ఒక వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అతనికి మరో నెల రోజులు మాత్రమే బ్రతికి ఉంటానని తెలుసు
అతనికి ఒక CD దుకాణంలో పనిచేస్తున్న ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు కానీ తన ప్రేమ గురించి ఆమెకి ఎప్పుడు .చెప్పడు
ప్రతి రోజూ అతను కొంత డబ్బు ఖర్చు చేస్తూ ఒక CD కొనుగోలు చేస్తూ ఉంటాడు ...
ఒక నెల తరువాత అతను మరణించాడు ...
CD షాప్ లో పని చేస్తున్న అమ్మాయి అతని ఇంటికి వెళ్ళినప్పుడు ...
అతని తల్లి అతను క్యాన్సర్ మరణించాడన్న విషయాన్ని చెపుతుంది ఆమె అతని గదిలోకి వెళుతుంది అక్కడ అతను ప్రతి రోజు కొన్న CD లు ఓపెన్ కూడా చేయకుండా అలా పడి ఉంటాయి. అవి చూడగానే ఆ అమ్మాయి క్రింద క్రూచుని ఏడుపు ప్రారంభించింది
అతను నీకు తెలుసా !ఎందుకు .ఏడుస్తున్నావ్ ? అని అడిగిన దానికి ఆమె ఏడుస్తూనే CD లు ఓపెన్ చేసి వాటిల్లో నుండి నాలుగు ప్రేమ లేఖలని బయటకి తీస్తుంది
వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కల్గి ఉంటారు కానీ ఎప్పుడూ వ్యక్తం చేసుకోరు ఆతను CD లు కొనే నెపంతోనే ఆమెని చూడటానికి వెళ్ళేవాడు ఆమె అతనికి ఆతను కొన్న CD లో ప్రేమ లేఖ పెట్టి ఇచ్చేది
ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమ గురించి తెలుసుకునే సరికి అలా జరిగిపోయింది
అందుకే మీకు ఎవరిపైనైనా ప్రేమ కల్గితే దాచుకోకండి ..వెంటనే మీ ప్రేమని ప్రకటించండి ..:) .. అని ఆ కథ సారాంశం
ఏమిటి .. ఇప్పుడెందుకు ? ఇలా చెపుతారు ? అని అనుకోకండి > ఎక్కడో ఈ కథని చదివి చాలా రోజులయింది . నిన్న హఠాత్తుగా గుర్తుకు వచ్చింది
ఆ గుర్తు రావడం ఎందుకనగా ...
మా ప్రక్కన గ్రూప్ హవుస్ కి వాచ్ మేన్ గా పనిచేస్తున్న అతనికి ఇద్దరు కూతుర్లు . పెద్దపిల్ల జిల్లా పరిషత్ స్కూల్లో 9 వ తరగతి చదువుతుంది 10 వ తరగతి అబ్బాయి ఈ అమ్మాయి ప్రేమ (?) లో పడ్డారు . వేసవి సెలవల తర్వాత స్కూల్ పునః ప్రారంభమై ఇరవై రోజులన్నా కాకముందే వీరి ప్రేమ పాకాన పడి టీచర్ల దృష్టిలో పడ్డారు వారు పిల్ల తండ్రిని పిలిపించి విషయం చెప్పి పంపించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తల్లితండ్రి ఇద్దరూ కలసి ఇద్దరు పిల్లలని చితకబాది గేటు బయటకి నెట్టేశారు చిన్న పిల్ల ఆ పెద్ద పిల్లకి సహకరిస్తుంది అని ఆ పిల్లకి బాగానే తడి పడింది. విషయం తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలలో మనం తల దూర్చకూడదు కాబట్టి నేను చప్పుడు కాకుండా బయట గేటుకి తాళం పెట్టుకుని లోపలకి వచ్చేసాను.
ఈ రోజు ఉదయం మా పనికత్తె విషయం మోసుకొచ్చింది అమ్మా! అప్పుడప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుని అతనితో మాట్లాడుతుంటారని తెలిసింది. అని చెప్పింది
" అయ్యబాబోయ్ ! నాకే పాపం పుణ్యం తెలియదు, అలాటివన్నీ నా అకౌంట్లో వేయొద్దు, ఏదో కాల్ చేసుకుని ఇస్తానంటే మొహమాటం కొద్ది ఫోన్ ఇస్తాను కాని " అని చెప్పాను
మొన్నెప్పుడో . ఆ పిల్ల .నా దగ్గర ససిమ్ కార్డ్ ఉంది ఓ.. ఖాళీ పోన్ ఇవ్వరా ? అని అడిగింది . నా ఫోన్ లలో సిమ్ కార్డులు తీసేవీలులేదు మీ సిమ్ కార్డ్ అందులో సెట్ అవదని చెప్పానని చెప్పాను .
ఇదీ సంగతి ! తల్లిదండ్రులకి తెలియకుండా పిల్ల దగ్గర సిమ్ కార్డ్ ఉంటుంది. టీనేజ్ ప్రేమలు పరిఢవిల్లుతున్నాయి, ఎలా కాపాడుకోవాలి పిల్లలని ఈ ఆకర్షణల నుండి !? ఎవరు గైడ్ చేయగలరు ? మెదడుని కుమ్మరి పురుగు తొలిచేసినట్లు బోలెడు ప్రశ్నలు. ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి సమస్యలు ఉండేవే !
చెప్పలేని ప్రేమ ఉంది, ప్రేమని ప్రకటించడానికి ఫోన్ ఉంది "తేజ" చూపిన సినిమా సాక్ష్యం ఉంది, సమయానికి భలే ఉపయోగపడుతుంది అంటూ పిచ్చి ట్యూన్ లో పాట పాడుకుంటూ
" మీకు అది కూడా తెలియదు . ఫోన్ లో కూడా ఎప్పుడూ విసుక్కుంటారెందుకో !" నిరసన ప్రత్యక్ష దైవం మీదకి బదిలీ అయింది :)
అసలు ఈ ప్రేమని ఎప్పుడు, ఎలా చెప్పాలబ్బా.. ! ఎప్పుడు చెపితే సరియిన సమయం అవుతుందో అర్ధం కాదూ !! అంటూ వారు మట్టిబుర్రని గోక్కుంటున్నారు.
:)
2 కామెంట్‌లు:
రెండే రెండు అక్షరాల ప్రేమ , ఇరువురి మధ్యనే ఏర్పడుతుంది . ప్రేమ అంటేనే 'ప్రే'రణతో 'మ'మత అని అర్ధం .
ఇక యిది ఎప్పుడు ? ఎలా ? ఎందుకు ? అన్న తేజ టీ వీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసే ప్రశ్నలా తయారై కూర్చొంది .
ఇది ప్రేమా , దోమా అని తెలియని వయసు వారికి దీని దరిదాపులకు ప్రవేశించే అర్హత లేదు . వీటిని క్లాసుగా డీల్ చేసుకోవాలే తప్ప ( వయసు వచ్చిన వాళ్ళు ) క్లాసులెక్కడా వుండవు.
కథ బాగుంది.
కాని నిజం బాగోలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి