నీటిపై ప్రయాణం
ప్రయాణీంచిన దూరాన్ని తలచుకుంటే భయమేస్తుంది
ఎవరో నెట్టేసినట్లు వెనుతిరిగి చూడకుండా
నాకేం కావాలో, ఇతరులకేం ఇవ్వాలో తెలియకుండానే
కరిగిన కాలాన్ని చూస్తే దిగులు ముంచుకొస్తుంది
తప్పిదాలు పలక మీద వ్రాసిన అక్షరాలయితే
ఎంత బావుండును
చేసిన వాగ్దానాలు శిలాక్షరాలుగా నిలిచి
హెచ్చరించినా బావుండును
దారిపొడవునా నిలిచిన మైలురాళ్ళు
తరిగే దూరాన్ని గుర్తు చేసినా బావుండును
నడచినదారంతా మటు మాయమై
తొలి అడుగులో నిలిపితే మరీ బావుండును
ఆశా నిహతి నింపుకున్న
నీ గుండెని అడిగి చూడు...
నీ నిట్టూర్పు నడిగి చూడు
చేయాల్సిన ప్రయాణం సంగతేమిటో...
నిశ్శబ్దం ఒక యుద్ధమయితే
అందులోకి జారిపోవడం నిత్యనూతనమయితే
అస్ఫష్టంగానయినా గోచరించని సత్యమేదో
ఇంకా మిగిలి ఉంటుందంటే
నీ ప్రయాణం ఇంకా మొదలెట్టలేదన్నమాటే !
నీటిపై నడిచొచ్చిన గురుతులేవి లేనట్లన్నమాటే
నీకింకో జీవిత ప్రయాణాన్ని ముందుంచినట్లే!
ప్రయాణీంచిన దూరాన్ని తలచుకుంటే భయమేస్తుంది
ఎవరో నెట్టేసినట్లు వెనుతిరిగి చూడకుండా
నాకేం కావాలో, ఇతరులకేం ఇవ్వాలో తెలియకుండానే
కరిగిన కాలాన్ని చూస్తే దిగులు ముంచుకొస్తుంది
తప్పిదాలు పలక మీద వ్రాసిన అక్షరాలయితే
ఎంత బావుండును
చేసిన వాగ్దానాలు శిలాక్షరాలుగా నిలిచి
హెచ్చరించినా బావుండును
దారిపొడవునా నిలిచిన మైలురాళ్ళు
తరిగే దూరాన్ని గుర్తు చేసినా బావుండును
నడచినదారంతా మటు మాయమై
తొలి అడుగులో నిలిపితే మరీ బావుండును
ఆశా నిహతి నింపుకున్న
నీ గుండెని అడిగి చూడు...
నీ నిట్టూర్పు నడిగి చూడు
చేయాల్సిన ప్రయాణం సంగతేమిటో...
నిశ్శబ్దం ఒక యుద్ధమయితే
అందులోకి జారిపోవడం నిత్యనూతనమయితే
అస్ఫష్టంగానయినా గోచరించని సత్యమేదో
ఇంకా మిగిలి ఉంటుందంటే
నీ ప్రయాణం ఇంకా మొదలెట్టలేదన్నమాటే !
నీటిపై నడిచొచ్చిన గురుతులేవి లేనట్లన్నమాటే
నీకింకో జీవిత ప్రయాణాన్ని ముందుంచినట్లే!
5 కామెంట్లు:
నడచినదారంతా మటు మాయమై
తొలి అడుగులో నిలిపితే మరీ బావుండును....
నిజంగా అలా జరిగితే...ఎంత అద్భుతం....
excellent.
ప్రయాణించిన దూరం
కరిగిన కాలం
తప్పిదాలు
చేసిన వాగ్దానాలు
జీవితం దారిలో నిలిచిన మైలురాళు అయితే
నడిచిన దారంతా మటుమాయమై తొలి అడుగులో నిలబెడితే ఎంత బాగుంటుందో ....
కవిత చదువుతున్నంత సేపూ మీ అక్షరాల్లో శబ్దం, శ్రద్ద, లయబద్దత కు ప్రాముఖ్యత కనిపిస్తుంది. నీటిపై ప్రయాణం కవిత చాలా బాగుంది. అన్నీ తెలిసి ప్రయాణించడం లో యాంత్రికత ఉంటుందేమో అనిపించకపోతే ఇంకా ఎంత బాగుణ్ణో అనిపించింది వనజ గారు. అభినందనలు.
అనూ గారు కవిత నచ్చిఅనదుకు ధన్యవాదములు
@ Chandra Vemula గారు .. మీ వ్యాఖ్యకి, ప్రశంసకి హృదయపూర్వక ధన్యవాదములు
nice andee
శ్రీ వనమాలిగారికి, నమస్కారములు.
చాలా చక్కటి కవితలు. 'ప్రయాణం'లో సమయమే తెలియకుండా వుండేలాగా కవితలను నడిపించారు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి