మా పెనమలూరు అంటేనే పచ్చని ప్రకృతి. కానీ ఇప్పుడంతా కాంక్రీట్ భవనాల సముదాయం . ఇలా ఆహ్లాదకర వాతావరణం ని బంధించినప్పుడు ఇలాంటి దృశ్యాలని ఇకముందు చూడలేమన్న దిగులు మొదలవుతుంది .. గత నాలుగేళ్ల నుంచి అనూహ్యంగా మా వూరి ముఖచిత్రం మారిపోతుంది. అభివృద్ధి కన్నా మూలాలు నాశనం కావడమే బాధగా ఉంది . ఎటుచూసినా భూమికి ఆకుపచ్చని రంగేసినట్లుండే పరిసరాలు కనుమరుగవుతూ ....................
ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది ..
మచిలీపట్నం రోడ్డు వెంబడి భూమి విలువ ఎకరం ఒక కోటి ముప్పై లక్షలు దాటుతుంది . తామరతంపరగా నెలకొంటున్న కార్పోరేట్ కాలేజ్ లు ,విస్తరిస్తున్న కాలనీల సంస్కృతీ .. వ్యవసాయం ని దూరం చేస్తున్నాయి . అభివృద్ధి - సోమరితనం రెండు పోటీ పడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది అంటే ఇలాగేనేమో మరి !
అడవులు ఉండేవి.. అన్నగుర్తుకు..
ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది ..
మచిలీపట్నం రోడ్డు వెంబడి భూమి విలువ ఎకరం ఒక కోటి ముప్పై లక్షలు దాటుతుంది . తామరతంపరగా నెలకొంటున్న కార్పోరేట్ కాలేజ్ లు ,విస్తరిస్తున్న కాలనీల సంస్కృతీ .. వ్యవసాయం ని దూరం చేస్తున్నాయి . అభివృద్ధి - సోమరితనం రెండు పోటీ పడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది అంటే ఇలాగేనేమో మరి !
అడవులు ఉండేవి.. అన్నగుర్తుకు..
ఆనవాళ్ళుగా మిగిలిన మొదలంటా.. నరికిన మోళ్లు..
ఒట్టిపోయిన పుడమి తల్లి ఒడిలో..
పచ్చదనాలు స్థానే .. ఆక్రమిస్తున్నఎడారులు ..
కాలుష్య పరిమాణాన్ని సూచించే..
ఎలక్ట్రానిక్ . డిస్ప్లే బోర్డులు..
మునిగిపోతున్న ద్వీపకల్పాలతో..
ఎటు చూసినా.. నీరే!.
తాగేందుకు చుక్క కూడా లేదనుకుంటూ ..
మనం పడే.. పాట్లు...
ఎక్కడ ఉంది.. ప్రకృతి..?
మనిషి వికృత చేష్టలకి మలిగి..
సాధించిన ప్రగతి ముంజేతి కంకణం లా..
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ .. అనే అద్దంలో.. కనబడుతుంటే..
చాపక్రింద నీరులా.. కబళిస్తున్న కాలుష్యం లో మునిగి తేలుతున్నాం
మలమలలాడుతూ..భూమండలం.. అగ్నిగుండమవుతుందని వాపోతున్నాం
నీటికై.. మరో.. ప్రపంచ యుద్ధానికి.. సమాయుతం అవుతున్నాం
క్షామంతో.. మన జీవనాలు.. అతలాకుతలం కావడం నిజం .
విచ్చల విడి వినియోగాన్ని మానేద్దాం
భావితరంకి ప్రకృతి ఆకృతిని ..మిగుల్చుదాం
మొక్కలని మొక్కవోని దీక్షతో.. నాటి...
భూమికి .. ఆకుపచ్చని రంగు వేద్దాం
(అని ఓ.. ఆశ )
ఈవిషయం ఓ.. 11 ఏళ్ళ క్రితం వ్రాసుకుంది . ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది
(అని ఓ.. ఆశ )
ఈవిషయం ఓ.. 11 ఏళ్ళ క్రితం వ్రాసుకుంది . ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది
5 కామెంట్లు:
andangaa raasaaru ..avedanagaa raasaaru ..
మెహదీ ఆలీ గారు .. థాంక్ యూ ! నిజం చెప్పాలంటే ..ఈ ఊరులో నేను పుట్టి పెరగలేదు కానీ ఈ వూరితో నాకున్న అనుబంధం చాలా గొప్పది . మా అత్తమ్మ ఈ ఊరిలోనే పుట్టిపెరిగారు అలాగే మా వారు ఈ ఊరిలోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నారు. అలాగే మా అబ్బాయి పదేళ్ళపాటు ఇక్కడే పెరుగుతూ చదువుకున్నాడు . మేము 15 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాం. అందుకే మా వూరిపట్ల నాకంత మమకారం.గ్రామ మూలాలు మారిపోతుంటే అంగీకరించలేక.. ఆవేదన.
మీ ఆవేదనలో పూర్తి అర్ధం కనిపించిందండీ! శతాబ్ధాల పాటు కళకళలాడిన గ్రామీణాలు ఒక్క దశాబ్ధంలో నిర్జీవమయిపోవటం ఎంతో బాధాకరం. ఒకసారి పోయిన పచ్చదనం తిరిగి తెచ్చుకోవటం జరగనిపని.
మనిషి అత్యాశకు పచ్చదనం బలయిపోతూ ఉంది. ఒక రోజు తానూ బలి అయి పోతాడు, గమనించుకోటం లేదు
పల్లెలు పట్టణాలుగ మారాలని మనమే కోరుకుంటున్నాం , అది అభివృధ్ధికి చిహ్నంగా భావిస్తున్నాం . మరో వైపు పచ్చదనం కనుమరుగాఇపోతోందని వాపోతున్నాము . అభివృధ్ధి తప్పక కావాల్సిందే .
అయితే ఈ సమస్యను అధిగమించాలంటే , మొక్కలను మొక్కవోని దీక్షతో నాటి , పెంచుదాం . అపుడు మన ఆవరణ , పర్యావరణం కలుషితం కాకుండా ,కళ కళ లాడుతూ వుంటాయి . అంతే కాకుండా ఆహ్లాదకరమైన , ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి వుంటాము .
కామెంట్‌ను పోస్ట్ చేయండి