రమణీ ..ఎలా ఉన్నారు ?
నేను మీకీ ఉత్తరం వ్రాయడం ఎలాటిదంటే సముద్రం దగ్గరకి బుడ్డి చెంబు తీసుకెళ్ళి దానిని నింపి నీకు చూపిస్తూ ఇదే సముద్రం అని చెప్పినట్టు అన్నమాట. :)
ఈ మధ్య బ్లాగ్ లలోకి వచ్చినప్పుడు నాకు తెలిసిన పాత వాళ్ళనందరినీ ఆత్రంగా వెతుక్కుంటాను. కొంతమందిని చదివి వస్తాను. మనసుకు బాగా నచ్చిన విషయమైనా సరే వ్యాఖ్యనివ్వడానికి ఒకింత బద్ధకం అని తప్పించుకోజూస్తాను కానీ ఆ బద్ధకం వెనుక అంతులేని నిరుత్సాహం. ఏమైనా వ్రాయాలని మనఃస్పూర్తిగా అనిపించినప్పుడు వ్రాసుకోవడం, లేదా ఏ కథో ,కవితో ఇక్కడ భద్రపరుచుకుని బ్లాగులలో కూడా కొంతమందికి పరిచయం చేసినట్లు ఉంటుందని రావడం తప్ప పెద్ద ఆసక్తి లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవి బ్లాగులు? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,సద్విమర్శలు చేసుకుంటూ సరదాగా ఉంటూనే సీరియస్ విషయాలు ముచ్చటించుకునే వాళ్ళు కదా ! ఇప్పుడంతా సాధారణంగానూ లేక కావాలని కువిమర్శ చేసుకుంటునట్లూనూ,కాలక్షేపం కోసం పోట్లాడుకుంటూన్నట్లుగానూ ఉంటున్నాయ "ట". నేనైతే అసలు వివాదాల జోలికి పోను కాబట్టి విహంగవీక్షణం చేసేసి వచ్చేస్తున్నాను.
ఎందుకు బ్లాగ్ మిత్రులందరూ ఫేస్ బుక్ కి అతుక్కుపోతున్నారా అని ఆశ్చర్యం కల్గుతుంది. ఒకే విషయం కాకుండా అనేకానేక విషయాలని రోజుకి ఒక పది పోస్ట్ లని స్నేహితులకి పంచే వారిని చూస్తూ ఉంటాను. నాకున్న స్నేహితుల జాబితాలో అధికంగా పోస్ట్ లు వేస్తున్నవారిలో మీరూ ఉంటున్నారు రమణీ ! అయితే మీ మాటల్లో ఎక్కువగా చిరాకూ, ఆశాభంగం, బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు. మన బాధలు, మన కోపతాపాలు, చిరాకులూ, నిసృహలూ అన్నీ వ్యక్తిగతం కాదు. అందులో కొన్ని మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషుల నుండి, సమాజం నుండి వస్తున్నవి. కాలక్షేపపు కబుర్లకి, దూలానందం పొందేవారికి, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మనసులోమాట కక్కేదానికి అక్కడ వెసులుబాటు ఉంది కాబట్టి తాత్కాలిక వినోదపు వేదిక అయిందని మనందరం గుర్తించాం కానీ అందులోనుండి బయటకి రాలేకపోతున్నాం . ఘనసమయాలు వ్యర్ధంగా గడచిపోతున్నాయి. మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోయింది . మనసు విప్పి మాటాడటానికి ఓ మనిషి దొరకక విలవిలలాడిపోతున్నాం.
ముఖ్యంగా ఈ సోషియల్ మీడియా తక్షణ అభిప్రాయాలు పంచుకునే వీలుంటుందని అనుకుంటున్నామో అంతే త్వరగా మనుషులని విడదీస్తుంది . నా చుట్టుపక్కల నాకెవరితోనూ శత్రుత్వం లేదు . కానీ ఈ ఆన్ లైన్ స్నేహాలలో చాలామందితో నాకు శత్రుత్వం ఏర్పడింది. ఇక్కడ మనుషులు కులం, మతం ప్రాతిపదికపై రాజకీయ పార్టీలని మోసే క్రమంలో, సినీ కథానాయకులని, నాయకురాళ్ళని మోసే క్రమంలో విడిపోతున్నారు. అదెంత విషాదమో ! మనుషుల మధ్య మొలుస్తున్న బలమైన కుడ్యాల పట్ల నిరసన తెలుపుతూనే అదే కుడ్యాల మధ్య మనని మనం బందీలుగా మార్చుకుంటున్నాము, మారిపోతున్నాం . అది చాలా విచారకరంగా ఉంది. ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు నేనస్సలు పాటించలేను, మనసులో ఉన్నట్టే ప్రవర్తిస్తాను . మనని నిత్యం తిడుతున్నా భరించి, ముఖం మీద నవ్వు పులుముకుని నటించి బ్రతకలేను . నేను నాలాగా ఉండదల్చుకున్నాను. బయటున్న శత్రువు కన్నా మనతోనే మిత్రుడిగా ఉండి మనకి శత్రువై వ్యవహరించేవాడి పట్ల ఉదారంగా ఉండకపోవడం మంచిది . చాలా మందిని un friend ని చేసినందుకు నాలో ఆత్మనూన్యత ఏ మాత్రం లేదు. రమణీ ! స్నేహం పేరిట మానసిక ప్రశాంతత కోల్పోలేము కదా ! నువ్వు కూడా నీకు బాధకల్గిస్తున్న వారినుండి దూరంగా జరిగిపో. అదే మంచిది కూడా !
ఒకొకరికి వారికి ఉన్న ఆలోచనాధోరణి, వారి వారి అనుభవాల మూలంగా కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పడిపోతాయి. వాదనలవల్ల వారి వారి అభిప్రాయాన్ని మనమెన్నటికీ మార్చలేం. అందుచేత మనం వారికి దూరంగా ఉండటమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. బ్లాగ్ లలోనే కాదు ఫేస్ బుక్ స్నేహితులలో కూడా ఇలాగే ఉన్నారు. భిన్నాభిప్రాయాలు కల్గిన వ్యక్తుల మధ్య స్నేహం నిలిచి ఉండాలంటే వారి వారి మధ్య చాలా అవగాహన ఉండాలి కదా ! మనం చెప్పిన అభిప్రాయాన్ని వారు వ్యతిరేకించారని వారిని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదని అదివరకంతా వాదించే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుని కొందరిని దూరంగా పెట్టేస్తే, కొందరు నన్ను దూరంగా పెట్టారు . నిజంగా ఈ పరిస్థితి చాలా బాధాకరమైనది కూడా ! అప్పుడే ఇలా వ్రాసుకున్నాను. "నీలోకి నువ్వు తొంగి చూసుకో, నీకు నువ్వు అర్ధమైతే... లోకం అర్ధమవుతుంది. నువ్వూ ఓ నమూనా బొమ్మవేకదా!" అని. ఇలాంటి ఆనవాళ్ళు ఎవరికైనా దొరుకుతాయేమో కదా !
అంతకు క్రితంలా నేను బుల్లి తెర ముందు, అంతర్జాలం నందు సమయాన్ని వెచ్చించడం లేదు. ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాలు చదవడమంటే ఒక సంగతి గుర్తుకువచ్చింది. ఈ మధ్య నేనొక కథ చదివాను. ఆ కథా రచయిత శైలి చాలా బావుంటుంది. కానీ ఆ కథలో భాగమైన నలుగురి ఆడవాళ్ళ పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల (ఆమెకి ఒక కొడుకు కూడా ఉంటె బాగుండేది అని ఆడపిల్ల పట్ల చులకన భావాన్ని వ్యక్తపరిచి ) ఆ రచయితకి గౌరవభావమే గోచరించలేదు. ఒకే ఒక పాత్రపై కొద్దిగా జాలి సానుభూతితో పాటు తాను దర్శించిన (రచయిత సృష్టించిన పాత్ర ) ఒక సౌందర్య కోణాన్ని గొప్పగా చెప్పాననుకున్నాడు. చాలా బాధేసింది. రచయిత దృక్పధం ఏమిటో మనకి స్పష్టంగా అర్ధమవుతుంటే ... వాళ్ళని మంచి రచయిత అని ఎలా ఒప్పుకోగలం? ఇలాగేనా కథలు వ్రాసేది? రచయితకి కొంచెమైనా బాధ్యత ఉండొద్దూ అని చాలామంది అనుకున్నాం కూడా !
ఇలాగే ఒక సినిమా నిర్మాత దర్శకుడు కూడా "ఆ ఇద్దరంటే నాకు గౌరవంతో కూడిన భయం . జీవితంలో ఆ ఇద్దరాడవాళ్ళకే గౌరవాన్ని ఇస్తా ! వారికే భయపడతా. వారు నా తల్లి , నా భార్య . అంటున్నారు. అవును మరి ప్రపంచంలో మిగతా ఆడవాళ్ళందరూ అతని సినిమాల్లో ఆరబోసి చూపించే బాపతనే ఉద్దేశ్యాన్ని అంత నిసిగ్గుగా చెపుతున్నారో చూడండి . ఇంకో దర్శక నిర్మాత హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకు ఎక్కువ ఖర్చుపెడతానని చెపుతుంటే ... వీళ్ళ సినిమాలని తిరస్కరించాలనే జ్ఞానం మన ఆడవాళ్ళకి లేకపోవడం ఎంత విచారకరం. ముందు స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి బాబూ .తర్వాతనే మీ కథలు, సినిమాలు అని చెప్పాలి కూడా. ఇలా చెప్పకపోబట్టే ఏం జరుగుతుందో తెలుసా ?
ఈ విషయం నీకు చెప్పే తీరాలి. తలుచుకుంటేనే అప్రయత్నంగానే పెదవులపై నవ్వులు పూస్తున్నాయి. నేనసలు ఎప్పుడో కానీ ప్రొఫైల్ పిక్ పెట్టనని నీకు తెలుసు కదా ! ఈ మధ్యనే ఒకటి రెండు రోజులు పెట్టాను. నా ఇన్ బాక్స్ లో అపరిచిత వ్యక్తీ నుండి మొదటి పలకరింపు యు ఆర్ సో నైస్ మేడమ్ అని. నేను గమనించలేదు. తర్వాత కొన్ని గంటలకి మరి కొన్ని సందేశాలు. హాయ్ మేడమ్, హాట్ సెక్స్ విత్ మీ అని . అన్ని మెసేజ్ లు ఒకేసారి చూసాను . అది చూసి రగిలిపోయాను. సరిగా మీసం మొలవని మగపిల్లాడు (మన దృష్టిలో ) వాడి తల్లి వయసున్న నాతో నెరిపే సంభాషణ ఇది. నేను షాక్ తిన్నాను. నిజంగా ఇలా మెసేజ్ రావడం కూడా ఇదే మొదటిసారి. వెంటనే వాడికి ఒక చెప్పు బొమ్మ పంపాను. వెళ్లి మీ అమ్మని ఇలా అని అడగరా అని చెప్పాను. ఇలాంటి అశ్లీల విషయాన్ని అపరిచిత స్త్రీ మెసేజ్ బాక్స్ లోకి పెట్టినందుకు సైబర్ కేస్ అవుతుంది జాగ్రత్త అని కూడా హెచ్చరించాను. వాడిని బ్లాక్ చేసాను. భద్రంగా ఇంట్లో కూర్చున్నా కూడా జొచ్చుకుని వచ్చే అలుసుతనమంతా దృశ్య మాధ్యమం పుణ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞ్ఞానం పిచ్చివాడి చేతిలో రాయిలా మారిపోతుంది. దిగులేస్తుంది. ఇలాంటి వాళ్ళే కదా ఆడవాళ్ళు ఒంటరిగా కనబడితే తెగబడేది అని అనిపించింది .
నేను ఈ విషయాన్ని ఇలా బ్లాగ్ ముఖంగా చెప్పానా !? కొంతమందయినా ఇలా అనుకుంటారని నాకు తెలుసు. ఈ వనజ గారికి ఎంత దైర్యం ? వాడెవడో అలా మాట్లాడితే మాత్రం ఈమె ఇలా బహిరంగంగా చెప్పాలా అంటారు. ఎస్, చెప్పాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో గమనించుకుంటారు. పిల్లల్లో ఉన్నమానసికరోగాలు,వాళ్ళ ప్రవర్తనా లోపాలు గమనిస్తే కదా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చుకుని ఇంటా, బయటా ఎలా మెలగాలో సంస్కారంగా ఉండటం, ఆలోచించడం నేర్పిస్తారు. లేదా సంస్కారంగా ఉండాలని అవగాహన కల్పిస్తారు కదా !
అన్నట్టు ఒక బ్లాగ్ మిత్రుడు ఇలా అన్నారు. ఇదిగో ఆ మిత్రుడి సూచన "బ్లాగులు ఎంత కాదన్న ఔట్ డేటెడ్ . ఇప్పుడు కావాలిసింది ఒక కలెక్టవ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫామ్. Medium.com లాంటిది" అని చెప్పారు. అక్కడికి వెళ్లి చూసాను . అక్కడంతా ఆంగ్లమాధ్యమం. నాలాంటి ఇంగ్లీష్ రాని వారికి అదంతా అయోమయమే. :)
మనిషి మనసుని సుతిమెత్తగా మీటగలిగే అనేకానేక పదబంధాలు కల మన మాతృభాషలో మనం వ్రాసుకున్నత హాయిగా వేరొక బాషలో వ్రాయలేమేమో కదా ! గండికోట వారిజ "సీత కో ఉత్తరం "అంటూ ఎంత లాలిత్యంగా, హృద్యంగా వ్రాసిందో కదా ! నువ్వు ఆ ఉత్తరాన్ని చదివావా ? అన్నట్టు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో ఏ విషయమైనా బాగా వ్రాయగలరు అనిపించే ఇద్దరు మిత్రురాళ్ళని నేను కని పెట్టేసాను. వారిద్దరూ కూడా బ్లాగ్ వ్రాస్తే బావుంటుందని అనుకుంటున్నాను . వారు సరళ మోహన్ (Sarala Mohan) అంజనీ యలమంచిలి. వారిద్దరూ కూడా బ్లాగ్ లోకంలోకి రావాలి. నిన్న ఇద్దరు మిత్రురాళ్ళు బ్లాగ్ రూపొందించి ఇవ్వమని అడిగారు . సంతోషంగా చేసి ఇచ్చాను.
ఇంకో విషయం మరిచాను .. మధురవాణి వెబ్ పత్రికలో పొత్తూరి విజయలక్ష్మి గారి "కొత్తకోణం " కథ చదివాను . గొప్ప సెటైర్ అనిపించింది . పురాణ ఇతిహాసాల లోని పాత్రలని తీసుకుని ఆ పాత్రలకి కొత్తకోణం ఆపాదించి మనకి నచ్చినట్లు వ్రాసుకోవడం అని కథని హాస్యోక్తిగా, వ్యంగంగా చెప్పారు. నాకు వెంటనే ముగ్గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీతలు గ్రహింపుకి వచ్చారు. ఓల్గా గారి "విముక్త" కి కాకుండా "రాజకీయ కథలు" కి అవార్డ్ వస్తే బావుండేదని నేను అనుకున్నాను. రాజకీయ కథలు స్త్రీలు తమ అస్తిత్వాన్ని తాము తెలుసుకునే క్రమంలో వచ్చిన కథలు. మీరు ఇంతకు ముందు చదవకుంటే వెంటనే చదవడానికి ప్రయత్నం చేయండి.
ఇక ఉండనా మరి. మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో సారి మాటాడుకుందాం. వీలువెంబడి మీరూ ఓ లేఖ వ్రాస్తారు కదూ ! పలకరింపే ఓ పులకరింత.. అని మీకు తెలుసు కదా !
ప్రేమతో ... వనజ .

11 కామెంట్‌లు:
akka nuvvu neelaage undu . naaku nuvvu anduke ishtam . no musugulu . nice letter . naaku kooda yemaina vrayava
నేస్తమా నీ లేఖ అసాంతం చదివాను ప్రేమగా...నేను కూడా చాలా చెప్పాలి బ్లాగు వదిలేసిన తరువాత నా అనుభవాలు అనుభూతులు , చిరాకులు , చింతలు ఒకటా రెండా ఒకరోజు సరిపోతుందా మరి అన్ని భావనలు వ్యక్తం చేయడానికి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను కాస్త సమయం ఇవ్వవూ నీకు జాబు ఇవ్వడానికి.
వనజగారు, నమస్తే. బాగున్నారా? ఇప్పుడే ఆత్మీయ భాషణం చదివాను. మీరు మాత్రమే ఇలా ఆద్యంతమూ ఆసక్తిగా చదివించేటట్లు రాయగలరు. 'నీలోకి నీవు తొంగి చూసుకో, నీకు నీవు అర్ధమైతే ... లోకమర్ధమౌతుంది. నువ్వూ ఓ నమూనా బొమ్మవే కదా'... వావ్, ఎంత అర్ధవంతమైన అద్భుతమైన మాటలు ...అభివందనములు వనజగారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలతో ...
ఆహా !వనజా వనమా
లీ!హాచ్ యని తుమ్మి విప్పె ఈ చిక్కు ముడిన్
మీ హర్మ్యంబగు బ్లాగుకు
ఆహార్యమిదే జిలేబి ఆనంద పడెన్
జిలేబి
లేఖామాధ్యమాన ఎన్నో మంచి విషయాల గురించి చర్చించారు. బ్లాగ్లకి మళ్లీ మంచి రోజులు తేవాలనే మీ ప్రయత్నం అభినందనీయం.
మధురోహల పల్లకి గారూ ! ధన్యవాదాలు .
జిలేబీ గారూ ... ఆనందమానందమాయే ! ధన్యవాదములు.
భారతి గారూ ! హృదయపూర్వక ధన్యవాదాలు.
రమణి రాచపూడి ... థాంక్ యూ సో మచ్! మీరు నాకన్నా సీనియర్ బ్లాగర్. నా అనుభవాలకన్నా మీ అనుభవాలు చాలా ఎక్కువ. అవన్నీ బహిర్గతం చేస్తూ మళ్ళీ బ్లాగుల వైపు తొంగి చూడగలరని నా ఆకాంక్ష.
శశీ ... ధన్యవాదములు. ఎల్లప్పుడూ నీ ప్రోత్సాహం గుర్తుంచుకుంటాను. అందుకు ధన్యవాదాలు.
చక్కటి లేఖ రాసారు వనజ గారూ .. రమణి అదృష్టవంతురాలు ఇంత చక్కటి లేఖ అందుకున్నందుకు ..ఇప్పుడు రమణి జవాబు కోసం ఎదురుచూస్తున్నాను ..😊
కామెంట్‌ను పోస్ట్ చేయండి