10, జులై 2011, ఆదివారం

తాతలు నేతులు మా మూతులు వాసన






నేటి యువత జీవనవిధానం చాలా వేగవంతమైనది.విలాసవంతమైనది ప్రమాదకరమైనది. కొంచమైనా మానసికవికాసం లేక చదువుల ఒత్తిడిలో పడి వాళ్ళు కోరుకున్న దాని కోసమో తల్లిదండ్రులుకివ్వాల్సిన దాని కోసమో విపరీతంగా కష్టపడేవారు ఒకరకమయితే ఇక రెండవవర్గం వారు అటు చదువుసంధ్యలు లేక కుటుంబపరమైన బాధ్యతలు లేక వౄత్తివ్యాపారాలు నిర్వహించే శక్తిసామర్ద్యాలు కొరవై బద్దకస్తుల్లా సోమరితనంగా తయారవుతున్నారు.

పూర్వం వ్యవసాయదారుల కుటుంబాలలొ నలుగురైదుగురు పిల్లలుంటే ఒకరిద్దరిని చదివించి మిగతావారిని వృత్తిలో ఉంచేవారు.మునుపటి తరంలోనే కులవృత్తులకి ఉద్వాసన చెప్పాక ఇక ఇప్పటి తరంలో కులంపేరు చెప్పుకోవడం ఒకింత గొప్పఅయినాక కుల వృత్తులని చేపట్టడం నామోషి అయినాక ఎవరు ఎవరో ఎవరికి తెలియనవసరంలేదు.

ఒకప్పుడు పదెకరాల పొలంఉన్న రైతు ఎంతో కష్టపడితే కానీ సంసారం ఈదడం సాధ్యమయ్యేది. ఇప్పుడు అందులొ పదోవంతు ఉంటే చాలు..హయిగా..దర్జాగా బతికేస్తున్నారు. భూముల ధరలకి రెక్కలొచ్చాక నగరాల చుట్టు ఉన్న చిన్నఫాటి రైతుల పరిస్తితి కూడా యెంతో బాగుంది. ఒక పది సెంట్లు అమ్ముకోవడం ఆడబ్బు అయిపోయేదాకా విలాసవంతంగా బ్రతికేయడం ఆ డబ్బు అయ్యేలోపు మిగిలున్నభూమి నాలుగురెట్ల ధర పలకడం.. మళ్ళీ అమ్ముకుని తినడం పరిపాటి అయిపోయింది.పనీపాటా లేక చోటా మోటా రాజకీయ నాయకులుగా యెదగడం అదిఇధి కాకపోతే రియల్ ఎస్టెట్ బిజినెస్ అనిచెప్పుకోవడం పరిపాటి అయిపోయింది.

పూర్వీకులు సంపాదించిన ఆస్తులని అమ్ముకుంటూ సొమరితనంతో,జల్సాగా విలాసవంతంగా బ్రతకడానికి అలవాటుపడ్డ "లంఫెన్" వర్గపు యువత ఉండటం సర్వ సాదారణం అయిపొయింధి.నగరీకరణవల్ల వచ్చిన ముప్పు ఇది.నాకైతే ఇలాటి యువతని చూస్తున్నామేమిటని చాలా బాధ కల్గుతుంది.

ఒక వైపు డాలర్ల వైపు పరుగులు తీస్తున్న యువత,ఇంకొకవైపు పనిపాటా లేక సొమరితనంతో, విలాసవంతంగా బ్రతికే యువత, ఇంకొకవైపు నిరక్షరాస్యతతో పేదరికంలొ నలిగిపొతున్న యువత వీరందరిమధ్య దేశభవితా నీ భవిత ఎటువైపు?
"తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ" అనే యువత మన ముందు ఉంటారేమో!

3 కామెంట్‌లు:

rajiv raghav చెప్పారు...

నిజముగా మీరన్నది వంద శాతము కరెక్ట్ అండి...
యువతలో ఎవరిని చూసిన కష్టపడకుండా గడిపెయ్యడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప
బ్రతకడం మరియు కష్టపడడంలో ఉన్న విలువ ఎవరికి తెలియడం లేదు...
అంతేకాదు.... ఎదుటవారిని గౌరవంగా సంభోదించడం కూడా రావడం లేదు....

అజ్ఞాత చెప్పారు...

భారత ప్రధానికే ఈ దేశ భవిషత్ మీద ఆందోళన లేదు. అంత బాగుంది అని పూర్తి భరోసాతో ఉన్నారు. ఇక సామాన్యులమైన మనం ఎందుకు ఆలోచించాలి?

vishnu చెప్పారు...

ilaati vaarev yekkuva.kastapadaali panicheyaali ani anukovadam ledandi.life is luxuries living.anthe.baagaa cheppaaru.