాం .
ఇలా చాలా ఉన్నాయండీ.
మీ భావాలు బాగున్నాయి...
@శ్రీ

వనజవనమాలి చెప్పారు...

Ravi shekhar garu.. Thank you very much!
@Sree gaaru.. spandanaki dhanyavaadamulu.

అనగనగా ఓ కుర్రాడు చెప్పారు...

మనం వేసే ప్రతీ అడుగు లోనూ "టు డూ ఆర్నాట్టుడూ" అని గిరీశం లాగా అలోచించో లేక అనాలోచితం గానో ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూనే వుంటాం... లౌక్యం అనే ముసుగు లోనో...అవసరం అనో..తప్పదు మరి..ఈ టపా బాగుంది.