మలినం లేని బంగారం ఉంటుంది కాని
ఆభరణం కాని ఆ బంగారాన్ని ధరించగలమా ?
పుష్పించి,ఫలించి తన బరువుతో..చెట్టు కొమ్మలని వంచేయదా?
లోపాలు ఉన్నాయని మనుషులని దూరంగా నెట్టి వేయగలమా ?
మన్నించి, హెచ్చరించి ఆత్మీయత జూపి సరైన మార్గంలో నడిపించమా?
షోడశోపచారములు లేని నిర్మల భక్తిని..భగవంతుడు మెచ్చినట్లే..
లోపం గల మనిషిని మనసు నిండుగా ప్రేమించలేమా !?
"ఐ యాం నాట్ పర్ఫెక్ట్ "
బట్, ఐ డు ఎవిరీ థింగ్ ..పర్ఫెక్ట్.
8 కామెంట్లు:
చాలా బాగా రాసారు. "లోపం గల మనిషిని మనసు నిండుగా ప్రేమించాలేమా?"
కష్టమేనేమో? లోపమంటే... అవలక్షణాలు కలిగి ఉండడం కూడా లోపమనాలా?
లేక , physical inability లోపం అని అంటున్నారా ఇక్కడ?
I am not perfect and I am not doing every thing perfect. :)
కలకత్తా/నర్సింహ అని ఆ మధ్య మీ పోస్ట్ లపై కమెంట్లు రాసా,అలగే మన తెలుగు బ్లాగులలో కమెంట్ల రూపం లో తిరిగా...ఇక పై బెంగులూరు గా రాస్తానెమో ఈరొజే ఈ కలకత్తా ని వదులు తున్నానండి ఈ 7 నెలలు మీ బ్లాగు ని బాగా ఫొల్లొ అయ్యాను బాగానే కాలక్షెపం మరియు మంచి విషయాలు లభించాయి (మీ వాఘ్య కథ కూడా చదివానండి ) మంచి విషయాలు బ్లాగుతున్నందుకు మీకు నెనెర్లు.
జలతారు వెన్నెల గారు.. ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.దీనిపై వివరణకి ఒక పోస్ట్ అవసర పడుతుంది. త్వరలో వ్రాస్తాను. థాంక్ యు వేరి మచ్.
@ కష్టే ఫలే మాస్టారు.. మీరు అలా అనడం ఆశ్చర్యం సార్ . అయినా వప్పుకుంటాను. అన్ని పనులు పర్ఫెక్ట్ గా చెయ్యలేం కూడా.. నాకు అతి విశ్వాసం ఎక్కువ అనుకుంటాను. ధన్యవాదములు మాస్టారు.
@నరశింహ గారు. నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదములు. ఎక్కడి వారైనా..సరే... తీరిక చేజిక్కించుకుని చదవడం,కామెంట్ వ్రాయడం రెండు ఆసక్తి ఉండటం మూలంగా చేస్తారు కదా! అందుకు ధన్యవాదములు. మరీ మరీ ధన్యవాదములు. మా వాఘ్య ని గుర్తు చేసారు.:( :(
తాతగారి మాటే నాదీనూ! లోపం గల మనిషిని మనసు నిండుగా ప్రేమించాలేమా !? మంచి విషయం చెప్పారు..
I am not perfect...but trying to be perfect and trying to do everything perfect. :)
బాగుంది...బాగా వ్రాశారు...మీ వివరణ పోస్ట్ కోసం చూస్తుంటాము వనజా గారు!
ప్రేమించాలి ! ఎందుకంటె మనుషులమందరం లోపభూయిష్టులమే మీరన్నట్లు వనజ గారూ .
అవును సామాన్య గారూ ..లోపాలున్నా ప్రేమిస్తాను మునుపటికంటే ఎక్కువగా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి