7, జులై 2013, ఆదివారం

నా ఏకాంతంలో నేను


                                                                          
ఏకాంతమంటే 
ఏకాకి తనం అని ఎవన్నారు ?

ఏకాంతమంటే  ..
నాలోకి నేను తొంగి చూసుకునే
శత సహస్ర హృదయ దర్శనం
ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
అపురూప దివ్య దర్శనం

ఏకాంతాన్ని  వర్ణించడం  అంటే
ఆలోచనలకి నగీషి పెట్టడం
అక్షరాలకి సొబగులు అద్దటం
చిత్రాలకి వర్ణాలద్దడం  కాదు

దీపాలు మలిగిన వేళ
పూలు నేలరాలే వేళ
వేకువ పువ్వు విచ్చుకునే వేళ
తెలివెన్నెల పరుచుకునే వేళ
ఏకాంతంతో  నా ఏకాంతం
ఏకమయ్యే వేళ

దీపం చుట్టూ కాంతి  వ్యాపించినట్లు
నా చుట్టూనూ నాలోనూ నా ఏకాంతమే
సిగ్గు విడిచిన కలలెప్పుడూ  కాచుకు కూర్చుంటాయి
నా ఏకాంతాన్ని భగ్నం చేయడానికన్నట్లు
వేదనలెప్పుడూ  మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
ఏకాంతమెప్పుడూ  వెలుగులోకి రాని  కాసారమే

ఉల్కలు రాలినట్లు రాలే  ఆశలని 
ఒడుపుగా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలని 
పాకుడు పట్టిన  చేదు జ్ఞాపకాలని
గులకరాళ్ళ గా మార్చి
అజ్ఞాన సముద్రంలోకి విసిరేస్తుంది
నన్ను ఒడ్డున పడేస్తుంది

నా మనోరణ్యాన మరొకరి అడుగుజాడ
కనబడనివ్వని  జాణ తనంతో
నన్ను తప్ప మరొకరిని తాకనివ్వని
అంటరానితనం తోనూ 
అనంత ఆలోచనల 
కసి చాకిరి చేస్తూ ఢస్సిల్లి పోతుంది   
భావ విస్పోటనంతో చెల్లా చెదురవుతుంది
స్రావాలుగా జారుతూ
నా బాహ్య ప్రపంచపు గాలిని  పీల్చుకుంటుంది  
కాలంతో దొర్లుతూ అవశేషం గా
మిగులుతుంది
భిక్షాపాత్రలో  రేపటి నా  ఏకాంతానికి
కొంత ఖాళీ ఉంచుతూ ...
నన్నొక మనీషిగా నిలుపుతూ

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా చాలా నచ్చేసిందండీ!

Goutami News చెప్పారు...

మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.in

కాయల నాగేంద్ర చెప్పారు...

చాలా బాగుంది వనజ గారు!

ranivani చెప్పారు...

చాలా బాగా రాసారు .ఎంతగా ఆలోచించి ఉంటారో అన్పించింది

N Praveen చెప్పారు...

mI bhaavanalani achu guddinattu aksarabaddam chesina vidanam.. mI bhava prakatana parinathini suchistondi... Chala baga vrasaru.

జలతారు వెన్నెల చెప్పారు...

అద్భుతః

చెప్పాలంటే...... చెప్పారు...

ekaantaanni enta baagaa chepparo ventane naku raayalanipinchindi

అజ్ఞాత చెప్పారు...

అద్భుతః

సి.ఉమాదేవి చెప్పారు...

ఏకాంతపు కవనంలో కనరాని దృశ్యాలను కవిత్వీరించి కనులముందు నిలిపారు.కవితాభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ .గారు కవిత నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు, నాగ రాణి గారు, ప్రవీణ్ కుమార్ గారు. జలతారు వెన్నెల గారు ,చెప్పాలంటే గారు మీ అందరికి ఈ..కవిత నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ @ సి. ఉమాదేవి గారు కవిత నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thanks To All.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.