అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం, ఆత్మ తృప్తి కై మనుషులు ఆడుకునే వింత నాటకం ... అనే పాట నాణెం లో ఒక వైపుని మాత్రమే చూపుతుంది. ఏ జీవితం గురించి అయినా ఒక్కరు చెప్పినదే నిజమని మనం తీర్మానించుకోకూడదు. ఒక జీవితం గురించి నలుగురు చెప్పినప్పుడే ఆ జీవితం గురించి మనకి తెలుస్తుంది అనేది చాలా నిజం.
మనుషుల మధ్య అనుబంధాలు లేకుండా యాంత్రికంగా, ఏకాకితనం తో బ్రతకడంలో అర్ధమేలేదనిపించిన ఎన్నో అనుభవాలు ఎవరికైనా ఉంటాయి . అనుభవంలోకి రాని విషయమంటూ కాదు కదా ఇది. మనిషే కాదు పశు పక్ష్యాదులు, జంతు జీవాలు కూడా ఒంటరిగా మనలేవు . పంచుకునే తోడుంటేనే కష్టానికైనా సుఖానికైనా విలువ.
చాలా మంది అన్ని సౌకర్యాలు ఉంటే చాలు మనుషులు బ్రతికేయవచ్చు అనుకుంటారు. తోటి మనుషుల పట్ల విముఖత కలగడానికి వారి కారణాలు వారికుండవచ్చు . నలుగురి మధ్య మసలలేక ఏకాంతం కావాలనుకోవడం వేరు., ఏకాకితనం గా బ్రతకడం వేరు. వారి వారి అభిరుచులు సినిమాలు , సంగీతం,సాహిత్యం, స్నేహితులు,మత్తు మందులు, విందులు, పొందులు కూడా కొన్నాళ్ళకి వెగటు కల్గిస్తాయి. మన కొరకు ఎవరున్నారు అనుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉండరు. కొందరు అందరూ ఉండి కూడా ఏకాకి బ్రతుకు బ్రతకడం కద్దు.
అసలు కుటుంబం అంటే ఏమిటో. ఆ కుటుంబంలో ఇచ్చి పుచ్చు కోవడం అంటే ఏమిటో, వేరొకరి కొరకు తమ ఆసక్తులను చంపుకుని వారి కొరకు త్యాగం చేసుకోవడం, కష్టం వస్తే పంచుకోవడం,సుఖం వస్తే సంతోషించడం , తన కొరకు ఎదురుచూసే ఒక ప్రాణం, తన వాళ్ళు అనుకుని చుట్టుకునే బంధాలు ఇవేమి లేకపోతే మనిషికి ఏమి లేనట్లే! ఇప్పటి జనరేషన్ వారికి ఉమ్మడి కుంటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు తెలియవు . చిన్న తనం నుండి చదువుల ఒత్తిడి ఎంత ఉంటుందో అంతకు రెట్టింపు కావాల్సిన వాటిని పెంకితనంతో సాధించుకుంటారు . తల్లిదండ్రులు కూడా వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికే ఉన్నట్లు ఉంటున్నారు. అందుకే నాది - నేను అనే తత్త్వం పెంచి పోషింపబడి ఇతరులతో సర్దుకోలేని, సరి పుచ్చుకోలేని, రాజీ పడని ధోరణిలో వింత నడక నడుస్తున్నారు. "ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును " అనే మాటలో ఎంత నిజం ఉందొ కాని ఒకరి పొడ గిట్టకుండా బ్రతకడంలో ఆనందాన్ని వెదుక్కుంటున్నారు ఆధార పడటం అంటే నామోషీ అనుకునే రోజులు వచ్చేసాయి. బ్రతికినన్నాళ్లు నచ్చినట్లు బ్రతకడం, బ్రతకలేనప్పుడు చద్దాం. అప్పుడు సంగతి ఇప్పుడెందుకు ? అని అనుకునే వారిని చూస్తున్నాం.
నాకు ఆరేళ్ళ నుండి తెలిసినతను ఒకరు ఉన్నారు. మా ఇంటికెదురుగా ఉన్న బిల్డింగ్ లో ఉండేవాడు. హోటల్ & రెస్టారెంట్ నిర్వహిస్తూ వాటితో పాటు అనేక బిజినెస్ లు చేసేవాడు. గోదావరి జిల్లా అబ్బాయి. తండ్రి చనిపోయాడు. తల్లి పల్లెటూరిలో లంకంత కొంపలో పనివాళ్ళ సాయంతో పొలాలని చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు విదేశాలలో ఉంటాడు. పెళ్లి అయి ఏదో తేడాలు వచ్చి ఒక నెలకే విడిపోయారు . రెండో అతను కూడా నలబై ఏళ్ళు దగ్గర పడుతున్నా పెళ్లి పెటాకులు లేకుండా కాలేజీలకి వెళ్ళే అమ్మాయిలకి సైట్ కొడుతూ జాలీగా గడుపుతూ ఉన్నాడు. ఆ తల్లి అలమటించి పోతుంది. ఇద్దరు కొడుకులు అలా తగలడ్డారు అని. ఇటీవల కాలంలో డబ్బుతో సర్వ సుఖాలు అనుభవించ వచ్చు అనుకునే వారు పెరుగుతున్నారు అనడానికి ఇలాంటివే ఉదాహరణలు.
జల్సాగా తిరుగుతూ వివాహ జీవితం, కుటుంబం అనవసరం అనుకుంటున్న వారికి కుటుంబం . కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలు గురించి (సినిమాలలో చూపే అనుబంధాలు కాదు ) కొన్ని సజీవ సంబంధాల గురించి ఒక పోస్ట్ వ్రాస్తాను .
.... అంతా నాటకమేనా !? కాదు, అనుబంధాల అల్లిక అంటే ఏమిటో ... ఈ నాటి పోస్ట్ పెద్దది అవుతుంది కాబట్టి .. రేపటి పోస్ట్ లో ఆ విషయాలు..

4 కామెంట్లు:
అద్భుతంగా చెప్పారు!
చాలా బాగా చెప్పారు వనజ గారు
మళ్లున్నా మాణ్యాలున్నా ...... పంచుకునే మనిషుండాలి... , మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై... పాటలు కూడా ఉంది కదా వనజ గారు. మంచి అంశాన్ని ఎంచుకున్నారు. వీలైనన్ని పోస్టులు ఇదే అంశంపై వ్రాయవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోయి ... ఆత్మన్యూనతలకు.... ఆత్మహత్యలకు దారితీసే మానసిక ధోరణులు పెరగడానికి కారణం ఉమ్మడి కుటుంబాలు , కుటుంబ అనుబంధాలు తగ్గడం కూడా ప్రధాన కారణమని సర్వేలు చెపుతున్నాయి.
'ఎంత ఆస్తి ఉన్న ఏమి లాభం? ఆత్మీయానురాగాలు పంచుకునే మనుషులు లేనప్పుడు!' చక్కగా వివరించారు వనజ గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి