అప్పుడప్పుడు కొన్ని విషయాల పట్ల మనకి తెలియ కుండానే మనలో అమితాసక్తి కల్గుతుంది. నేను ఈ మధ్య
ఒక దిన పత్రికలో ఆరాధ్య "బి " ని పొదివి పట్టుకుని ఉన్న తల్లి ఐశ్వర్యరాయ్ బచ్చన్ చిత్రం ని ఆసక్తిగా చూసాను. ఆ చిత్రం క్రింద ఉన్న విషయం ని చదివేసి.. ఆరాధ్య "బి " ముద్దుగా ఉంది అనుకుని..
అయినా ఈ విషయాన్ని పత్రికలూ అంతగా ప్రాచుర్యం కల్పించాలా?
ఈ దేశంలో ఎంతమంది శిశువులు జన్మించలేదు. అలాగే ఒక పసి పాప జన్మించింది. తల్లి గర్భంలో శిశువు ప్రాణం పోసుకోకముండు నుండి పుట్టుక ముందు.పుట్టుక తర్వాత ఆ పసి పాపని జనులకి చూపాలని ఆ చూపే గొప్పదనం తమకే దక్కాలని తెగ ఆరాట పడిపోతున్న మీడియా వాళ్ళని చూస్తే చిరాకు వేస్తుంది.
సెలబ్రిటీ ల వ్యక్తి గత జీవితాల గురించి అభిమానులకి ఆసక్తి ఉంటుంది. ఆ విషయాలని పత్రికల ద్వారానో.. టీవి ల ద్వారానో. అంతర్జాలం ద్వారానో..తెలుసుకుంటూనే ఉంటారు.
వెర్రి ముదిరితే రోకలి తలకి చుట్టుకున్నట్లు..అభిమానులకి తోడూ రాయడానికి వార్తలు లేకో.. సమయాలు భర్తీ చేసుకోవడానికో.. ఏదో ఒక విషయానికి ప్రాచుర్యం కల్పించి చూసేవారికి తలబొప్పి కట్టేవిధంగా మొట్టడం అలవాటైన
ఎలక్రానిక్ యుగంలో ..ఉన్నాం గనుక యధాలాపంగా నైనా భరించక తప్పదు.
గత రెండేళ్లలో తెలుగు సెలబ్రిటీల మూడు పెళ్ళిళ్ళు చూసి వైరాగ్యం వచ్చేసిందేమో.. నాకు మాత్రం ఈ ఆరాధ్య "బి" చూసి ముద్దు కల్గినా ఎందుకో మీడియా వారిపై చిరాకు కల్గింది.
గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి పుట్టిన బిడ్డలకి ఏ మాత్రం స్వేచ్చ ఉండదు. వారు అందరి పిల్లలు లాగా ఇతర పిల్లలతో..స్వేచ్చగా ఆడుకునే సమయాలు ఉండవు. అంతా కార్ల ప్రపంచం. అన్నింటికీ మించి భద్రత సమస్య.
ఎవరి ఈర్ష్యా ద్వేషాలకి,అక్రమ డబ్బు సంపాదనకి.. పిల్లల్లని టార్గెట్ చేస్తారేమో అన్న భయం ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దయి.. వారంతగా వారు కోరుకుని మీడియా ముందుకి వస్తే తప్ప పిల్లలగా ఉన్నప్పుడు వారి రక్షణ లో భాగంగా..వారిని ప్రదర్శించడం వారి పెద్దలు ఇష్టపడక పోవచ్చు. వారిని చూపించాలని మీడియా వారి వెంట పడాలా అనిపించక మానదు కానీ... వాళ్ళు అలా వేటగాళ్ళ లా ఉంటేనే కదా.. జనులకి మంచి చెడు విషయాలు ఆసక్తి కర విషయాలు తెలిసేది.:)
ఇటీవల twitter లో "బిగ్ బి" ఎత్తుకుని ముద్దాడుతున్న పసి పాప "ఆరాధ్య " అవునని కాదని మాటలు నడిచాయి
కానీ ఆ పాప Kbc 6 ఎపిసోడ్స్ లో ఒక వీక్షకురాలి బిడ్డని చూసి అమితాబ్ ముచ్చట పడి ఆ బిడ్డని ముద్దు చేసినప్పటి చిత్రం అని Ntv వివరణ లో తెలిసింది.
అదిగదిగో పులి అంటే..ఇదిగిదిగో తోక అన్నట్లు..మీడియా ప్రచారానికి ఏదో ఒక విషయం కావాలి.
ఏమైనా ఆరాధ్య .. జనులకి "ఆరాధ్య"మయిపోయింది కదా! మరి మాటలా..! ఇంట్లో అందరి బిగ్ బి ల మధ్య పుట్టిన సెలబ్రిటీ చైల్డ్. సెలబ్రిటీస్ స్పెషల్ కాదంటారా!
ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే.. అంతర్లీనంగా నాకు సెలబ్రిటీస్ గురించి ఆసక్తి ఉంది కదా! ప్చ్..దృశ్య వ్యసనం.

3 కామెంట్లు:
vanajaa manchi vyasaname. mee vyasanam valane kadaa memu chudagaligaam. nice post.
Meraj.. meeru ayinaa nannu ardham chesukunnaaru. enthainaa Friend kadaa.. Thank you so much.. Friend!
''ప్చ్..దృశ్య వ్యసనం''...:))ఏం చేద్దాం ?కళ్ళున్నాక ,ప్రసార మాధ్యమాలున్నాక మనం వద్దన్నా కుదరదిక.
కామెంట్‌ను పోస్ట్ చేయండి