22, జూన్ 2024, శనివారం

శిశిరం చిగురిస్తుందా!?

 కొద్ది గంటల్లో పది రోజులు పూరై పోతున్నాయి."నీ లాంటి రాతి మనిషి ని నేనెక్కడా చూడలేదురాతి గుడిలో దేవతలా నువ్వు   ఆరాధనీయమే కాని అనుభవంలోకి రాని దానివినిరాశని అణుచుకుంటూ నిష్టూరంగా అన్నాడు.

 అతని చేతిని తన చేతిలోకి తీసుకుని  ఈ ప్రయాణం ఒక అనుభవం కాదూప్రేమ మానసికం అని నేను గాఢ౦గా  నమ్ముతాను ఎన్నోసార్లు మానసికంగా  చచ్చిన మనిషిని నేనుభర్త నీడన లేకపోవడంవల్ల మాట్లాడిన ప్రతి మనిషితోటి అక్రమ సంబంధాన్ని అంటకట్టి తృప్తి పడిన లోకానికి నా మనఃసాక్షి ధిక్కార స్వరంతో చెప్పిన  సమాధానం ఇది.  మనసు పారేసుకున్న  మనిషినాకెంతో ఇష్టమైన మనిషిని  యేళ్ళ తరబడి ప్రక్కన పెట్టుకుని కూడా ఉంచుకోలేని మనిషినన్న ఆత్మ తృప్తి   నాకు మిగలిందిఇది చాలు"అంది.
"నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే తెచ్చిపెట్టుకున్న జాగ్రత్తతో  తెలివిగా మాట్లాడతావుఈ ప్రపంచంతో సంభాషించేటప్పుడు  హృదయంతో మాట్లాడతావు.ప్రకృతిలో సంచరించేటప్పుడు పసిపిల్లవిగా మారిపోతావ్నీలో ఇన్ని కోణాలని ఇంత దగ్గరగా చూసిన తర్వాత నాలో కలిగే శారీరక స్పందనలు మాయమైపోయాయినాలో ఎలాంటి మనోవికారాలు లేవు.  నిజం చెప్పాలంటే హృదయమంతా ప్రేమ పొంగి పొర్లుతుంది
అతను చెపుతూ చెపుతూ  స్వరం జీరపోయినట్లు కొద్దిసేపు ఆగి, తర్వాత "ఆ అనుభూతిని చెప్పడానికి నా దగ్గర మాటల్లేవ్.  దుర్భలత్వంతో  చటుక్కున పురుషుడిపై ఆధారపడిపోయే  యె౦దఱో స్త్రీలని  చూసానువాళ్ళతో నేనిన్ను పోల్చలేను.  స్త్రీలు నిజమైన  చైతన్యవంతులు దృడ మనస్కులు   అయితే నీలా ఉంటారునీ పై గౌరవం ఇంకా పెరిగింది,  నిన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయను. " తల వొంచి గౌరవంగా ఆమెకి నమస్కరించాడు.  



17, జూన్ 2024, సోమవారం

వివాహానంతర ఆకర్షణలు

 "ఈ అక్రమ సంబంధాల అవసరమో ,  అన్ కండీషనల్ లవ్  అవసరమో  నాకు లేదు. మీకు అంతగా ఇష్టం అయింది   కాబట్టి పెళ్లి చేసుకుని రెండో భార్యగానో లేదా స్టెప్నీ  మాదిరి గానో ఉంచుకుంటానంటారు  ! అంతేగా ? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికి మారవు . ప్రేమో , వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు . మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెపుతారు మీకు కావాల్సింది దొరికాక మీ మోజు తీరిపోయాక శీతకన్ను వేస్తారు.  ముందు రోజూ ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు . తర్వాత తర్వాత పనుల వత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు, మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా  మరచిపోతారు . అందులో ఆయాచితంగా లభించే వొంక ని ఉపయోగిస్తారు, ఇంట్లో తెలిసి పోయింది, గొడవ ఎక్కువైపోయింది అంటూ తెర దించేస్తారు.  అంతకి మించి క్రొత్తగా ఏమైనా  ఉంటే చెప్పండి!  విని నా నిర్ణయం చెపుతాను"  అని నిలబెట్టి దులిపేసింది . కుముద అలా మాట్లాదగలదని ఊహించని సురేష్  అవాక్కైపోయాడు  ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది





16, జూన్ 2024, ఆదివారం

కోడలు మరో రూపంలో వుంటారని..

అత్త లేని కోడలు ఉత్తమరాలు  కోడలు లేని అత్త ధనవంతురాలు అంటారు కదా.. మరి కోడలు లేకుండా కూతురే వుండి వుంటే… 

 కూతురైతేనేం!? ధనం మూలం మిదం జగత్ .. అన్నది కంటెదురుగా కనబడుతుంటే.. ఆ వృద్దురాలు ఏం చేసింది.. వినండీ ఆడియో బుక్ లో.. 





14, జూన్ 2024, శుక్రవారం

ప్రేమ రంగు వెలిస్తే ..

 అతని పక్కనే నడుస్తూ.. అశువుగా కవిత్వం వినిపించాను. 

“వెలుగు నీడల త్రోవ ప్రక్కన నిలబడి రేయింబవళ్ళ క్రీడని చూస్తున్నాడు చంద్రుడు 

మంచు దుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు చంద్రుడు 

తాంబూలంతో పండిన పెదవులతో  ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు చంద్రుడు 

మూసిన తలుపులని తడుతూ ఇల్లిల్లూ తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు చంద్రుడు

పడతి ప్రేమలో  తడిసి విరహ వేదన చెంది ఆ చెలిని కూడ మబ్బు చాటుకేగెను చంద్రుడు”...

పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ.. నువ్వు నా చంద్రుడివి అన్నాను.

కొంటెగా కనుగీటుతూ.. భుజంపై చెయ్యేసాడు.నా సగము మేని తానైనట్టు పరవశం. 




11, జూన్ 2024, మంగళవారం

Code of conduct అంటే !?

Code of conduct అంటే ఏమిటి. అని అడిగాడు తండ్రి. అతని స్నేహితుడు ఆలోచిస్తున్నాడు.. 
ఈ కథలో మీకు సమాధానం దొరుకుతుందేమో వినండీ.. “త్వరపడి” కథ ఆడియో బుక్ లో.. 



‘’త్వరపడి ‘’ కథ ఆడియో లో వినండీ… 


 

3, జూన్ 2024, సోమవారం

I am an Author ..

 నేనొక రచయిత ని.. అవునంటారా కాదంటారా!? 

భోజరాజుకు కథలు చెప్పిన 32 సాలభంజికలు

వొక్కొక్కరే ముందుకు రావాలిప్పుడు. 🤗🫢

**********

ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరై శ్రద్దగా సభను వింటున్నాను. నన్ను పలకరించి తనను పరిచయం చేసుకున్నాడు ఆ యువ రచయిత. ఓ రెండు పుస్తకాలు నా చేతిలో వుంచి.. 

‘కథలు రాయడం చాలా సులభం, తెలుసా అండీ “ అన్నాడు.

అవునా! అన్నట్టు చూసాను. లోలోపల నాకెందుకు.. వొక్కో కధ రాయటానికి సంవత్సరాలు తరబడి పడుతుంది.. నాలో ఆలోచనాశక్తి సన్నగిల్లిందేమో! విభిన్నమైన అంశాలతో కథలు రాయాలని అవి అందరూ మెచ్చుకోవాలని అత్యాశ కాబోలు అనుకుని .. 

“ఎన్ని కథలు రాసారు ఇప్పటికి” అన్నాను .. నా వయసులో సగం వయస్సే వున్న అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ.. 

“150 పైగానే రాసాను. ఇంకా కవిత్వం వ్యాసాలు సమీక్షలు కూడా ! “ అన్నాడు.

“ఎన్నేళ్ళ రచనా ప్రస్థానం”.. నా ప్రశ్న 

“కేవలం ఐదేళ్ళేనండీ.. మహాప్రస్థానం చదివే తీరిక దొరకలేదు నాకు. కానీ నా జీవితకాలంలో ఆరుద్ర సమగ్ర సాహిత్యం అంత రాయాలని నా కోరిక అండీ.” అన్నాడు. 

‘మంచిది. చేతి కీళ్ళు అరిగిపోగలవు జాగ్రత్త ‘’ అన్నాను. 

అతను పక్కకెళ్ళాక  ఇంకో రచయిత మిత్రుడొచ్చి.. “ఏమిటీ ఆ యువ రచయిత తో అన్ని కబుర్లు” అన్నాడు. 

 అతను చెప్పినవన్నీ చెప్పాను. 

గట్టిగా నవ్వి ఆ రచయిత కి మెదడు తో పని ఎందుకు? రెండు చిన్న పనులు తెలుసంతే! Copy > paste సోషల్ మీడియా వేదిక, కథల యాప్ .అతని రచనల్లో నీ కథలు కూడా వున్నాయి .. చూసుకో! అని హెచ్చరించాడు. 

 ఓహో అదా సంగతి అని నవ్వుకున్నాను… 

నేను రాసినదాన్ని ఎలా భద్రపరచుకోవాలి.. అచ్చమైన రచయిత మెదడుకి పని చెప్పానన్నమాటే కానీ.. ఈ గ్రంధచౌర్యం భావ చౌర్యం  చేసిన ప్రసిధ్ధ రచయితలు  గుర్తొచ్చి మరింత నవ్వుకున్నాను. 

ఆంగ్ల రచనలు చదివి తమ భాషలో కథలు రాసి ఎందరో ప్రసిద్దులైనారు. ఒకామె ఒక ప్రసిద్ద బెంగాలీ నవల గురించి ఆంగ్లంలో  వ్యాసం చదివి తన భాషలోకి అనువదించి వ్యాసం రాసింది. అలాంటికోవలో వాడే ఈ రచయిత అనుకున్నాను. 

ఇతనూ… ఎప్పుడో వొకప్పుడు ఏ ఫేస్ బుక్ గోడ పైనో  తన కథ చూసి .. నా రచన ఇది అని గగ్గోలు పెట్టటం ఖాయం.

ఈ మధ్య వొక రచయిత అన్నారు .. storyline చెబితే ChatGPT 10 pages కథ ఇచ్చింది అంట. దాన్ని 100 పేజీల నవల రాస్తాడు అంట. లక్షల రూపాయల బహుమతి, అకాడమీ అవార్డ్ లు రావచ్చు నేమో! 😊

ప్రపంచమా! వర్దిల్లుమా… ఆలోచనాశక్తి నశించి.. ChatGPT Al తోనూ copy>paste తోనూ.. 😢😢

……….. 

PS: నా ఆలోచనాశక్తి తో రాసాను. 😊🎈