చిన్ని..! నాన్న.. బంగారం..!! వెల్ కమ్.. మదర్ ఇండియా ...
నిఖిల్ చంద్ర తాతినేని |
పదకొండు నెలల క్రితం .. హైదరాబాద్..ఎయిర్ పోర్ట్ లో.. ట్రాలీ లో..నీ లగేజే సర్ది.. ఇన్.. గేటు దాటి.. చెక్ ఇన్ దాటి లొపలకి..పంపించాక..నాగుండె అంతా నీరైంది.ఉబికివస్తున్న దుఖం ని..కనురెప్పల మద్యే దాచేసి..పూడుకుపోయిన గొంతుతో.. మాట రాక.. వచ్చినా నీకు వినబడక.. నువ్వు వెనక్కి వెనక్కి..తిరిగి చూసుకుంటూ వెళుతుంటే.. ఒక్కసారిగా.. నిన్ను వెళ్ళనీయకుండా.. వెనక్కి ..తీసుకురావలనిపించింది.
నాకు నీ పై ఉన్న ప్రేమ ,మమకారం నీ ఉన్నతికి..నీ పై చదువులకి..అడ్డు కాకూదదనుకుని .. గట్టిగా శ్వాస తీసుకుని..తమాయించుకున్నాను.
నీ ముందు ఉన్న వాళ్ళ లగేజ్..చెక్ చేసేలోపే.. నాకు పోన్ చేసి..అమ్మా! ఎక్కడ ఉన్నావమ్మా! నాకు కనబడు అమ్మా..పిచ్చివాడికి లా లగేజ్ నా చేతికి ఇచ్చి.. వదిలేసావ్..!.నాకు.. లోపల ఏమిటోగా ఉంది..ఇటు వైపు వచ్చి చూడు నేను కనబడతాను..అంటూ.. నువ్వు మాట్లాడిన తీరుకి.. అప్పుడే..నా గుండె..సముద్రమే అయింది.
నేను.. ఆ విపరీతమైన ఒత్తిడిలో..నుండి బయటపడుతూ.. నిన్ను..దృష్టికి అందేలా చూసుకుంటూ.. నీకు సమాంతరంగా వచ్చి నిలబడి నిన్ను చూసినప్పుడు.. మన మద్య ఉన్న అద్దాల అరలు..నిన్ను నన్ను..విడదీసే ఇనపకచ్చడాలు అనిపించాయి..బంగారం. నీకు..నేను కనబడ్డాక అరగంట తర్వాత.. నీ లగేజ్ చెకింగ్ అయ్యాక.. మళ్ళీ వెనక్కి వచ్చి.. నాకు జాగ్రత్తలు చెపుతూ.. ఉన్న నిన్ను చూసి..నేను స్తిమితపడ్డాను.పర్వాలేదు.. అలవాటు అవుతున్నాడు.. అనుకున్నాను.
ఇరవైరెండేళ్ళ పాటు..నీ తో పాటు..ఉండి నిన్ను నడిపించిన "అమ్మ" చేతిని..వదిలి నువ్వు ఖండాంతరాలు దాటి వెళుతుంటే.. నిన్నే చూస్తూ ఉండిపోయాను..బంగారం

నాన్నగారు.. జాగ్రత్త, పాపమ్మ జాగ్రత్త..పిన్ని..టేక్ కేర్, బాబాయి..బై., మామయ్యా వెళ్లొస్తాను..మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి..అంటూ అద్దాల తెరల అవతల నుండే.. చేతులు ఊపుతూ ఉంటే .. నాకు దిగులు ముంచుకు వచ్చింది
కాసేపటిలో..ఓ..లోహవిహంగం ..నిన్ను..మా నుండి విడదీస్తుంది.రెక్కలు ఇచ్చి..నిన్ను..బతుకు..గమ్యం వెతుక్కోమని..పంపిస్తున్నాం అనుకున్నాను.
వెళ్ళినట్లే వెళ్లి.. సడన్గా వెనక్కి తిరిగి..సేక్యూరిటిని..అమాంతం దాటి.. ఐరన్ బారికేడ్ లు దాటి పరిగెత్తుకుంటూ..వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని..అమ్మా! ఐ లవ్ యు..మా..! అంటూ..నా తలమీద చెయ్యేసి.. జాగ్రత్తమ్మా.. హ్యాపీ గా ఉండు..అని.. నాకేం పర్వాలేదు నేను బాగానే ఉంటాను..అని నాకు భరోసా ఇచ్చి.. నా చేతిని పట్టుకుని.. లొపలకి..వెళుతుంటే..సెక్యూరిటి మాన్..ముచ్చటగా నిన్నేచూస్తూ ఉండటం..నా..చేతిలోనించి నీ చేయి విడవటానికి..సమయం తీసుకోవడం..మీ నాన్నగారు.. అలాగే కించిత్ ఈర్ష్యగా..చూసి నవ్వుకోవడం.. నాకు.. ఆ గురుతులు..ఎంతో..పదిలం ..బంగారం.

పదకొండు నెలలు.. ఎలా గడచాయో తెలియదు. అక్కడ నీ వెతలు.. అనుభవాలు.అన్నీ విని.. ఒక నెల క్రితం.. నిన్ను వీడియోకాల్ లో..చూసినప్పుడు.. గంట సేపు..పొరిలి పొరిలి వచ్చిన నా దుఖం చూసి..ఇప్పుడు నువ్వు వస్తున్నావు అని..నాకు తెలుసు.ఎవరు వ్రాయ గలరు.. తల్లి కి బిడ్డకి ఉన్న అనుబంధం గురించి..
బంగారం.. అమ్మ మీద ప్రేమ, నీ స్నేహితుల తో.. నీకు ఉన్న అనుబంధం.. ముందు ఏవి గొప్పవి కాదు.. అని అంటావని నాకు తెలుసు. .అలాగే.. మరి కొన్నేళ్ళకి.. నీ మాతృ దేశం కోసం.. ఇలాగే వస్తావని.. నీ కలలు ..నెరవేర్చు కొనడానికి అధికంగా శ్రమ పడతావని.. తెలుసు. .. .
నీ రాక కై..వేయి కళ్ళతో..ఎదురుచూస్తూ..ఉన్నాను..నాన్నా..!! మన ఇంటి పరిసరాలు..మనుషులు..అంతా చిరునవ్వులతో..స్వాగతం పలుకుతున్నారు..బంగారం. కొన్నాళ్ళ నీ ఎడబాటుని..దిగులుని..మర్చిపోయి.. నీతో..ఆనంచంగా గడపటానికి..మన వాళ్ళందరు..సమాయతమయ్యారు.
నలబై అయిదు రోజులు.. నిను చూసుకుంటూ.. రీ ఛార్జ్ చేసుకుంటాను. . నీ కిష్టమైన పాట.. డోన్ట్ కేర్ నవ్వే వాళ్ళు నవ్వనీ ఎడ్చేవాళ్ళు ఏడవనీ .
లో..లా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ..
నీవు నా కళ్ళ ఎదుట తిరుగుతూ.. కన్నుల నిండుగా.. చల్లని..చంద్రునిలా వెన్నెల చిరు నవ్వులు.. చిందిస్తూ ఉంటే.. ఈ..అమ్మకి.. కన్నుల పండగ...బంగారం.
7 కామెంట్‌లు:
చక్కని స్వాగతం! welcom bank Nikhil :)
namasthe..mee article chaduvuthunnantha sepu,oka manchi spandana.anukokunda kallalo neellu sudulu thirigayi.thanks for touching the sentiment.thanks again.
మీ చిరునవ్వుల చంద్రునికి మాతృదేశం తరపున అమ్మ చెప్పిన స్వాగతం చాలా బాగుందండీ...
మీ ఇంటి వెలుగు కు మీరు చెప్పిన స్వాగతం బాగుందండి .
మీకూ మీ బంగారం కు హాపీ మిలన్:)
బావుంది అండి మీ స్వాగతం. నాకు కూడా అలా స్వాగతం పలికే వారు వుంటే ఎంత బాగుంటుందో. మాది విజయవాడే కాని బెంగుళూరు లేదా హైదరాబాద్ లో దిగి మల్లి బస్సు ఎక్కి వంటరిగా విజయవాడకు...................
వెళ్ళటము కూడా వంటరిగా...
ఓహ్.. మీ సంతోషం అంటా కనిపిస్తోంది మీ అక్షరాల్లో.. కొన్నాళ్ళ పాటు మీరింక బిజీ అన్నమాట!!
చాలా చక్కగా చెప్పారండీ.. ఉన్నతాభ్యాసానికి విదేశాలకి వెళ్ళి, తిరిగి వచ్చే కొడుకు కోసం ఒక మాతృమూర్తి ఎంతగా భావాలని ఆవిష్కరిస్తుందో - అవన్నీ టపా రూపములో తెలియచేశారు. చాలా గొప్పగా చెప్పారు. మీకు అభినందనలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి