పెళ్ళి తర్వాత .. చాలా మంది జీవితాలలో ఇలా ఉంటుందని ... నా ఆలోచన
నాన్సెన్స్.. అది నాకన్నా అందంగా ఉందా ? నాకన్నా ఎక్కువ చదువుకుందా ? నాకన్నా ఎక్కువ సంపాదిస్తుందా ? నాకన్నా ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిందా ? పెళ్ళయిన తర్వాత కూడా ఆమెలో ఏం చూసి ప్రేమించావు ? ఓ ..భార్య తన భర్తని ఆవేదనతో ప్రశ్నించింది
ఇవన్నీ ఏమికావు . ఆమె నేను చెప్పినట్లు వింటుంది. నిజంగా చెప్పాలంటే .. ఆమె నా చెప్పు చేతల్లో ఉంటుంది అణగిమణగి పడి ఉంటుంది, నీలా తోక తొక్కినా తాచులా ఉండదు భర్త సమాధానం.
**********************************
ఎప్పుడు నగలు కొనండి , చీరలు కొనండి,కార్లలో తిరగాలి, భవంతులలో నివసించాలి
అనే కోరికలు తప్ప మనసున్న మగవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు అనుకోవేమిటే !? నా ఖర్మ కొద్దీ దొరికావు. నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక సన్యాసం పుచ్చుకుంటాను అని ఒక భర్త ఆవేదన
***********************************
కావాల్సినన్ని నగలు కొంటున్నా, కోట్లు కూడబెడుతున్నాను. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను.పిల్లల గురించి శ్రద్ద తీసుకుంటున్నాను. అయినా కూడా నా సరదాలు, నా ముచ్చట్లు పై నీకు అభ్యంతరం ఎందుకుండాలి? ..భర్త ప్రశ్న
ఎన్ని నగలు నాణ్యాలు భవంతులు,కోట్లు ఉంటేనేమి భర్త మనసులో స్థానం లేకపోయాక .. ఈ బ్రతుకు ఎంత వేదనో, భరించేవారికే తెలుసు . ఇలా .భార్య కన్నీటి స్వగతం
*************************************
బాగా అందంగా ఉన్నానని,సంపాదిస్తున్నాని, వెనుక ఆస్తిపాస్తులున్నాయని తగని గర్వం. మొగుడంటే వీసమెత్తు గౌరవం లేదు, అత్తమామలు, భర్త తోబుట్టువులు ఎవరితోనూ సంబంధాలు ఉండకూడదు. జీవితాంతం తన కొంగట్టుకునే తిరగాలి. గీసిన గీటు దాటకూడదు. ఇది పెళ్ళాం కాదు బ్రహ్మ రాక్షసి రా బాబోయ్ .. ఓ ..భర్థ గోడు
**************************************
దొంగ సచ్చినోడా .. పొద్దంతా పనిపాట లేకుండా తిరిగి సాయంత్రానికి త్రాగుడికి కూడా నన్నే డబ్బివ్వమని పీక్కు తింటావా? బిడ్డలతో పాటు నీకు పొట్టలోకి కూడేయ్యగలను కాని మందుకి నేనెక్కడ ఇవ్వగలను .. నువ్వు చావరా పీడా పోద్ది.! చచ్చాడని ఒక ఏడుపేడిసి.. బిడ్డలని పెంచుకుంటా .. ఓ.. పేద శ్రామికురాలి కంఠశోష
**************************************
సంపాదించడం , తినడం , పడుకోవడం .అంతా యాంత్రికత. ఫీలింగ్స్ లేవు , ఎమోషనల్ అంటూ ఏమిలేదు. మనసు లేదు, మమత లేదు .అంతా నటన ..చీ వెధవ బ్రతుకు .. ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గి అన్నీ ఉన్నా ఏమి లేని డొల్లతనం ని బహిర్గతం చేస్తూ ..ఒక స్త్రీ వేదన .
******************************************
"పుర్రెకొక ఆలోచన -జిహ్వ కోక రుచి " .జీవితాలలొ కనబడే అనేకానేక కోణాలు.
కొస మెరుపు : ఏ ఒక్క వ్యక్తి చెప్పినదీ పూర్తీ జీవితం కాదు. అయినా సరే జీవితం వెళ్ళి పోతూనే... ఉంటుంది.

6 కామెంట్‌లు:
జీవితమింతేలే మానవ జీవితమింతేలే......ఉన్నది పనికిరాదు, లేనిది అందదు, కాదు అందుకోడం కుదరదు, తప్పు కనక, అందనిదానికోసం ఆరాటం, ఉన్న దానితో పోరాటం, సంతృప్తి లేని జీవితం....
అమ్మా.. మీకొక చిన్న విన్నపం చేసుకుంటున్నా నాకు తెలిసిన ఒక అన్న పెళ్ళిచేసుకోనని అంటున్నాడు .. మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా అమ్మాయిల మీద నమ్మకం పోయింది అని అంటున్నాడు.... బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నాడూ ఈ మధ్య తన ఆఫీసు వాళ్ళే అమ్మాయిలు తాగడం చూసి ఇంకా నమ్మకం కోల్పోయాడు.
ఎటు చూసినా "వొద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ళ మంటరా" అనే మాటలే తప్ప పెళ్ళి అంటే మంచి అభిప్రాయం కలిగించే మాటలు కనబడటం లేదు, పైగా ఫేసు బుక్ ఒకటీ అంతా పెళ్ళికి వ్యతిరేక పోస్టులే....
సొ మీరు మంచిగా విష్లేశిస్తూ పెళ్ళి ఆవశ్యకతని చెప్తూ ఒక మంచి పోస్ట్ ఒకటీ రాస్తే అది చూపించి పెళ్ళి కిఒప్పించే ప్రయత్నం చేస్తాం ...
100% గ్యారంటీ అబ్బాయి మంచోడే ఏ అలవాట్లు లేవు(లవ్వు గివ్వు అనేవి అసలు లేవు)
అంతేనండీ...ఇద్దరి అభిప్రాయాలూ కలవకపోయినా...ఒకరికోసం ఒకరు అన్నట్టుగా బ్రతికేవారినీ చూసాను...అభిప్రాయాలు కలిసాయని ప్రేమించి చేసుకుని రోజూ గొడవ పడుతున్నవారినీ చూస్తున్నాను...బావుంది మీ విశ్లేషణ.
కష్టేఫలె మాస్టారూ ! మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను అసంతృప్తి తో జీవితాలని నరకం చేసుకునే వారినే చూస్తున్నాం. బాగా గమనించితే ఇలాంటి జంటలే కనబడ్డాయి మరి. ధన్యవాదములు
అనూ గారు ,,, మన చుట్టూ ఉన్నవారిలో ఇలా గొడవ పదుతున్నవాళ్ళె కనబడుతున్నారు . ఆ ప్రభావం పిల్లలపై పడి.. వాళ్ళు నిర్లక్ష్యంగా,భాద్యతారాహిత్యంగా పెరుగుతున్నారు, అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏ ఒక్కరూ క్లీన్ చిట్ గా ఉండరు.కొన్ని సర్దుకు పోవాలి/ మరీ భరించలేరు అనుకుంటే హుందాగా విడిపోవాలి. ఏమిటో .. రణరంగంని తలపిస్తూ ఇల్లు ఉంటున్నాయనిపిస్తుంది . మీ వ్యాఖ్యకి ధన్యవాదములు
నరసింహ గారు ..క్షమించాలి . పాజిటివ్ దోరణి లోనే ఈ పోస్ట్ వ్రాయాలని ప్రయత్నించాను కానీ మీరు వ్యాఖ్యానించాక అర్ధం అయింది. క్షమించాలి. వివాహ వ్యవస్థ చాలా గొప్పది. సమాజానికి చాలా అవసరం కూడా నండీ తప్పకుండా ఒక పోస్ట్ వ్రాస్తాను. మీ సూచనకి మరీ మరీ ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి