లోపం కల్గిన వారిని మనసు నిండుగా ప్రేమించాలేమో!
లోపాలు అంటే శారీరక అంగవైకల్యం,మానసిక వైకల్యం మాత్రమే కాదు.
మనిషిలో బాహ్యంగా కనిపించే అవలక్షణాలు,అంతర్లీనంగా తిష్ట వేసుకున్న లక్షణాలు,వ్యసనాలు.. కావాలని చేసే నిర్లక్ష్యాలు ఇవన్నీ లోపాలు అని అనాలేమో.!
శారీరక అంగవైకల్యం కలవారిని,మానసిక వైకల్యం కలవారిని ఏ మనిషైనా నిండుగా ప్రేమించాలి. సాయం చేయాలి చిన్న ఊతనైనా ఇవ్వగలగాలి.
ఇతరులలో కనిపించే అవలక్షణాలని వారు మన వారు కాకపోయినా ఒకప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారైనా సరే కొంతైనా ఏహ్యభావం ని ప్రదర్శిస్తాము.
వారిని లోపాలతో సహా ప్రేమించలేము.ఆ అవసరం కూడా రాదు కూడా.. కాకపొతే వారిని సాటి మనిషిగా చూడగలం.
ఇక మన వారి విషయంకి వస్తే.. చిన్న చిన్న లోపాలు లేకుండా క్లీన్ చిట్ అంటూ ఎవరు ఉండరు. మనలో ఉన్న లోపాలని కూడా భరిస్తూ..మనల్ని ప్రేమించే వారు ఉంటారు.
ఇక అవలక్షణాలు అంటే సోమరితనం,జూదం,త్రాగుడు,స్త్రీలోలత్వం.. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని భరించేది.. కుటుంబ సభ్యులు మొత్తం కూడాను.
అందరికన్నా ఎక్కువ భరించేది భార్య,
అందరూ అంటుంటారు చూడండి.. ఆ మహా తల్లి కాబట్టి ఆయనని ఇన్నాళ్ళు భరించింది ఇంకెవరు భరించరు..అంటూ ఉంటారు.
ఎందుకంటే ఒక పురుషుడిలో అవలక్షణాలని భరించి అసహ్యించుకుంటూ.. కూడా ప్రేమించేది భార్య మాత్రమే ! అవలక్షణాలు కల్గిన భార్యని భర్తలు భరించరా? లోపాలతో..ప్రేమించరా..అని పురుషులు నా పై దండెత్తకండి. జనరల్ గా చెపుతున్నాను..అంతే!
ఒక ఉదాహరణ చూడండి.. తన సంపాదనలో అధిక మొత్తాన్ని త్రాగుడి వ్యసనానికి ధారపోసే బడుగు జీవిని మొదలుకుని,మధ్య తరగతి వారు,ధనవంతుల త్రాగుడు వ్యసనంని,వారి ప్రేలాపాలని నిత్యం భరించేది ..ఆర్ధికంగా చితికి పొతే మానసిక వ్యధ చెందేది, పురుషుడు వ్యసనాల వల్ల కుటుంబం చితికి పోయి ..బిడ్డలపై ఆ ప్రభావం పడితే
ఆ తల్లికి ఎంత నరక ప్రాయం చెప్పండి.?
అయినా సరే .. భర్తని అతనిలో ఉన్న లోపాలతో సహా భరిస్తుంది..ప్రేమిస్తుంది.
అందుకు నేను ఒకే ఒక ఉదాహరణ చెపుతాను. వారుణి వాహినిలో తూగి పోతున్న భర్తలని భార్యలు భరించడంలేదా? ప్రేమించడం లేదా?
అలా కాని పక్షంలో మందు బానిసలుగా మారిన ప్రతి ఇల్లు.. భార్య రహిత గృహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కదా!
కొందరికి నోటి దురుసుతనం,కొందరికి స్త్రీలోలత్వం, కొందరికి జూదం ..ఇలాంటి అవలక్షణాలని సాధ్యమైనంతవరకు భరిస్తూ..అసహ్యిన్చుకుంటూ..గత్యంతరం లేకనో..లేకపోతే నిండు మనసుతో.. నిజంగా ప్రేమిస్తూ ఉంటారు.
అలాగే అందరిలోనూ లోపాలు ఉంటాయి. తల్లి దండ్రులలో, సోదరీ సోదరులలో, బిడ్డలలో..బిడ్డల జీవితం పంచుకున్న కోడళ్ళు,అల్లుళ్ళ లో ..అందరిలో లోపాలు ఉంటాయి.
అవసరాల దృష్ట్యా కంటే.. అర్ధం చేసుకునే తత్వంతో.. లోపంతో సహా ప్రేమించ గలగడం సాధ్యమే!
అలాగే.. తమ అవలక్షణాలతో.. ఇతరులకి ఇబ్బంది కల్గిస్తూ,భాదిస్తూ ఏళ్ళ తరబడి హింసిస్తూ.. తమ ప్రవర్తనని ఏ మాత్రం మార్చుకోలేని వారిని భరించే వారు ఉంటారు. భరించలేక ప్రక్కకు వైదొలగిన వాళ్ళు ఉంటారు.
ఏదైనా.. మనిషిలో ఉండే సహృదయత,సహజ సిద్దంగా ఉండే ఓర్పు, క్షమా గుణం,సానుభూతి..అన్నిటికన్నా.. మీదు మిక్కిలి ప్రేమ కలిపి లోపాలు తో సహా.. ప్రేమించ గల గుణం ఉన్న వారు.. ఉన్నారు.
వారిని దృష్టిలో ఉంచుకుని .. "లోపం కల్గిన వారిని మనసు నిండుగా ప్రేమించాలేమో!" అని వ్రాసాను.
స్త్రీల లో కూడా అనేక అవలక్షణాలు కల్గినవారు ఉంటారు. పెత్తనం చెలాయించడం, గడసరితనం ,షాపింగ్ పిచ్చి,డబ్బు పిచ్చి,నగల పిచ్చి..ఇంకా వగైరా ..
వారిని భరిస్తూ.. ప్రేమిస్తూ.. ఉండే పురుషులు ఉన్నారు. వారు కూడా..అభినందనీయులే! అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మనిషి అంటే..స్త్రీ-పురుషులిరువురు ..కూడా కదా!

9 కామెంట్‌లు:
సమాజంలో కళ్ళ ముందు జరిగే అనేక విషయాలను చాలా చక్కగా వ్రాస్తున్నారు. అభినందనలు వనజ గారు!
ఒక మనిషిని ప్రేమించడం అంటే వారి బలహీనతలు లోపాలతో సహా ప్రేమించడమే అదే నిజమైన ప్రేమ అలా ఎదుటివారి బలహీనతలతో సహా ఆ మనిషిని ప్రేమించగలిగే తల్లి దండ్రులకి భార్యాభర్తలకి కూడా hats off. your post very nice
Wonderful post vanaja gaaru.
No body is perfect. we have to try to love them with their deficiency.
vanajaa eppatilaaga mee post praamukyatha santharinchukovaali, naluguroo aalochinchedigaa undaali ide naa korika.
very nice post vanaja garu. I agree with kastephale sir.
కాయల నాగేంద్ర గారు ..ధన్యవాదములు .
@svk రమేష్ గారు..ధన్యవాదములు.
@ కష్టేఫలె ..మాస్టారు..మీరు ప్రతి విషయం అనుభవంతో చెబుతారు.నేను కాదనగలనా? ధన్వాదములు.
@హితైషి ..థాంక్ యు వెరీ మచ్!
@మేరాజ్.. మీ అభిమానానికి ధన్యవాదములు. తప్పకుండా.. మంచి పోస్ట్లు వ్రాయాలనే నా ప్రయత్నం. థాంక్ యు వెరీమచ్.
@సుభ గారు ..థాంక్ యు వెరీమచ్!!
@లాస్య రామకృష్ణ గారు.. ధన్యవాదములు.
చాల బాగుంది మీ విశ్లేషణ
సంజయ్.......
సంజయ్ గారు .. మీరు తీరిక చేసుకుని బ్లాగ్ చదివినందుకు ధన్యవాదములు. అలాగే మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి