31, జులై 2013, బుధవారం

రక్త సంబంధం

ఫ్రెండ్స్ ! అనుబంధాల అల్లిక గురించి సీరియల్ గా కొన్ని పోస్ట్లు వ్రాదామనుకుంటూనే  ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
 మన సోదర సోదరుల మధ్య బంధాన్ని "రక్త సంబంధం " అంటూ ఉంటాము కదా !  అలాంటి రక్త సంబంధీకుల గురించే ఈ పోస్ట్.

ఒక చిన్న పాప 4 ఏళ్ళు నిండి 5 వ సంవత్సరంలోకి అడుగిడింది .  రక్త హీనతతో బాధ పడుతున్న ఆ పాపకి అర్జంట్ గా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆ పాప కి కావాల్సిన గ్రూప్ రక్తం దొరకక .. సిటీ లో ఉన్న బ్లడ్ బ్యాంకు లన్నిటి చుట్టూ తిరిగి తిరిగినా కూడా ఆ గ్రూప్ రక్తం దొరకక, అవసర సమయానికి డోనర్స్ లభించక ఆ పాప మరణించింది. అయ్యో! ఈ ఊర్లో మనుషులే లేరా!? ఒక్కరు కూడా రక్తం ఇవ్వలేదు. ఒక్క బ్లడ్ బ్యాంక్ వాడు కనికరం చూపలేదు అని ఆ పాప తల్లి దండ్రులు బంధువులు హృదయ విదారకంగా ఏడుస్తుంటే చూసేవారికి కడుపు తరుక్కు పోయిందట. అది విన్న నాకు ఇలా అనిపించింది   "ఇంతటి కఠినాత్ముల ఉన్న లోకంలో బ్రతకడం ఎందుకని ఆ పాప చనిపోయింది"అని

మన చుట్టూ ఎన్నో బ్లడ్ బాంక్ లు ఉన్నా కూడా అవి సేవా గుణం ముసుగులో వ్యాపారం చేస్తున్నాయని తెలిస్తే మనుషుల్లో మానవత్వం లేదని బాధపడటమే కాదు,  ఆవేశం తన్నుకు వస్తుంది.  అందుబాటులో ఉన్న రక్తాన్ని దాచిపెట్టి రక్తం కావాల్సిన వారికి ఇవ్వకుండా వ్యాపారం చేసుకుంటూ 32 రోజుల తర్వాత ఎవరికీ ఉపయోగ పడనీ రక్తాన్ని మురుగుకాల్వ పరం చేసే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఒక వ్యక్తీ నుంచి సేకరించిన రక్తాన్ని 32 రోజుల పాటు రక్షణ పద్దతులలో భద్ర పరచి అవసరం ఉన్న వారికి ఉపయోగించవచ్చు. ఇక్కడే బ్లడ్ బ్యాంక్ లు వ్యాపారం చేయడం నేర్చాయి .  ఎక్కువ డబ్బుకి అమ్ముకోవడం మొదలెట్టి అందుబాటులో లేదని చెపుతూ ఉంటారు. వారు అనుకున్న ధర వచ్చేదాకా అలాగే చెపుతూ ఆఖరికి వృధా అయినా చేస్తారు కాని అవసర పడిన వారికి ఇవ్వరని ఆసుపత్రుల సిబ్బందే చెపుతుంటారు.  అలాగే  బ్లడ్ బ్యాంక్లు 24 గంటల సేవలో కూడా ఉండటం లేదు ఉదయం 09:00 To  06:00 సమయాలలోనే అందు బాటులో ఉండి ఒక్క బ్లడ్ బ్యాంక్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ బ్యాంక్ ల వారు టైం టేబుల్ ఏర్పాటు చేసుకుంటారు అందువల్ల ప్రతి రోజు ఏ బ్లడ్ బ్యాంక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందో ఆసుపత్రి సిబ్బందికి తప్ప మిగతావారికి తెలియవు. బ్లడ్ బ్యాంక్ లు మూసి ఉండటం వల్ల  అనారోగ్యంలో ఉన్న వారికి సరయిన సమయానికి రక్తం అందక అవసరార్దుల ఆందోళన   ఎలా ఉంటుందో అనుభవిస్తే కాని తెలియదు అని రక్త ప్రదాత బంధువు వ్యాఖ్యానించడం చూసాను

