23, సెప్టెంబర్ 2013, సోమవారం

దుఃఖ రహితం

దుఃఖం అనివార్యమైనది.

వాన బారిన ,  ప్రేమ బారిన, దుఃఖం బారిన పడకుండా ఎవరు ఉండలేరేమో !  దుఖానికి మూలకారణం స్పందించే హృదయం ఉన్నందు కేమో!

అసలు దుఃఖం  ఎందుకు వస్తుంది ?  ఒకోసారి  మనది కాని దుఃఖాన్ని  అనుభవిస్తాము  మనం అనుకున్నవి జరగనప్పుడు నిరాశ కల్గుతుంది అప్పుడే కాదు ఇంకెప్పుడు మనం అనుకున్నవి జరగవనే భయంతో కల్గిన  ఊహ కూడా దుఃఖాన్ని పుట్టిస్తుంది .

ఈ జీవితం చాలా చిన్నది . అందులో యవ్వన కాలం మరీ చిన్నది . యవ్వన కాలం లో లభించిన ఆనందం ద్వారానే మిగిలిన రెండు దశలు ఆనందకరంగా జరుగుతాయనీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఏ పొత్తానికి  ఆ పొత్తం  దుఃఖ చాయలు అంత అంటకుండా జాగ్రత్త పడటమే మనకున్న మార్గం

దుఃఖానికి  హేతువు  కోరికలు ఉండటమే .. అని  గౌతమ బుద్దుడు చెపితే . కోరికలు లేకుండా మనిషి మనుగడ ఎలా సాగిస్తాడని మనకి సందేహం కలుగవచ్చు . అందుకే మితిమీరిన కోర్కెలు ఉండటం మూలంగా  అవి నెరవేరక దుఃఖాన్ని  అనుభవించిక తప్పని పరిస్థితి

దుఃఖ కడలిని యెద .న  దాచవచ్చు గాని  కనుల పొరలు నదులని ఆపతరమా?

కఠిన శిలలని ఒరుసుకుంటూ జలం ప్రవహించి  ప్రవహించి కడలిని చేరినట్లు ... వెలుగుకి చోటిస్తూ రేయి తానంతట తానే  తొలిగినట్లు ...

నిజమేదియో గ్రహించ గల శక్తి ఉన్నప్పుడు . దుఃఖం  మన దరికి చేరకుండా దూరంగా తొలగిపోతుంది .

దుఃఖాన్ని ఎన్నడూ   పంచని నవ్వులని  మాత్రమే పంచే  ఆప్తులని చూసినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది

దుఃఖంలో నుండి  దుఖం లోకి జారిపోనివ్వకుండా అభయ ముద్ర నిచ్చి వారి  ముద్రలని దుఃఖ నీడన పడకుండా .. మనకి దిశా నిర్దేశం చేసే "గైడ్ " అవసరం ఉంటుంది కదా !

పార్దునికి కృష్ణుడు ఉన్నట్లు,  ఆమ్రపాలికి  బుద్ధుడు శరణ్యం అయినట్లు ...  మనకి ఆధ్యాత్మిక గురువులు అవసరం ఎంతైనా ఉంది. వారిని వెదుక్కుంటూ ... వెళుతూ .. తెలుసుకున్నవి  కొన్ని ...

ఈ జీవితమే ఒక నాటక రంగం ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు  రావటం మన చేతుల్లో లేదు పోవుట మన చేతుల్లో లేదు ..ఎవరి పాత్ర వారు నటించడమే !


4 కామెంట్‌లు:

సి.ఉమాదేవి చెప్పారు...

సుఖాన్ని వెన్నంటే దుఃఖము ఉంటుంది.అయితే బాధను మరిపించే మంచిమాట మానవతకు గీటురాయి కావాలి.అప్పుడే దుఃఖరహిత సమాజానికి నాంది పలకగలం.

Kottapali చెప్పారు...

Nice words

హితైషి చెప్పారు...

Simply Super.

నాగరాజ్ చెప్పారు...

మంచి తాత్విక చింతన కల్గిన పోస్టు రాశారు. ఇది చదివాక నేను ఫీలైన కొన్ని విషయాలు: కష్టం-సుఖం; సంతోషం-దు:ఖం; లాభం-నష్టం; మంచీచెడూ; హేతువు-ఫలితం; జననం-మరణం; ప్రకృతి-మనిషి, పదార్థం-శక్తి; పాజిటివ్-నెగెటివ్... ఇలా ప్రకృతిలో ప్రతీచోటా ద్వంద్వమే కనిపిస్తుంది. ఇలా ప్రతీ దృగ్విషయంలో ద్వంద్వాలుంటాయనే అవగాహన మానవ జీవితాన్ని, సమాజాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మనిషికి చాలావరకు సహకరిస్తుంది. సంతోషంతో పాటే దు:ఖం కూడా ఉంటుందనే అవగాహన మనిషికి ఎంతోకొంత నిశ్చింతను అందజేసేదే. అయితే దు:ఖానికి కారణం కోరికలనే భావనపై నాక్కూడా కొంత అభ్యంతరముంది. ఎందుకంటే కోరికలు లేకుండా మనిషి మనుగడ అసాధ్యం. అయితే ఆ కోరికల స్వభావం ఎలాంటిది అన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమేమో. ఉదాహరణకు వ్యక్తిగత, స్వార్థపూరిత, వాస్తవదూర కోరికలు ఫలించనప్పుడు దు:ఖం కలగడం సహజమే. అయితే, ఆ దు:ఖపు స్థాయి.. చాలా లో లెవెల్. ఆ దు:ఖ హేతువు వ్యక్తిగతమైంది కాబట్టి దానికి మిగతావాళ్లు పెద్దగా ప్రతిస్పందించకపోవచ్చు. అలాగే, ఆ దు:ఖం వెనక స్వార్థం, అవాస్తవం ఉంటే అది మనిషిని మరింత నిశ్చేష్టుణ్ని చేయొచ్చు. కుంగదీయొచ్చు కూడా. ఇంకా అనేక నెగెటివ్ భావోద్వేగాలను కూడా రగిలించవచ్చు. ఇక రెండోరకం దు:ఖం కూడా కనిపిస్తుంది. సామాజికమైన, స్వార్థరహితమైన కోరికల వల్ల కూడా దు:ఖం కలుగవచ్చు. అయితే ఆ దు:ఖానికి చాలా హయ్యర్ ప్లేన్. ఉదాహరణకు ఒక కవిగానీ, ఒక రచయిత గానీ, సామాజిక కార్యకర్త గానీ, సంఘ సంస్కర్తగానీ.. సమాజంలోని చెడును తొలగించాలన్న కోరికతో పనిచేసినప్పుడు కూడా రకరకాల ప్రతికూలతల వల్ల దు:ఖం దరిచేరవచ్చు. అయితే ఆ దు:ఖానికి మొత్తం సమాజమే ప్రతిస్పందిస్తుంది. ఆ దు:ఖం ఆ వ్యక్తిని మరింత ఉన్నతుణ్ని, గొప్పవాణ్ని చేస్తుంది. అన్నట్టు, దు:ఖం నుండి కూడా కోరికలు జనిస్తాయేమో. బ్రిటిష్ దాస్య శృంఖలాల్లో నలిగిపోతున్న భారతీయుల ఆర్తనాదాలు, హాహాకారాలు చూసి భగత్ సింగ్, ఆజాద్, నేతాజీలలో; స్త్రీల కష్టాలు కడగండ్లు చూసి రాజా రామ్మోహన్ రాయ్, విద్యసాగర్, శరత్ చంద్ర, గురజాడ, కందుకూరి లాంటి మహానుభావుల్లో ఆ దు:ఖానికి హేతువును తొలగించాలనే కోరిక కలగడం, దానికోసం అహరహరం శ్రమించడం వల్లే వారు మహనీయులయ్యారన్నది కూడా మనం చూశాం. ఈ రకంగా చూస్తే కోరికలుండడం ఎంత సహజమో, దు:ఖం దరిచేరడం కూడా అంతే సహజం. అయితే మనం ఏ భావనతో వాటిని తీసుకుంటాం, వాటికి ప్రతిస్పందిస్తాం అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. థాంక్యూ!