20, సెప్టెంబర్ 2011, మంగళవారం

నీ.... చరణ కమలాలు


నీ పదమును పూజింప ఒక పూవునైనా చాలు వనమాలీ!..అంటూ..

భక్తి భావమో, ఆరాధనా భావమో మోసుకుని వచ్చి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

అలాగే.. ఈ విశాల ప్రపంచం లోకి అడుగిడుతూ..అంటూ.. అక్కడా నా పద ముద్రనే..చిత్రంగా  ఉంచాను.ఎందుకంటే బావిలో కప్పలా ఉండే నేను ఆ పాదంతోనే  ఈ అనంత ప్రపంచంలోకి..అడుగుపెట్టాను కదా!

ఏమిటీ..ఈ పాదాల అభిమానం అనుకునే ఉంటారు..కొందరికైనా  నచ్చిందో..లేదో!? అనుకునేదాన్ని అనుకుంటున్నారా?

అలా ఏం లేదు. ఇది నా బ్లాగ్ కదా! ఇతరులకి..నచ్చలేదని నాకు అత్యంత ఇష్టమైనవి ఒదులుకోలేను. (అలా అని ఇతరులకి ఇబ్బంది కల్గించడం ఇష్టం లేదు .నలుపు-తెలుపు లలో..ఎంతో ఇష్టం గా తీర్చి దిద్దుకున్న బ్లాగ్ రూపాన్ని చదువరులకి కష్టంగా ఉందని చెప్పడంతో..మార్చుకున్నాను.)

బ్లాగ్ చిత్రాలలో.. పాదాల చిత్రాలు..నా అభిమాన చిత్రాలు.
అలాగే..ప్రొపైల్ లో..శబ్ద చిత్రణం కూడా..నీ చరణం కమలం మృదులం పాట.. ఎంపిక చేసి పెట్టాను.

ఒకరిద్దరు అడిగారు..పాదాలు మీ హాట్ పేవరేటా ? అని.  అవుననుకోండి.
కానీ.. హాట్ పేవరేట్ అనే పదం కన్నా  "చరణ కమలాలు" అంటాను. ..
"కరయుగములు, చరణంబులు,
నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
బరువడి సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్"
నీ చరణం..

చరణాబ్జముల్ సకల భ  -  క్తి రహస్యము చాటి చెప్పు. ధీవరులకిలన్.
రుణాన్వితా! గొలుపవా! -  చరణంబులు కోరి పట్ట; సద్గురుఁడ! హరీ! 

 కరుణతో కూడుకొన్నవాఁడా!  సద్గురుఁడవైన  ఓ శ్రీహరీ!   భూమిపై గల ధీ వరులకు 
 శ్రేష్టమైన నీ పాద పద్మములు సమస్తమైన భక్తి యొక్క రహస్య  మార్గములను 
 చాటి చెప్పును. మేము నిన్ను కోరి పట్టుటకై నీ పాదములను సంప్రాప్తింపఁ జేయవా..అని
హరి పాదపద్మములకు ప్రణ మిల్లుతాము.

ఆ బృందావన  విహారి.. నల్లనయ్య అంటే నాకెంతో..ఇష్టం. అందుకే.. ఆ చరణ కమలాలను పూజింప ఒక పూవునైనా చాలు అనుకుంటాను.

నా పేరు కి అర్ధం కూడా..అదే కదా!

ఇక్కడ ఈ లింక్ చూడండీ! బ్రహ్మ కడిగిన పాదము..అందరికి..ఆ పాదమే కదా శరణ్యం.
http://vanajavanamali.blogspot.com/బ్రహ్మ కడిగిన పాదము.. ఇంత కన్నా నేను ఏం చెప్పగలను? అందుకే..హరి పాదానికి..ప్రణమిల్లుతూ..

"విరించి విష్ణించి సుపూజితాభ్యాం..విభూదిపాటీర విలేపనాభ్యాం.. నమో నమః శంకర పార్వతీభ్యాం.." 

అంటూ..అనుక్షణం మహాదేవుని స్మరణలో..పునీతం కావాలనుకునే ఆకాంక్ష కల్గిన నేను..

ఆ తల్లి చరణ కమలాలకూ        
మోకరిల్లుతూనే.. 

నా బ్రతుకు నడవాలి శివవామ భాగా
నీ పాదపద్మాల భ్రమరమ్ముగా
దివ్యగంధాల వెదజల్లు నీ పాదము
దేవి హరిచందనపు లేత పల్లవము
అని ఒక భక్తుడు .. ఆ అమ్మ పాద పద్మముల ముందు మోకరిల్లినప్పుడు పాడిన  గీతాన్ని..మనం చేసుకుంటాను.చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా... 


