24, జులై 2013, బుధవారం

నా రీచార్జ్ రహస్యం

(నాస్తికులకి ఈ పోస్ట్ నచ్చక పొతే మన్నించాలి )

నిత్య జీవితంలో అనేక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఏ కారణం లేకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం... ఎందుకో !? పెద్ద కారణాలు కూడా ఉండనవసరం లేదు . ఈ మధ్య ఎందుకో ..అకస్మాత్ గా మూడీగా,  నిరాసక్తంగా ,నిస్తేజంగా ఉండిపోయాను. ఏ పని ఉత్సాహంగా చేయాలనిపించడం లేదు. చదవాలనిపించడం లేదు. అలాగే బ్లాగ్ వ్రాయడం కూడా . గత రెండేళ్లలో ఇలా ఉండటం మొదటిసారేమో!  ఈ నిస్తేజాన్ని పారద్రోలి కాస్త చురుకుగా ఉండాలంటే మానసిక ఉల్లాసం ఉండాలి. కోల్పోయిన శక్తి ని కూడా గట్టుకోవాలని ... అలా కొద్ది రోజులుగా అనుకుంటూనే ఉన్నాను. కానీ అడుగు బయటకి వేసే ప్రయత్నమయితే  చేయలేదు .  ఒక వారం రోజులుగా ... వెదికి వెదికి... రక రకాల స్వరాలలో "నిర్వాణ షట్కం"  అయితే వింటున్నాను . అంతలో సడన్ గా మా చెల్లి  "అక్కా " శ్రీశైలం వెళదామా ? అని అడిగింది. వెంటనే ..సరే ... అనేసాను . ఓ .  రెండు రోజుల పాటు మల్లికార్జునుడి సన్నిధిలో ఆయన దర్శన భాగ్యం లో ఎంతో మానసిక శాంతి లభించింది . ఆ తపోభూమిలో ..శ్వాసించిన క్షణాలు,రోజులయి... నన్ను నేను రీచార్జ్ చేసుకునేందుకు ఉపకరిస్తాయి. 
నాకెంతో ఇష్టమైన ఈ ప్రదేశం...  నా రీచార్జ్  రహస్యం .... ఇదిగో.. ఇక్కడే ! 


రెండు భిన్న స్వరాలలో " నిర్వాణ షట్కం " ని   ఇక్కడ  విని అలౌకిక ఆనందం లో మునిగి తేలుతూ
శివోహం .. శివోహం .. శివోహం  అనుకుందాం.


శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ |

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||

అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బన్దనం నైవ ముక్తి న బంధః |
చిదానంద రూపః శివోహం శివోహం ||

న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||

శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ | 

16 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

భలే వారే వనజగారూ,
ఎవరైనా నాస్తికులకు మీ‌ టపా నచ్చక వీకిరిస్తే, వారిని మీరే మన్నించవలసి యుంటుంది నిజానికి.

తప్పకుండా శ్రీశైలం వెళ్ళిరండి! శ్రీశంకరులు శివానందలహరిలో (50, 51వ శ్లోకాలలో) శ్రీశైలం మల్లన్నను ఇలా ప్రస్తుతిస్తున్నారు:

సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్‌

భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్
మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః
సత్పక్షస్సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః

మీ శ్రీశైలయాత్ర సమస్తశుభాలనూ చేకూర్చుగాక!

వనజవనమాలి చెప్పారు...

ధన్యోస్మి.. శ్యామలీయం గారు .
శివానందలహరి లో రెండు శ్లోకాలని పరిచయం చేసినందుకు మరీ మరీ ధన్యవాదములు

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి అన్ని నచ్చాలని లేదులెండి వనజ గారు దేవుడే అందరికి మంచోడు కాదుగా ఇక మన మెంత మన టపా లెంత చెప్పండి చక్కని టపా అండి చాలా బావుంది

అజ్ఞాత చెప్పారు...

స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. సంతసం.

భారతి చెప్పారు...

శివోహం శివోహం శివోహం ...
చాలా మంచి పోస్ట్ వనజ గారు.

అజ్ఞాత చెప్పారు...

nenu last 1 yr ga different health pbms thos suffer avutunnanu.
monna oka brahmin srisailam velli randi ani cheppadu.
entha bagundao srisailam.
naku ayte akkade settle ayi povali anipinchindi

బుజ్జి చెప్పారు...

నిర్వాణషట్కం అని విన్నానండీ.

వనజవనమాలి చెప్పారు...

మంజు గారు థాంక్యూ సో మచ్

వనజవనమాలి చెప్పారు...

మాస్టారూ.. నిజంగా భాగ్యమేనండీ! ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

భారతి గారు బావూన్నారా!? చాలా కాలం తర్వాత మీరు ఇలా కనిపించారు. ధన్యోస్మి.

వనజవనమాలి చెప్పారు...

sravya గారు .. నాకు ఎన్నో సార్లు అలానే అనిపిస్తుంది. ప్రపంచంలో నాకు చాలా చాలా ఇష్టమైన ప్రదేశం. అక్కడ నాకు కల్గిన ఎన్నో అనుభూతులు వర్ణించలేనివి. ఎంతో మానసిక ఆలంబన కూడా.
మీ స్పందన కి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

బుజ్జి గారు typo ని మన్నించాలి మీరు చెప్పినట్లు చిదానంద రూప శ్లోకం ఆరు స్టాంజా లు కల్గి ఉండటం వల్ల షట్కం అయింది. ధన్యవాదములు

voleti చెప్పారు...

శారీరక వైకల్యాన్ని వైద్యులు తగ్గించగలరు. మానసిక వైకల్యాన్ని తగ్గించడానికి అధ్యాత్మిక శక్తి ఒక్కటే మార్గం..ఇందుకు మీ పోస్ట్ చక్కటి వుదాహరణ.. ధన్యవాదములు.. 99 శాతం నాస్తికులు రహస్యంగా దేవుణ్ణి కొలుస్తారు..
దైవం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినా, వెళ్ళకపోయినా .. . ఏకాగ్రతతో మనకు నచ్చిన దైవాన్ని ధ్యానిస్తే... చక్కటి ఫలితాలు వస్తాయి...

వనజవనమాలి చెప్పారు...

voleti గారు . ధన్యవాదములు

భారతి చెప్పారు...

బాగున్నానండి వనజ గారు! ఈ మధ్య బాగా బిజీగా ఉండడంతో మీ చాలా పోస్ట్స్ మిస్ అయ్యాను. ఇప్పుడే మరో మూడు పోస్ట్స్ చదివాను. గంగా ప్రవాహం లాంటి మీ రచనా నైపుణ్యతను కమండలం లాంటి కామెంట్స్ లో ఇమడ్చలేను. అందుకే మౌనంగా ఆస్వాదిస్తున్నాను.

Ram Spy చెప్పారు...

Nirvana shatakam by sounds of isha ani YouTube lo vundi chala Baga vundi....