మన దేశ జనాబాకి సంవత్సరానికి   10 లక్షల యూనిట్ ల రక్తం అవసరపడుతుందని తెలుస్తుంది.   కొన్ని సేవా సంస్థలు రక్త  దాతల నుండి రక్తాన్ని సేకరించి  రహస్యంగా తరలించి 7000 యూనిట్ల రక్తం ని అమ్ముకోబోతుండగా ఆ విషయం బయటకి పొక్కి అరెస్ట్ చేయబడ్డారు. బ్లడ్ బ్యాంక్ ల సేవా ముసుగులో ఇలాంటివి బయటకిరానివి ఎన్నో ఉంటాయని చెప్పారు . ఇలాంటి విషయాలని చెపుతుంటే  వింటూ ఆశ్చర్య పోయాను.ఇలాంటి విషయాలు విని తెలుసుకుని స్వచ్చందంగా పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2011 వ సంవత్సరంలో కనగాల విజయ్ కుమార్ అనే వ్యక్తీ ... ఈ సంస్థని ప్రాంభించారు. ఆ సంస్థ అతని తోనే  ప్రారంభం  అయింది




మాకు సమీపంలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈ రోజు ఈ  బ్లడ్ బ్యాంక్ పరిచయం జరిగింది . అక్కడ విన్న విషయాలు ఇవి. పైన  నేను చెప్పిన విషయాలని స్టూడెంట్స్ కి వివరిస్తూ బ్లడ్ డొనేట్  చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్పారు



 ఈ బ్లడ్ క్రాస్  లో మెంబెర్ అయిన వ్యక్తీ నేరుగా బ్లడ్ ని డొనేట్ చేయవచ్చు. చేయాల్సినదల్లా  మీ పరిసర ప్రాంతాలలో  ఉన్న బ్లడ్ క్రాస్ సంస్థలో మీ వివరాలు అందజేయడమే ! మీ గ్రూప్ రక్తం అవసరమైనప్పుడు మీకు ఈ సంస్థ కార్యకర్తల నుండి ఫోన్ వస్తుంది. మీరు  రక్తం కావాల్సిన వ్యక్తీ ఉన్న హాస్పిటల్ కి నేరుగా వెళ్లి అక్కడ వారికి కావాల్సిన రక్తం ని అందించడమే1 ఈ పనిలో అందరూ స్వచ్చందంగా పని చేస్తారు.  జీత భత్యాలు ఏవి ఉండవు ఎలాంటి చార్జీలు వసూలు చేయబడవు. రక్తం సేకరించడం, దానిని నిల్వ చేయడం లాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా రక్త దాత నుండి రక్త ప్రదాతకి రక్తం లభ్యం అవుతుంది. ఇప్పటికి ఈ బ్లడ్ క్రాస్ సంస్థలో 3 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వారి వారి ప్రాంతాలలో అవసరం అయినప్పుడు రక్తం ఇవ్వడానికి, మరీ అత్యవసరం అయితే ఇతర ప్రాంతాలకి వెళ్లి కూడా రక్త దానం చేసే వారు ఉన్నారు.అదీ గొప్ప విషయమే కదండీ!















ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ బ్లడ్ క్రాస్ సంస్థ లో సభ్యులగా చేరవచ్చును. రక్త దాతలుగా మారవచ్చును. దుర్వినియోగం కాని  రక్త దానం  చేసామన్న సంతృప్తి కల్గుతుంది. స్వచ్చంద సేవ ముసుగు వేసుకున్న సంస్థలకి రక్త దానం చేయడం కన్నా ఈ విధానం చాలా బాగుందని నాకు అనిపించింది. అపాత్రదానం అవకుండా ఉంటుంది కదా! ఇది మనిషికి మనిషికి ఉన్న రక్త సంబంధం. కాదంటారా !?

