7, ఆగస్టు 2013, బుధవారం

బ్లాగ్ పయనంలో కొన్ని మైలు రాళ్ళు

ఈ రోజు నా బ్లాగ్ వీక్షణల  సంఖ్య 200000 లని  దాటింది అక్షరాలా రెండు లక్షల వీక్షణలని  ఖాతాలో జమ చేసుకుంది అనాలేమో!  :) 

ఆ  సంఖ్యని అందుకుంటున్నప్పుడు ఏ పోస్ట్ ఉంటుందా...  అని  అనుకున్నాను కూడా ! ఇదిగొ.. నాకెంతో ఇష్టంగా ఇలా...


 ఒక విశేషం ఏమంటే ... ఒకసారి నాకు మా అబ్బాయికి జరిగిన సంభాషణ.

తన   పర్సనల్ సైట్ కి  ... 24,000 మంది వీక్షకులు ఉన్నారు. అది చూసి నేను అబ్బ ..పెద్ద గొప్పేలే ! అన్నాను సరదాగానే .

"అలాగే ఉంటుందమ్మా ! .. నువ్వు వ్రాసి చూడు .. అంత ఈజీ కాదని  నువ్వే ఒప్పుకుంటావ్ " అన్నాడు

"అలాగే చూస్తూ ఉండు ... నీకన్నా బెటర్  గా .. తక్కువ టైం లో నిన్ను బీట్ చేస్తాను ".. అన్నాను  మాట పట్టింపు గా, పట్టుదలగా కూడా.

"తప్పకుండా  ట్రై చెయ్యమ్మా ! నువ్వు గెలిస్తే ఏముంది ?  మా అమ్మవే కదా ! " అన్నాడు .

ఆ సంగతి మర్చి పోయాం కూడా .

ఇదిగో ఇవాళ  చప్పున జ్ఞాపకం వచ్చింది. తన సైట్ 100000 వీక్షణల  లోనే ఉంది.

నా బ్లాగ్ వయస్సు 2 సంవత్సరముల 8నెలలు , 682 టపాలు ,,,

అలాగే    నా బ్లాగ్ కి విచ్చేసిన తోటి బ్లాగర్ ల సంఖ్యా 100000 కి చేరుకుంటుంది. ఎక్కువ మంది గూగుల్ సెర్చ్  ద్వారా వివిధ దేశాలకి చెందినవారు నా బ్లాగ్ ని  దర్శిస్తున్నట్లు గుర్తించాను. అదండీ సంగతి !

నేను బ్లాగ్ వ్రాసిన క్రొత్తలో వ్రాసిన పోస్ట్ ఒకటి .. మళ్ళీ షేర్ చేస్తున్నాను . అప్పుడు ఏ సంకలినిల ద్వారాను పరిచయం చేయబడ నప్పుడు   వ్రాసిన పోస్ట్ ఇది .  ఆ పోస్ట్ ... పేరు

కృష్ణా తీరంలో ఓ ..సాయం సమయం

 నేను.. ఇటీవల.. ఒక.. చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహించాను.. ఒకింత బిడియం.. జంకు, వగైరాలతో..  భయపడ్డాననుకోండి .. అసలు భయపడటం  నా సహజలక్షణం కాదండోయ్ .. అసలు విషయం ఏమిటంటే .. శ్రీమతి ఇందిరా గాంధి  జయంతి సందర్భంగా  మహిళలు -రాజకీయాలు అనే అంశం పై చర్చా కార్యక్రమం అన్నమాట. ఆ కార్యక్రమంలో పేరుగాంచిన మునుపటి ఎం.పీ  గారు, ప్రస్తుత జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు , మాజీ మేయరు గార్లు, కొంతమంది కార్పెరేటర్లు..ఆతిధులుగా ఆహ్వనింపబడ్డారు.

సమయం వచ్చేసరికి  మాజీ మేయరు గారు తప్ప అందరు గైర్హాజరు.

ఇదేనా మహిళల అంకితభావం .. రాజకీయ రంగం అంటేనే విముఖత వ్యక్తపరుస్తున్న కాలంలో మహిళలు రాజకీయరంగంలోకి  ప్రవేశించడం అత్యంత ఆవశ్యకరం అని .. వారి అనుభవాలు, ఎదుర్కున్న వత్తిళ్ళు, అణచివేతలు, సవాళ్లు  అన్నీ సభికులకి అందునా ఎంతో ఆసక్తిగా  ఎదురుచూసిన మహిళల  అందరికి నిరాశని మిగిల్చారు.

చట్టసభల్లో మహిళల శాతం, అంగ బల-అర్ధ బల, వారసత్వ,గరిటె తిప్పుదు     రాజకీయాల గురించి .. ప్రపంచ వ్యాప్తంగా మహిళ రాజకీయ రంగంలో ఎలా దూసుకుని వెళ్లి హక్కుల సాధనలో, ఎలా అభివృద్ధి సాధనలో భాగస్వామ్యం వహించిందో ..  ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకురాళ్ళ అవసరం మనకు ఎంత ఉందో .. అని ఇలాటి విషయాలు ఎన్నో చర్చిద్ధామానుకున్న  నా ఆశ అడియాసే అయ్యింది.

ఇంతకి మన నాయకీమణుల  అభ్యంతరాలు  ఏమిటి  అంటారా.. !?

చెపుతున్నానండీ. ఒకావివాడ  అందుబాటులో  ఉండే రాజధాని లో ఉన్నానని చెప్పడం..  సెల్ ఫోను  కదండీ .. ఏదిచేప్పినా  అతుకుతుంధికదా.. ! ఒకావిడ  తన మామగారికి అనారోగ్యం అని,  ఒకావిడ అసలు తన మొబైలు ఫోను  పీక నొక్కేసింది. ఇవండీ వీరివీరి వాటాలు.

ఆమెరికా ప్రధమ మహిళకి  మన జాతిపిత ఆదర్శనీయం, స్పూర్తికరం అంట.

మరి మన మహిళలికి.. కుటుంబ భాధ్యతలు,కుటుంబ నిబంధనలు  ఉండే ఉంటాయేమో.కాదనలేను,. కానీ వీరికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే  నిబద్దత ఉండాలి కదా. !   పాపం మా సాహిత్య సంస్థ కార్యదర్శి  గారి భాధ చూడలేకపోయానంటే  నమ్మాలి మీరు. జయంతులకి, వర్ధంతులకి  పట్టుచీరల రెపరెపలతో హాజరయ్యే మహిళా నాయకురాళ్ళు  యువనేత పుట్టినరోజుకు బోకే తో వరుసలో గంటల తరబడి వేచిన అమ్మలు .. సాదాసీదా కార్యక్రమాలకి రారు కాబోలు.వీరిని ఆదర్శంగా తీసుకునా...  ఇతర మహిళలు  బిడియం వదిలేసి రాజకీయరంగం లోకి ప్రవేశించేది ..???? 

ఇందిరాజీ..!క్షమించు  తల్లీ .!! జాతీయ మహిళా దినోత్శవం రోజు  నీ స్పూర్తికి  అననుకూలంగా మహిళా సభలో.. ఎంతటి నిర్లక్ష్యం .. మన నాయకురాళ్ళకి వారి అధిరోహణ క్రమాన్ని  ఇతరులతో  పంచుకుని  ఉత్తేజం చేసే భాద్యత ఉందా-లేదా..  పదవులు కాపాడుకోవడానికి, అనునూయులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడటం మానేసి  రాజకీయ శిక్షణ తరగతుల శిబిరాల రూపకల్పనకి ఉపక్రమిస్తే  వారిలా మహిళలు   రాజకీయరంగంలో ప్రవేశించి మహిళా  బిల్లు అమోధంకి  తగినంత బలం  కూడగట్టుకుంటారు కదా .. మీరేమంటారు.!? 

:) :)  (బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టినప్పుడే బాగానే రాశానని అనిపిస్తుంది )

26 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

అబ్బో అంతమంది వీక్షకులే :)అభినందనలండి.
మీ మొదటి పోస్ట్ బాగుందండి.

knmurthy చెప్పారు...

congrats madam

పల్లా కొండల రావు చెప్పారు...

congratulations vanaja garu.

Raj చెప్పారు...

మీకు అభినందనలు..

Padmarpita చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు.

cbrao చెప్పారు...

అభినందనలు.

Unknown చెప్పారు...

ఓహ్! రెండు లక్షల వీక్షణలే!భలే!

Zilebi చెప్పారు...


వనజ వనమాలీ గారు,

"బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టినప్పుడే బాగానే రాసారు" ఒప్పేసు కుంటున్నా!

జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రెండు లక్షల వీక్షకులా, ౬౮౨ టపాలా! మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. హృదయ పూర్వక అభినందనలు. శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా గారు ధన్యావాదములు
@ kn మూర్తి గారు థాంక్స్ అండీ
@ పల్లా కొండలరావు గారు ధన్యవాదములు
@రాజ్ గారు ధన్యవాదములు
@ పద్మార్పిత గారు థాంక్ యు సో మచ్

Sharma చెప్పారు...

బ్లాగు మొదలుపెట్టినపుడే బాగా వ్రాశానని మీరే ఒప్పుకున్న తర్వాత నేను తప్పుకోవలసిన అవసరం లేకుండా చేసిన మీకు , నా శుభాబివందనలు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

cb rao గారు ధన్యవాదములు
@suryaprakash apkari గారు ధన్యవాదములు
@ జిలేబీ గారు బహూత్ షుక్రియా.
@బులుసు సుబ్రహ్మణ్యంగారు ధన్యవాదములు

చెప్పాలంటే...... చెప్పారు...

మొదటి టపానే చాలా బావుంది అందుకే మరి రెండు లక్షలకు చేరారు వీక్షకులు....మనలో మన మాట వనజ గారు....నాకు కాస్త సాయం చేయరాదు మీ వీక్షకులను నా వైపు పంపి కనీసం ఓ లక్షకైనా చేరతానేమో....ఎవరికీ చెప్పకండి మరి నేను అడిగానని...మనఃపూర్వక అభినందనలు....మరిన్ని మెయిలు రాళ్ళు చేరుకోవాలని కోరుకుంటూ

ranivani చెప్పారు...

congratulations vanaja garu,ilaage munduku sagandi.

అజ్ఞాత చెప్పారు...

congrats

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే ..మంజు గారు .. అలాగే ..అలాగే !!
:) మీ వ్యాఖ్యకి మరీ మరీ ధన్యవాదములు

@ నాగ రాణి గారు .. ధన్యవాదములు

puranapanda phani గారు ధన్యవాదములు

జయ చెప్పారు...

మీ అబ్బాయిని బీట్ చేసారా. పర్లేదు అమ్మేకదా అన్నాడు. ఎంత మంచి తండ్రో! మీకు నేనందిస్తున్న హృదయపూర్వక శుభాభినందనలు మీ అబ్బాయికి అందించండి వనజ గారు:)

Dantuluri Kishore Varma చెప్పారు...

Congratulations Vanaja garu!

శశి కళ చెప్పారు...

congrats akka

శ్యామలీయం చెప్పారు...

చాలా సంతోషం వనజగారూ. మీరు త్వరలో ఐదు లక్షలకు చేరుకోవాలని కోరుతున్నాను.

[అన్నట్లు అప్పుడొకరూ ఇప్పుడోకరూ చదివే నా శ్యామలీయం బ్లాగు కూడా ఎట్టకేలకు పడుతూ‌ లేస్తూ ఇరవై వేలకు చేరుకోబోతోంది రెడేళ్ళల్లో.]

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, అభినందనలు.ఇలాగే ఎన్నో మంచి టపాలను రాస్తూ మమ్మల్నందరినీ అలరిస్తూ,త్వరలో పదిలక్షల వీక్షణలను చేరుకోవాలి మీరు.ఈ పిల్లలంతే నండి అలా చాలెంజెస్ చేస్తూ ఊంటారు, మన గురించి తెలియక...:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు ..మీ ఆత్మీయ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదములు . నిఖిల్ తరపున కూడా మరీ మరీ ధన్యవాదములు

Dantuluri Kishor varma గారు థాంక్ యూ సో మచ్ !
@ శశి థాంక్ you సో మచ్
@ శ్యామలీయం గారు ధన్యవాదములు. మీ బ్లాగు కి వీక్షకుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుందండీ! నిరాశ పడకండి . ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు ..బావున్నారా? నాకు ఒక కొరత ఉందనుకున్నాను తీరిపోయిన్దోచ్! థాంక్ యూ సో మచ్. అవునండీ.. పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ?
ఒక విషయం చెప్పనా! ఈ బ్లాగ్ వ్రాయడంలో మెదడుకి పని కళ్ళకి పని, చేతులకి పని . ఈ రోజు కథ పూర్తి చేయలేకపోయాను Spondylitis మళ్ళీ మొదలయింది. నాకు భుజకీర్తులు అవసరమా అనే ప్రశ్న వేసుకుంటున్నాను. మీ లాంటి వారి వ్యాఖ్యలు చూసినప్పుడు అన్నీ మర్చిపోతాను. :) థాంక్ యూ సో మచ్.

శ్యామలీయం చెప్పారు...

> మీ బ్లాగుకి వీక్షకుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుందండీ! నిరాశ పడకండి.

తమాషాకి ప్రస్తావించానండీ. పెరగకపోయినా చింతలేదండి.

క. రాముడు చదువును చాలును
నా మనసున కదియె తృప్తి నా వ్రాతలతో
భూమి జనుల మెప్పించుట
సామాన్యము కామి పరమ సత్యం‌ బెపుడున్.

ధన్యవాదాలు.

Professor. RAO చెప్పారు...

Congrats Vanaja Garu..

na peru satyam andi.. nenu khammam lo untanu.. naa blog lo meeru rendu mudu comments kuda chesaru.. meeku gurthundakapovachulendi.. any way nenu meeru vrasina pratee post ni chaduvuthanu.. ayithe comment raaddam anukuntanu kani time kudarako, work vallo veelu padadu.. but actually 99% nenu rayalanukunna aalochanalu, bhaavale mee ratalalonuu kanipistu untayi.. adi naku chala aanandanistundi.. kakapothe nenu just b.tech complete chesi business start cheyatam valla blogging thaggipoyindi.. anduke kaniisam mee posts chusi happy ga feel avuthanu..

mee aaSeessulu kOruthu
Satyam

అజ్ఞాత చెప్పారు...

మనస్ఫూర్తిగా...మీకు నా శుభాకాంక్షలు..