అని ఘనంగా కీర్తిన్చుకున్నా .. ఆ పాదమే కదా!... 

భరతుడుకు భరత వంశీయులకి..ఇప్పుడు భారతజాతికి..ఆదర్శప్రాయం. అలా ఆ పాద పదములకు మోకరిల్లుతూ..ఉంటాను.

ఈ పాదం పుణ్యపాదం..అంటూ..నటరాజ చరణ కమలాలకి..ఆత్మప్రణామాలు చేసుకుంటూ.. అనంత మైన అర్ధాన్ని అందించిన ఈ గీతాల ఆస్వాదనలో..రసా స్వాదనలో..

ప్రధమం ఆ భగవంతుని పాదపద్మములనే మనం దర్శించుకుంటే ..ఆయన అపార కరుణామృతాన్ని,ముక్తిని పొందుతామని చెపుతారు కాబట్టి.. ఆ చరణకమలాలకి   .. మోకరిల్లుతూ.. ఈ ఆర్తిలో..మమైకమైపోతూ..
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం   దివ్యపాదం
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  దివ్యపాదం (ఈ )
ప్రణవ మూలనాదం    ప్రధమలోక  పాదం
ప్రణతులే    చేయలేని  … ఈ  ఈ  కరమేల   … ఈ  కరమీల …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే    ధర్మపాదం …

మార్కండేయ  రక్షపాదం  మహాపాదం  ఆ …ఆ …
మార్కండేయ  రక్షపాదం … మహాపాదం …
భక్త  కన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
భక్తకన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
ఆత్మలింగ  స్వయంపూర్ణ  ఆ … ఆత్మలింగ  స్వయం  పూర్ణుడీ …
సాక్షాత్కరించిన  … చేయుతనీడిన  … అయ్యో   …
అందని  అనాధనైతి  … మంజునాధ …
ఈ  పాదం  పుణ్యపాదం
ధరనేలే    ధర్మపాదం
ప్రణవ  మూలనాదం    ప్రణయ  నాట్య  పాదం
ప్రణతులే  చేయలేని  … ఈ  ఈ  శిర   మేల  … ఈ  బ్రతుకేల   …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే  ధర్మపాదం

భక్తీ  శిరియాలు   నేలిన   ప్రేమపాదం  ఆ …ఆ …ఆ …
భక్త  శిరియాలు  నేలిన  ప్రేమపాదం  బ్రహ్మ విష్ణులే   భజించే   ఆది  పాదం
అనాది  పాదం  … బ్రహ్మ    విష్ణు   లే    భజించిన  అనాది  పాదం
అన్నదాత  విశ్వనాధా    అన్నదాత  విశ్వనాదుడీ  …
లీల వినోదిగా   నన్నేలెగ  దిగిరాగా  అయ్యో
ఛీ   …ఫోమ్మంటిని … పాపినైతినీ …
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  ధన్యపాదం
సకల  ప్రాణ పాదం    సర్వమోక్షపాదం
తెలుసుకోలేని … నా ఈ   తెలివేల  … ఈ  తనువేల    …
ఈ  పాదం  పుణ్యపాదం … ఈ  పాదం  … దివ్య  పా దం …
అలాగే మయూరి చిత్రంలో..ఈ పాట చూడండి ..
ఈ  పాదం  ఇలలోన  నాట్య  వేదం
ఈ  పాదం  నటరాజుకే  ప్రమోదం
కాల  గమనాల  గమకాల  గ్రంధం
ఈ  పాదం  ....

ఈ  పదమే  మిన్నాగు  తలకు  అందం
ఈ  పాదమే  ఆనాటి  బలికి  అంతం
తనలోనే  గంగమ్మ  ఉప్పొంగగా
శిలలోనే  అ  గౌతమే    పొంగగా
పాట  పాటలో  తను  చరణమైన  వేళ
కావ్యగీతిలో  తను  పాదమైన  వేళ
గానమే  తన   ప్రాణమై  లయలు  హొయలు    విరిసిన
ఈ  పాదం  ....