మనకి రక్త దానం చేసే విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. సరయిన బరువు ఉన్న వ్యక్తులు ఎవరైనా రక్త దానం చేయవచ్చని చెప్పారు . ఈ మధ్య 70 సంవత్సరాలు పై బడిన వ్యక్తీ కూడా బ్లడ్ క్రాస్ ద్వారా రక్తదానం చేసారట. ఇంకేం ...  మనమూ బయలుదేరవచ్చు కదా! ఈ సందర్భంలో  రేడియోలో వినవచ్చే ప్రకటన ఒకటి గుర్తుకు వస్తుంది  thalassemia తో బాధ పడే ఒక పాప ఒక వ్యక్తీ కి థాంక్స్ చెపుతుంది. ఎందుకు ..పాపా ..నాకు థాంక్స్ చెప్పావు, నాకు అసలు నువ్వు పరిచయమే లేదు. నీకు నేను ఏ సహాయం చేసాను అని అడుగుతాడతాను. అప్పుడు ఆ పాప ... ఇప్పుడు చేయకపోయినా ఇక ముందు అయినా చేయండి thalassemia తో బాధపడుతున్న వారి కోసం రక్త దానం చేయండి .. అని చెపుతుంది. అది రక్త దానం యొక్క ఆవశ్యకత. ప్రకటన టచింగ్ గా ఉంది కదా!

రక్తం దొరకక మళ్ళీ మరో పాప చనిపోకూడదు. అని మనకి ఎంతో  సిగ్గు చేటు కదా !

 ఇలా బ్లడ్ క్రాస్ సంస్థలకి  రూపకల్పన చేసే  విజయ కుమార్ లు ఎందఱో కావాలి. కనీసం  అలాంటి సంస్థ లో సభ్యులైనా కావాలని ... నా ఈ చిన్ని ప్రయత్నం.

(   ఏమిటీ సోది అనుకోకుండా ... ఈ పోస్ట్ ని ఓపిక గా చదివిన అందరికి ధన్యవాదములు )

7 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

" ఎక్కువ డబ్బుకి అమ్ముకోవటం మొదలెట్టి , అందుబాటులో లేదని చెబుతుంటారు . వారు అనుకున్న ధర వచ్చేదాకా అలాగే చెపుతూ , ఆఖరికి వృధా అయినా చేస్తారు ,అవసరమైనవారికి యివ్వరని ఆసుపత్రుల సిబ్బందే చెప్తుంటారు ."
ఇది నిత్యం మనం అన్ని విషయాలలో చూస్తూనే వుంటాం . ఉదా : ఇల్లు ఖాళీగా నైనా వుంచుతాం గాని మనం అనుకున్న అద్దె రాకుంటే , వాళ్ళు అడిగిన అద్దెకు మనం యివ్వం కదా ! ఇదే వాళ్ళు అక్కడ వుపయోగిస్తున్నారు . తప్పే , అనుమానమేమీ లేదు . మన దృక్పధం మారితే గాని అన్ని రంగాలలో మార్పు రాదు అన్నది నిజమని నమ్ముతున్నాను .
అందరిలో ఆలోచన కలిగేలా మంచి టపా వ్రాశారు ., అభినందనలు .

భారతి చెప్పారు...

అందరూ ఆలోచించదగ్గ మంచి విషయాన్ని ప్రస్తావించారు. స్పూర్తిదాయకమైన పోస్ట్ పెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు వనజగారు.

చెప్పాలంటే...... చెప్పారు...

అందరు ఆలోచించే విధంగా ఉంది మీ టపా ఇకనైనా కొందరైనా సమయానికి రక్తం అంది బావుంటారని

పల్లా కొండల రావు చెప్పారు...

ప్రతీదీ ఈ సమాజం లో లాభం తీసుకొచ్చే సరుకుగా అనివార్యంగా మార్చివేయబడుతుంది. అలాంటి అవకాశమే ఇవ్వని విధానాలున్న సమాజం కోసం మనమంతా ప్రయత్నించాలి. ఆ దిశగా అడుగేసేందుకు ఇలాంటి సంస్థలన్నీ కృషి చేయాలి. మంచి పోస్టు.

అజ్ఞాత చెప్పారు...

డబ్బు,డబ్బు,డబ్బు, మనవాళ్ళందరికీ డబ్బు చేసింది.అన్నీ వ్యాపార వస్తువులే!మనుషులు,రక్తం, మనిషి అవయవాలు...అన్నీ

శశి కళ చెప్పారు...

yentha manchi vishayam .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma gaaru

@@భారతి గారు

@ చెప్పాలంటే మంజు గారు

@ కొండలరావు గారు

@ కష్టే ఫలే మాస్టారూ ...

@శశి కళ గారు మంచి విషయం పై స్పందించిన అందరికి మరీ మరీ ధన్యవాదములు