ఆరోగ్యం తిరిగి పుంజుకోవడానికి విశ్రాంతి తీసుకుంటూ ఆ సమయాలలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ ఉన్నాను.
నేను చదివిన పుస్తకాలలో ...
నాకు బాగా నచ్చిన కొన్ని విషయాలు ఇలా పంచుకుందామని వచ్చాను.
మానవుడు ఐదు "వ " కారముల చేత పూజ నీయుడు అవుతాడట.
వస్త్రం,వపుష్ట ,వాక్కు,విద్య,వినయం.
మొదటిది వస్త్రం..
అంటే మంచి వస్త్ర ధారణ కల్గి ఉండటం వలన గౌరవింప బడతారు.
రెండవది శరీర సౌష్టవం.
వంశాన్ని,మన గుణాలని,మన తేజస్సుని ఆధారం చేసుకునే సంతతికి శరీర అందాలు వస్తాయి.
మూడవది వాక్కు.
ఎంత బాగా చదువుకున్నా ఒకోకరి మాట తీరు సరిగా యండదు. కొంతమందికి ఏ చదువు లేకపోయినా సంస్కారంతో,హృదయానికి హత్తుకునేలా మాట్లాడతారు.
నాల్గవది విద్య
విద్య క్రమశిక్షణతో కూడినది అయి,మానవతా విలువలతోను కూడి.. కొంత ఆధ్యాత్మికత తత్వంతో ముడిపడి ఉండాలి.
ఐదవది వినయం
పైన ఉదహరించిన నాలుగు గనుక ఉంటె ఐదవ గుణం అదే అలవడుతుంది.
విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతామ్
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతఃసుఖమ్
విద్యతో వినయం సిద్దిస్తుంది.
వినయంవలన తగిన అర్హత లభిస్తుంది.
ఆ అర్హతే ధనం ని సంపాదిస్తుంది.
ఆ ధనం వలన ధర్మం తద్వారా సుఖం లభిస్తుంది.
అందరికి సిద్ధి బుద్ధి ని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని మనసారా ప్రార్దిస్తూ..వినాయక చవితిని జరుపుకుందాం.
బ్లాగ్మిత్రులందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు.
9 కామెంట్లు:
వినాయక చవితి శుభాకాంక్షలు!
మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!
ఓం గం గణపతయే నమః
వినాయక చవితి శుభాకాంక్షలు....
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబ సభ్యులకు సదా,
సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@శ్రీ
మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..
"వనజవనమాలి" గారూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..
వనజ గారూ మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ.
పండుగ సందర్భంగా వ్యక్తిత్వ వికాసాన్ని చక్కగా తెలియజేసారు.మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
The tree Bhaskar gaaru..
@kayala nagendra gaaru..
@Sree gaaru..
@LasyaRamakrishna gaaru..
@Subha gaaru..
@jyotirmayi gaaru..
@Rajee gaaru..
@oddula ravi shekhar gaaru..
mee abhimaanaaniki ..wishes ki andarki dhanyavaadamulu.
sorry for the late reply.
చాలా మంచి విషయాలు.నిజమే కొందరు ఎంత చదువుకున్నా మాట తీరు బాగుండదు.మనసుననుసరించీ మాట ఏమో!!మీ ఆరోగ్యం ఎలా వుందిపుడు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి