18, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఓ..కోయిలా..




చిలక మధుర ఫలాలను తింటుంది మనం నేర్పిన పలుకులని అందంగా పలుకుతుంది. నెమలి నాట్యం చేస్తుంది వర్షం వచ్చినప్పుడు మాత్రమే, చిలక పలుకులు గూడు  దాటవు, నెమలి ఆట అడవి దాటదు.

కానీ కోయిల వగరు మావిడి  చివురలును మాత్రమే తింటుంది.ఆ వగరు కి గొంతు రాచి పలుకుతుంది వేదనగా..ఆ ఆవేదనే మనకు..మధుర స్వరం గా వింటుంది.కోయిల పిలుపు   కొండలు-కోనలు  దాటి జనజీవన స్రవంతిలో..మనకు వినిపిస్తుంది. కోయిల స్వరాలని పంచమం అని ఉదహరిస్తారు కూడా. చాలా మంది సంగీతకారులు కోయిల స్వరాలని తమ స్వరకల్పనలో..సృష్టించారు, జతపరచుకున్నారు కూడా. ఇప్పుడైతే..కోయిల స్వరాలూ MP3   లో  చాలా తేలికగా మనకి లభ్యం.  

కోయిలమ్మ కూతకు పులకించని  మది ఉండదు. కూ అంటే..కూ అంటూ..జత కడతాం. రెచ్చ గొడతాము. కోయిల పిలుపే  కొనకు మెరుపు...కొమ్మెక్కి కూసింది కోయిలమ్మా,కు కు కూ కొమ్మే రెమ్మా  పూచే వేళ, కోకిల కోకిల కూ అన్నది., అంటూ కోయిల ఆటలని గుర్తు తెచ్చుకుంటాం. 

మా ఇంటి వెనుక అంతా తోటలు.. అక్కడ కాకి గూటిలో పుట్టి పెరిగిన  ఓ..కోయిల రెక్కలు విప్పి.గళం  ఎత్తి     పాడటం, ఎగరడం ప్రారంభించిది.. 

అంతే ..కాకులు..ఆ కోయిలని వెంటాడి మరీ గూడు వీడే  దాకా తరిమి కొట్టాయి. ఆ కోయిల పుల్లా పుడకా నోట కరుచుకుని వెళుతూ..రోజు నాకు కనబడుతూ  ఉంది..గూడు కట్టేసింది కూడా..  

నేను..ఆ కోకిలని ఫోటో తీయాలని.. రోజు ప్రయత్నిచడం..జరుగుతూనే ఉంది, నాకు ఆ కోయిల దొరకనే లేదు. నేను కెమెరా వేసుకుని తిరగడం మొదలెట్టగానే  జూమ్ కి కూడా అందనంత లోపలికి దాక్కుంటుంది.నేను  లోపలకి రాగానే.. బయటకొచ్చి షికార్లు   చేస్తుంది.. అలా నాతొ.. దోబూచులాడుకుంటుంటే..విసుగు వచ్చి..ఇలా నెట్ లో..పట్టుకున్నాను. మీరు చూడండీ! 

ఇలా కోయిలని చూడగానే నాకొక సరదా  సన్నివేశం గుర్తుకువచ్చింది కూడా!! 

ఒక నాలుగేళ్ల క్రితం గుంటూరులో..జరిగిన శతాధిక  కవి సమ్మేళనం  లో మా విజయవాడ వారు  దాదాపు ఇరవై మంది వరకు గుంపు గుంపు పాల్గొన్నాం.మా వంతు మొదటి నాలుగు ఆవృతాలలో అయిపొయింది. ఇక ఇతరుల కవిత్వం ని  ఆస్వాదించే పనిలో ఉన్నాం. 

తిరుపతి నుండి వచ్చిన "పుష్పాంజలి" మీ కోస్తా ఆంధ్రాలో..కాకులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి..సృష్టిస్తాయి అన్నారు.మేము..ఇదేమీ  పోలికబ్బా! అని ఆశ్చర్య పోతుండగానే ..ఆమె ఇలా కొనసాగించారు. అక్కడ చూడండీ.. ఒక కాకి..ఒక తబలా (సంగీత పరికరం) మీద వాలి  సంగీతాన్ని తన ముక్కుతో వాయిస్తున్నట్లు యెంత బాగుంది ..అన్నారు. మేము తెల్లబోయాము. వెంటనే అర్దమై.. హే.. హియర్ హియర్.. ఒన్స్ మోర్ హియర్ అని కేకలు పెట్టాం. 

ఆవిడ అది ప్రసంశ అనుకుని మళ్ళీ పునరుక్తి మొదలెట్టారు. అప్పుడు వెంటనే..నిర్వాహకులు హడావిడిగా వేదికపైకి పరుగులు తీసి..మేడం..అది కాకి కాదు కోయిల. కోయిల అలా ఉంటుంది..కనుగుడ్లు ఎర్రగా, తోక కాకి తోక కన్నా పెద్దగా,తోక చివర వెడల్పుగా ఉంటుంది అని చెప్పాక...ఆవిడా సరిదిద్దుకున్నారు. 

ఆవిడ మంచి కథారచయిత అని అవార్డులు అందుకున్నారట.కాకి కి కోయిలకి తేడా తెలియదా ?అని ప్రశ్నలు ఉదయించాయి అనుకోండి. కోయిలా! యెంత పని చేసావు?సీమ పరువు తీసావు అని ఇంకో..సీమ మిత్రుడు వాపోయి కోయిల మీద తప్పు రుద్దేసాడు. 

ప్రతి ఏడు కోయిల పిలుపు వినగానే..ఆ విషయం గుర్తుకు వస్తుంది. 

తొందర పడి ముందే కూసే కోయిలలు, శీతా కాలము కూసే కోయిలలు..మా చుట్టూరా ఉండనే ఉన్నాయి. ఇంకా..పల్లెతనాన్ని మాయం చేయలేదు..కొంత అదృష్టవంతులమే మేము అనుకుంటూ ఉంటాను కూడా..

ఇవండీ..కోయిల విశేషాలు.పాటలు బోలెడు ఉన్నాయి.  కొన్ని వినండీ..కొన్ని చూడండీ!!             .   

          
ఇక్కడ కోయిల మదురమైన స్వరాన్ని వినవచ్చు చూడవచ్చు కూడా ! ఈ లింక్ లో చూడండీ Bird Call of Koyal India video by Shirishkumar Patil - Bird Cinema - 

కోయిలలో..ఆడ-మగ తేడాలు వాటి స్వరాలూ గమనించండి.

ఇక్కడ మన తెలుగు పాటలు కొన్ని ఉంచాను. అవీ వినండీ,

కోయిల  పిలుపే  కోనకు

కుహు  కుహు  కుహు  కుహు  అని  పిలిచే  కోయిల  ఇంకా చాలా పాటలు ఉన్నాయి.ఇవి చాలనిపించి.. ఇక ఇంతే.. 

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుందండీ కోయిల గొంతుతో శృతి కలపని వాళ్ళంటూ ఉండరేమో కదా!

తెలుగు పాటలు చెప్పారు...

POST CHALA BAGUNDHI ANDI

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కోయిల విషేశాలు బాగున్నాయ్ :)

కోయిలకీ, కాకికీ తేడా తెలియకపోవడం పుష్పాంజలి గారి తప్పుకాదేమో! రాయలసీమలో కోయిలల్ని అరుదుచేసిన దేవుడిదే తప్పంతా ;)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిజం కదా రసజ్ఞా..నేను ఇప్పుడూ ..కోయిల స్వరానికి..బదులు పలుకుతాను. అంత అందంగా ఉండకపొయినా సరే!

@ బాలు ధన్యవాదములు.

@ భాస్కర్..నిజంగానె అప్పటివరకు పుష్పాంజలి గారు కోయిలని చూసి ఉండకపోవచ్చు ఏమో కూడా ఆలొచించాల్సిన విషయమే!