3, సెప్టెంబర్ 2012, సోమవారం

"విహంగ" లో నా కథ

వివాహానికి మత మార్పిడి అవసరమా!?...
"మా మేడం ఒకరు ఉన్నారు ఆవిడ పి.హెచ్ డి.చేసారు. ఒక ముస్లిం ని వివాహం చేసుకున్నారట. వివాహం అప్పుడు ఆమె అతని మతం లోకి మారి ముస్లింగా పేరు మార్చుకుంటేనే.. ఆ పెళ్లి జరిగింది అంట. అసలు ఆవిడకి ఓ..స్వంత ఆలోచన అయినా ఉందా? .వివాహానికి మతం కి ఏమిటీ సంబంధం అని ఆలోచించలేదా?
అలాగే.. మా సర్..ఒకరు. ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా బోధిస్తారు. ఆయన వివాహం అయ్యాక వేరొక స్త్రీ తో ప్రేమలో పడ్డారట. ఆమెని చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి గాను ఆయన ముస్లిం గా మారి .ద్వితీయ వివాహం చేసుకున్నారు అని చెబుతారు. మతాలూ మార్చుకుని ఒకరిని మోసం చేసి చేసుకునే వివాహాల విలువ ఏమిటి? ఎందుకు వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తారు. వీళ్ళా మాకు గురువు లు అంది. ఆవేశంగా.

చాలా మంది విద్యాధికులు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు మతం ఒక సమ్యగా ఉంటుంది. అదే పురుషుడు అయితే మతం మార్చుకోవాల్సిన పని లేదు. స్త్రీ అయితే తప్పని సరిగా పురుషుడి మతం లోకి మారిపోతుంది.ఆ మారడం ఇష్టా పూర్వకం కావచ్చు,బలవంతం కావచ్చు. అయితే..మతం మారిన తర్వాత కూడా వారిలో ఉన్న ఆచార వ్యవహారాలూ,రక్తం లో జీర్ణించుకు పోయిన కొన్ని భావాలు రూపు మాసి పోతాయని అనుకోవడం పొరబాటే! వాళ్ళల్లో పుట్టుకతో వచ్చిన మతం ఆచారవ్యవహారాలు,ఆహారపు అలవాట్లు అలాగే ఉంటాయి. మతం మారామని మోసం చేసుకోవడం తప్ప అక్కడ ఏమి ఉండదు."అంది సుజాత.

అసలు ఒక స్త్రీ-ఒక పురుషుడు కలసి బ్రతకడానికి ఏ ఒక్క మతమో..ఎందుకు అవసరం? ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ ..ఎదుటి వారి మతాన్ని గౌరవిస్తూ..పరస్పర అభిప్రాయాలని గౌరవించుకుంటూ. ఉండటంలో ఉన్న విశాల దృక్పధం ఎందుకు అలవరచుకోరు? కనీసం మతం మారడం అనవసరం అన్న జ్ఞానం కలుగదు..?

ఈ మతం రంగులు,ఊసరవెల్లి తనాలు ఏమిటో..నాకు అర్ధం కాదు ..ఐ హేట్ ట్ థిస్ అంది.

వివాహ జీవితం కూడా ఆవకాయ పచ్చడి లాంటిదే. అన్నీ సరిగ్గా కుదిరితేనే.. మంచి రుచికరం గా ఉంటుంది ఏది తక్కువైనా..అది చూడాటానికి,తినడానికి కూడా బాగోదు. అని .విజయ జీవితం కూడా అన్నీ సమంగా పడని ఆవకాయ పచ్చడి లాంటిదే అని .

ఈ సంభాషణలు .. ఏమిటో.. ఈ కథలో చదవండి. ఆలోచించండి.

ఈ క్రింది లింక్ లో ...
నా జీవితం నా చేతుల్లో ..

6 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

అవును వనజ గారూ!
అన్ని రుచులు-అభిరుచులు సమ పాళ్ళలో కలిస్తేనే జీవితం...
కథ బాగుంది... అభినందనలు మీకు...
మీ పోస్ట్ క్రింద లింక్ ఇవ్వండి...(చదువరులకు సౌకర్యంగా ఉంటుంది)
@శ్రీ

Meraj Fathima చెప్పారు...

వనజా, మీ పోస్ట్ బాగుంది. సాటి రచయిత్రిగా ఒక స్నేహితురాలిగా మీ శైలి నాకు నచ్చుతుంది.
ఇకపోతే కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలలో వ్యక్తిగత కారణాలు, సమస్యలూ అంతరంగిక విషయాలూ ఉంటాయి
వాటి గూర్చి విశ్లేషించే పరిజ్ఞానం నాకు తక్కువే, కానీ మీ రచన ఆలోచింప చేసేలా ఉంది, శైలి బాగుంది.....మెరాజ్

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
నిజజీవితంలో జరిగే సంఘటనలు,ఎదురయ్యే సమస్యలను మీ కధల్లో చాలా బాగా చెప్తారండీ..
కధ బాగుంది..

Rajesh Devabhaktuni చెప్పారు...

జీవిత వాస్తవికతే కధలకు ప్రేరణ అయితే ఆ కధ రక్తి కడుతుంది, చదివిన వారిపై ప్రభావం చూపగలుగుతుంది. ( అయితే ఊహాజనితమైన / కాల్పనిక కధలు బాగోవు అని నా ఉద్దేశం కాదు ).

వనజ వనమాలి గారు, కధ చాలా బాగుంది, అయితే మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవడానికి మతం అవసరం అని నేను భావించడం లేదు. మతం వలన కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రయోజనాలే ఎక్కువ, ఇది తెలిసి పాటించేవారు ఎంతో మంది, వారిని ఏమి చేయలేము. కధలో "విజయ" గారు చేయవలసింది ఏమిటంటే సమాజానికి ఎదురు వెళ్ళడమే, అంటే చుట్టూ ఉన్న జనం చెప్పే పనికిమాలిన సూత్రాలను పక్కన బెట్టి, వారి జీవితాన్ని సరిచేసుకుని, ముస్కాన్ జీవితాన్ని కాపాడటమే. నీతులు / సామెతలు చెప్పేవారు మనకి దమ్మిడి సహాయపడరు. సమాజంలో ఉండే రకరకాల స్వభావం కల వ్యక్తులలో వీరు ఒక రకం.

కధ బాగుంది, మీరు ఇలాంటివి మరిన్ని వ్రాయాలని ఆశిస్తూ ...!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు.. థాంక్ యు వేరి మచ్! లింక్ ఇచ్చానండీ!
@ రాజీ గారు. కథ మీకు నచ్చినందుకు థాంక్ యు వేరి మచ్
@మేరాజ్.. కథ చదివి అభిప్రాయం వ్రాసినందుకు ధన్యవాదములు.
మతం మనుగడలో కలసిపోతే ఇబ్బందిలేదు.మూర్ఖత్వంతో..చాందస వాదంతో.. ఉంటే.. ఎవరు మార్చలేరు కదా! అయినా ఈ కథలో మత మార్పిడి కారణాలే కాదు..ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయి.
శైలి నచ్చినందుకు ధన్యవాదములు.
@రాజేష్ .. దేవభక్తుని గారు ..వాస్తవ జీవితమే ఈ కథ. ఈ కథలోని అంశాలు ప్రేమ, భార్యాభర్త ల మధ్య విబేధాలు కాకుండా.. మిగతా విషయాలపట్ల విజయ ఎదుర్కున్న ఇబ్బందులపట్లే,అలాగే వివాహ విషయాలలో..మతం మార్పిడి ఎందుకు అన్న విషయమే ఆలోచింప జేయాలని నా ప్రయత్నం. కథ నచ్చినందుకు ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, కథ ఆలస్యం గా చదివానండి.
మొత్తం చదివాక...అనిపించింది..ఇంకా విజయ లాంటి వారు ఈ సమాజం లో ప్రేమ అనే రెండక్షరాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకునే వారున్నారా అని? విజయ జీవితం ఒక జీవితం లో ఒక సరి అయిన నిర్ణయం అన్ని వేళలా తీసుకోవడంలో విఫలమైతే ఎలా ఉంటుందో తెలియచెప్పింది. ఇంత మంచి కథ రాసిన మీకు ధన్యవాదాలు.