పీత కష్టాలు పీతవి
మా ఇంటి బిడ్డలా తిరుగుతూ..నోట్లోనుంచి మాట రావడం ఆలస్యం ..జీ హుజూర్ అంటూ పనిపాటలకి సిద్దంగా ఉండే మా ప్రకాష్ కి ఓ..పెద్ద కష్టం వచ్చి పడింది. నిన్న నాకు ఓ అత్యవసర పనిబడి పోన్..చేసి..ఒకసారి ఇంటికి..రా !అనగానే..నిమిషాల్లో..వచ్చి వాలాడు. ఈ లోపు తనకి పోన్ వచ్చింది. మాట్లాడి పెట్టేసాడు.
ఏమిటమ్మా..చెప్పు ?అన్నాడు. నేను ఇలాగే బ్లాగ్ ముఖంలో పడి తన మాట వినిపించుకోలేదు. మళ్ళీ అతని పోన్ మోగింది. ఈసారి కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి మాట్లాడుతున్నాడు.నేను ఆసక్తిగా చూస్తున్నాను. పోన్ పెట్టేసి.. ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి..అన్నాడు. అంతకు ముందు నేను సీత కష్టాలు చెప్పలేదే? అన్నాను..హాస్యంతో..వాతావరణాన్ని తేలిక చేస్తూ..
అసలు విషయం ఏమంటే.. ప్రకాష్.. ఓ.. బార్బర్ షాప్లో..పని చేస్తూ.. దూరవిద్య లో.. మూడేళ్ళ క్రిందటే వేలుపెట్టి.. ఇంకా చదువుతున్నాడు...చదువుతూనే ఉన్నాడు. చదువు కన్నా స్నేయితాలు..జాస్తి.ఏకసంధాగ్రాహి. చక్కగా క్లారినెట్ వాయిస్తాడు.పాటలు పాడుతాడు.మిమిక్రీ చేస్తాడు. రోజుకొక సందర్భం సృష్టించుకుని అందంగా కవిత్వం ఒలికిస్తూ..పెద్ద పెద్ద ఎస్. ఏం .ఎస్ లని..ఓపికగా అందరికి పంపుతుంటాడు.మా వూరి ప్రెసిడెంట్ గారి వెంట..తిరుగుతూ మంచి పనులలో..ఓ చేయి వేస్తూ.. ఉంటాడు. అంత మంచి పిల్లాడికి ..ఓ..కష్టం వచ్చి పడింది.
అందుకే పీత కష్టాలు అంటున్నాడు. తన వృత్తిలో..భాగంగా కన్నా.సేవా భావంతోనే.. వాళ్ళ షాప్ వరకు వెళ్ళలేని వారికి ఇంటికి వచ్చి క్షురకర్మలు చేసి వెళుతూ ఉంటాడు. అలాగే ఈ రోజు ఆలా ఇంటికి వచ్చి హెయిర్ కటింగ్,షేవింగ్ చేసి వెళ్ళమని పోన్ ల మీద పోన్లు. అతనేమో..రావడం కుదరదు బిజీ గా ఉన్నానని అబద్దాలు ఆడుతున్నాడు. ఎందుకు అలా అబద్దాలు వెళ్ళ వచ్చు కదా! అని మందలించాను.
కటింగ్ చేయమని అడిగేది ఎవరికో..తెలుసా? నిర్ధారిత హెచ్ .ఐ .వి. వ్యక్తికి అన్నాడు. అయితే ఏమవుతుంది..?వారి సామాగ్రి వారికే..ఇచ్చి రా..ఇతరులకి వాడవు కదా..!? అన్నాను. అసలు.. ఎప్పుడు..సరి క్రొత్త బ్లేడ్స్ వాడతాము. అలాగే కత్తెరలు లాటివి..రోజు స్టేరిలైజ్ చేస్తాం.షాప్లో..అలా ఇబ్బంది పడం. తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. కానీ ఇంటికి వెళ్లి అతనికి..కటింగ్,షేవింగ్ నేను చేస్తున్నాను అని ఆ నోటా ఈ నోటా ప్రాకితే.. భయం తో నా షాప్ కి ఎవరు రారు. అప్పుడు నా భుక్తి ఎలా? అన్నాడు. ఆలోచనతో.. నేను అవును కదా అనుకున్నాను.
ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు రూపొందించినా ..జనంలో..ఇంకా ఎయిడ్స్ పట్ల.. పాజిటివ్ హెచ్ ఐ.వి వ్యక్తుల పట్ల ఏర్పడిన ఏహ్యభావం,భయం తొలగ లేదనడానికి ఈ విషయం.. నిలువెత్తు నిదర్శనం.
హెచ్. ఐ.వి ఉన్న వ్యక్తీ ఒక టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి .. పిర్యాదు చేస్తే..అతని చేత బలవంతంగా ఆ టిఫిన్ సెంటర్ ని క్లోజ్ చేయించారు.అతని బ్రతుకు తెరువుని..పోగొట్టారు. ఇది అన్నమాట ప్రజలలో..వచ్చిన చైతన్యం. అప్పుడు కొందరు జోక్యం చేసుకుని..అతనిని..పని మానిపించి..ఇంట్లో..కూర్చోబెట్టి అతని..భార్యతో..ఆ టిఫిన్ సెంటర్ నిర్వహింప చేస్తున్నారు.
అతను కొన్నాళ్ళకి డిఫ్రేషన్ తో ఉరి వేసుకుని చనిపోయాడు. చస్తే చచ్చాడు ఎప్పుడైనా చచ్చేవాడే కదా..అనడం విన్నాను. బాధ కల్గింది.అప్పటికి మనమేమి..శిలేసుకుని ఉంటామా ఏమిటి అనుకున్నాను. ఈ బాధలు గాధలు లేని..ప్రపంచం ఎక్కడ ఉండును.. అక్కడకి..వెళ్లి .తలదాచుకుందుకు అని దిగులు పడ్డాను.
హెచ్. ఐ.వి ఉన్న వ్యక్తీ ఒక టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి .. పిర్యాదు చేస్తే..అతని చేత బలవంతంగా ఆ టిఫిన్ సెంటర్ ని క్లోజ్ చేయించారు.అతని బ్రతుకు తెరువుని..పోగొట్టారు. ఇది అన్నమాట ప్రజలలో..వచ్చిన చైతన్యం. అప్పుడు కొందరు జోక్యం చేసుకుని..అతనిని..పని మానిపించి..ఇంట్లో..కూర్చోబెట్టి అతని..భార్యతో..ఆ టిఫిన్ సెంటర్ నిర్వహింప చేస్తున్నారు.
అతను కొన్నాళ్ళకి డిఫ్రేషన్ తో ఉరి వేసుకుని చనిపోయాడు. చస్తే చచ్చాడు ఎప్పుడైనా చచ్చేవాడే కదా..అనడం విన్నాను. బాధ కల్గింది.అప్పటికి మనమేమి..శిలేసుకుని ఉంటామా ఏమిటి అనుకున్నాను. ఈ బాధలు గాధలు లేని..ప్రపంచం ఎక్కడ ఉండును.. అక్కడకి..వెళ్లి .తలదాచుకుందుకు అని దిగులు పడ్డాను.
వాహనాలలో..నిశ్శబ్ద యుద్ధం పేరిట వీధి వీధినా తిరుగుతూ.. అవాయిడ్ ఎయిడ్స్పై. మొబైల్ అవగాహన కార్యక్రమాల ఫలితాలు..ఇవీ..అనుకున్నాను. సమాజం విసిరి పారేసిన వ్యక్తులు పై.. జాలితో..ఈ పోస్ట్.
అన్నట్లు ప్రకాష్ ఈ రోజు రహస్యంగా వేకువనే..వెళ్లి..అతని తల బరువుని కత్తిరించి పడేసి..సేవ చేసి వచ్చానని పోన్ చేసి చెప్పాడు.అది ఒక మంచి విషయమే..కదా!
4 కామెంట్‌లు:
చాలా బాగుంది
హెచైవి భాదితులని గవర్నమెంట్ ఆదుకోవాల్సింది పోయి
అయన హోటల్ పోలీసులు మూయించటం దారుణం.
ఆహారం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందదని ఆ మూర్ఖులకి తెలీదా?
లోకులు వారి మానాన వారు ఉంటూ బ్రతికేవాల్లని మరీ వెంటాడి, వేధిస్తుంది. అదే కళ్ళ ముందు అవినీతి, నీచ నికృష్ట పనులు చేసేవారిని లీడర్లుగా పోగిడేస్తుంటుంది.
ఎయిడ్స్ అనేది పాపం కాదు, కేవలం ఒక వ్యక్తి నిర్లక్షం మాత్రమే అనేది ఎంత నిజమో.. అది సోకితే మందు లేదు అనేది అంత నిజం. ఎవ్వరినీ తప్పు పట్టలేమేమో అనిపిస్తుంది. ఎయిడ్స్ వచ్చిన వారు ఆవిషయం పదిమందికీ తెలీకుండా జాగ్రత్త పడడం మినహా చేయగలిగింది ప్రస్తుతానికి ఏమీ లేదేమో.. :-(
కామెంట్‌ను పోస్ట్ చేయండి