5, ఆగస్టు 2013, సోమవారం

ఇదే రోజు ...

ఒక ప్రయాణం ఆప్తులని విడదీస్తుంది .. 

మూడేళ్ళ క్రితం .. సరిగ్గా ఇదే రోజు ఇదే సమయానికి ఒక లోహవిహంగం నన్ను - నా కొడుకుని విడదీసి వేలమైళ్ళ దూరంలో  ఉంచింది.

చిన్ని ..బంగారం !!
కన్న పేగు దీవెన...  నిన్ను ఎప్పుడూ  కాచే కన్నై ...ఉంటూ 

ఎక్కడ నీవున్నా   నా ఆశలు  నీవన్నా
నీతో  నీడల్లే నా ప్రాణం ఉందన్నా... 
నువ్వు ఇంతకూ ఇంతయి అంతకు అంతై  ఎదగర ఓ ..నాన్నా!

ఐ మిస్ యూ .. బంగారం ... blessings  with lots of love ... "అమ్మ"

దూరాలు పెరిగినా గారాలు, మారాలు.. అనీ మామూలే ! అమ్మకి ముద్దు బిడ్డడు కదా !





11 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అమ్మ ప్రేమ ఎంత దూరానున్నా దరి చేరగలదు ఇలా గుర్తు చేసుకోవటం తో...

అజ్ఞాత చెప్పారు...

Wishing him all success in fiture life

Sharma చెప్పారు...

వనజ గారూ ,

మిమ్మల్ని , మీ కొడుకునీ ఒక లోహ విహంగం విడదీసింది అన్నారు . సరిగా అర్ధం కాలేదు .
నా ఆలోచన ప్రకారమైతే , చిరంజీవి ఉన్నతంగా ఎదగాలన్న సద్భావన మిమ్మల్నిరువురిని విడదీసింది అనుకొంటున్నాను .
ఎంతదూరాన వున్నా , అమ్మ అనురాగాలకి , పిల్లల గారాలకి అడ్డంకులేవీ కావు కదా! . మీ చిరంజీవి భవిష్యత్తులో ఉన్నతంగా శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ , ఆశిర్వదిస్తున్నా ఈ టపా పూర్వకంగా .

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

love u mom

భారతి చెప్పారు...

ప్రియతనయుడు అమ్మ ఆశీస్సులతో ఉన్నతస్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ...

Radha Manduva చెప్పారు...

వనజ గారూ,
మీ అబ్బాయి మరింత ఉన్నతంగా ఎదగాలి. మా అబ్బాయి లాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి. నాకు బ్లాగ్ తయారు చేసి పెట్టమని ఎన్ని రోజులుగానో బ్రతిమాలినా టైమ్ లేదు మమ్ అనేవాడు. ఒకరోజు మీ అబ్బాయిని చూపించి మీకు అతను ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తాడో చెప్పగానే వెంటనే నాకు బ్లాగ్ తయారు చేసి ఇచ్చాడు. మీకు తెలియకుండానే నేను మీకు ఋణపడ్డాను. మీకు తెలియకుండానే మీ ఋణం తీర్చుకున్నాను. కల్పన గారు మీ కథ స్వాతి వాళ్ళ అమ్మ ప్రూఫ్ చూడమంటే చూశాను. :). భలే కదా!
మీ బాబుకి నా ఆశీస్సులు తెలియచేయండి.
ధన్యవాదాలతో
రాధ మండువ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని ఆశ గారు .. అవును మీరు చెప్పినది నిజం . థాంక్ యూ !

@ కష్టే ఫలే .. మాస్టారూ .. ధన్యవాదములు

@ Sharma గారు .. లోహవిహంగం అనగా విమానం ఉన్నత చదువులు కోసం US .అక్కడే ఉద్యోగం పిల్లల .. ఉన్నత భవిష్యత్ కోసమే మమకారాలకి తాళం వేసుకోవాల్సి వస్తూ ..ఇలా గుర్తుచేసుకుంటూ ఉంటానండీ. . ధన్యవాదములు

@ ప్రిన్స్ .. గాడ్ బ్లెస్స్ యూ !

@భారతి గారు మీ అమృత తుల్యమైన దీవెనలకి ధన్యవాదములు.

@రాధ గారు .. మీరు ఇలా నన్ను పలకరించడం చాలా సంతోషం. థాంక్ యు ! స్వాతి వాళ్ళ కథ మిమ్మలనీ బాగా విసిగించింది కదా! వెరీ సారీ . నా సమయాభావం వల్ల నా పోస్ట్ లలో చాలా typos ఉంటాయి.

ఇక పొతే మీ బాబు కూడా మీకు బ్లాగ్ చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం బాబుకి నా దీవెనలు. ఋ నాలు సంగతి ఇబ్బందిగా ఉండండి. :) అవేమి వద్దు. ధన్యవాదములు.

జయ చెప్పారు...

ఎక్కువ దిగులు పడకండి వనజ గారు. మీ 'కలల విహంగం' కలకాలం కలుపుతూనే ఉంటుంది.మీ అబ్బాయి కి ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు .. మీ హృదయపూర్వకమైన వ్యాఖ్యకి చాలా సంతోషం మరియు మరీ మరీ ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

I appreciate both of u...for maintaining the wonderful relation....my blessings to ur son...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Anoo గారు మీ విషెస్ కి మరీ మరీ ధన్యవాదములు