ఈ  పాదమే  ఆ  సప్తగిరికి  శిఖరం
ఈ  పాదమే  శ్రీ  భక్త  కమల  మధుపం
వాగ్గేయ  సాహిత్య  సంగీతమై
త్యాగయ్య  చిత్తాన శ్రీ  గంధమై
ఆ  పాదమే  ఇల  అన్నమయ్య  పదమై
ఆ  పాదమే  భరతయ్య నాట్య  పదమై
తుంబుర  స్వర  నారద  మునులు 
జనులు  కొలిచిన ఈ  పాదం  ....

ఆ పాద మనంత భావాన్ని..వేటూరి చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పగలరు? 


నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం అని..ఓ..ప్రేమికుడి..ఆరాధన అయినా .. 
చెలికాలి మువ్వల గల గలలు .. చెలికాని మురళి లో..సరిగమలు.. ఆ పాద మంజీరాల సవ్వడిలో..జత కలసిన హృదయ లయలే..కదా!

అంతెందుకు..చెరుకు వింటి వేలుపు..ఆ మన్మధుడు..ఆ పూల బాణాన్ని రతీదేవి పాదాల ముందే వేసాడట. 
ఆ పాండవ  మధ్యమముడు.. గురువు పాదపద్మముల ముందు బాణాన్ని వేసి కురుక్షేత్ర యుద్దాన్ని ఆరంభించాడట. 

శరణం నీ దివ్య చరణం.. అని వేడినవారికి..రిక్త హస్తాలు చూపబడవని..కదా అందరి నమ్మిక.

అప్పుడెప్పుడో..ఒక హిందీ చిత్రం చూసాను..  గుర్తుకురావడం లేదు.రైలు ప్రయాణంలో.. హీరో..హీరోయిన్ పాదములని చూసి  ప్రేమిస్తాడు.

అలాగే ఒక విషయం ఏమంటే.. మువ్వల పట్టీలను బహుమతిగా  ఇచ్చిన అబ్బాయిని అమ్మాయి ఎప్పుడు మరువదు కూడా..    


ఇన్ని చెప్పాను కదా ! ఇంకా మిగిలి ఉంది.

జన్మనిచ్చిన  తల్లిదండ్రుల చరణాలకు, విద్యా బుద్దులు నేర్పించిన సద్గురు చరణారవిందాలకు  మనం ఆజన్మాంతం రుణ పడే ఉంటాం.

అలాగే..తన తోడైనీడై నిలిచే..జీవిత భాగస్వామి చరణాలకి..ప్రేమతో..అనురక్తితో.. అనుసరించాలనే భావన నాది.

అందుకే.. చరణకమలాలు.. కి..అంకింత భావనతో..నేను..నా చిత్రాలు అన్న మాట.  

4 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

బాగా వ్రాశారు! నలుపు-తెలుపు లలో..ఎంతో ఇష్టం గా తీర్చి దిద్దుకున్న బ్లాగ్ రూపాన్ని చదువరులకి కష్టంగా ఉందని చెప్పడంతో..మార్చుకున్నాను మీరు కూడానా? నేను కూడా మార్చేసా మీరు మరియు భాస్కర రామరాజు గారి కోసం. మనం రాసేది చదవడానికే కదా! అందుకని మార్చటం జరిగినది.

hitaishi చెప్పారు...

charanaalu...! waah!!!
asalu pattinchukomu.. vaatini. melukuva vachchindhi modhalu..nidra dhari chere varaku.... avi chese prayanam..,thadhwaaraa gadinchina anubhavaalu... amogham. meedaina charanaalaku namaskaristhu... abhinandhanalu.. anekaaneka sahrudhaya charanaalanu vetaade prayathnanni prepinchinandhuku.

K Rajendra Prasad చెప్పారు...

వనజ వనమాలి గారు నమస్కారములు,
నేను ఈ బ్లాగు లోకమునకు కొత్తవాడిని. ఈరోజు మీ బ్లాగు చూశాను. చాల బాగుంది. ముఖ్యముగా చాలా అందముగా డెకొరేట్ చేశారు. నాకు ఒక చిన్న సందేహము. మీరు పైన వ్రాసిన క్యాప్షన్ " నీ పదమును పూజింప...." బదులుగా "నీ పాదమును పూజింప.." అని వుండాలేమొ అన్న చిన్న సందేహం. మీ భావమును నేను తప్పుగా అర్థం చేసుకొనివుంటె దయచేసి క్షమించగలరు.

వనజవనమాలి చెప్పారు...

కే.రాజేంద్రప్రసాద్ గారు.. నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదములు.
నీ పదమును, పాదమును పూజింప రెండు సరియినవే నండీ! పదమును అంటే కవితాత్మకంగా ఉంటుందని.. అంతే!