జీవితానికి..ఒక లక్ష్యం కావాలని..భావిస్తూ అందుకు అనుగుణంగా ఒకో మెట్టు ఎక్కుతూ.. ఎక్కిన మెట్టుపై నుండి జారి పడి పోకుండా..జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నత శిఖరాలను..అధిరోహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు కూడా..
కొంత మందిని చూస్తే వారిలా..మనము ఉంటే బాగుండును అనిపిస్తుంది.. నాకు స్పూర్తిగా..నిలిచిన ఒకరి గురించి చెప్పబోతున్నాను. అసలు నేను ఈ బ్లాగ్ లోకం లోకి అడుగిడటానికి ప్రేరణ ఆమె మాత్రమే!
ఆమె గురించి చెప్పాలంటే.ఓ..నాలుగేళ్ళు వెనక్కి వెళ్ళాలి.
ఓ .నాలుగేళ్ళ క్రితం నాటి నవంబర్ పంతొమ్మిదవ తేది.. విజయవాడలో.. మహిళా దినోత్సవం సందర్భంగా .. మా" ఎక్స్ రే " సాహితీ విభాగం తరపున నేను ఓ..మహిళా కార్యక్రమం నిర్వహించాను.ఆ కార్యక్రమంలో .. విజయవాడ పరిసరప్రాంతాల లోని శక్తివంతమైన స్త్రీలు పాల్గొన్న కార్యక్రమం. '"మహిళలా-మజాకా" మహిళా సాధికారత క్రమంలో..స్రీలు ఎదుర్కొన్న, ఇంకా ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల గురించి..వారి అనుభవాలు..తెలుసుకుంటూ..ఒక చర్చాకార్యక్రమం చేస్తున్నాను.
తొమ్మిది మంది అతిధులు..నవదుర్గలగా అభివర్ణిస్తూ సాగే ఆ కార్యక్రమంలో..
పత్రికారంగంలో..మహిళలు.. అనే అంశం గురించి..మాట్లాడటానికి చర్చలో..పాల్గొనడానికి జి.పద్మకళ హాజరుకావాల్సి ఉంది.కానీ ఆమె.. ఒక గంట ఆలస్యంగా వచ్చారు.
పత్రికారంగంలో..మహిళలు.. అనే అంశం గురించి..మాట్లాడటానికి చర్చలో..పాల్గొనడానికి జి.పద్మకళ హాజరుకావాల్సి ఉంది.కానీ ఆమె.. ఒక గంట ఆలస్యంగా వచ్చారు.
సరే..ఆలస్యంగా వచ్చినా చర్చలో..బాగా పాలుపంచుకుని ఎన్నో..విషయాలు ముచ్చటించారు . ఆ చర్చ ఆసక్తికరంగా నాలుగు గంటలు కొనసాగింది. ఒక జర్నలిస్ట్ గా..ఆమె వృత్తిలో ఎదురైనా సవాళ్ళని ఎలా ఎదుర్కున్నారో..వివరిస్తూ.. ఇంకా తనలోని..ఇంకొక పార్శాన్ని బయట పెట్టారు.
వనజ గారు..నాకు ఇక్కడ మన ఎక్స్ రే కార్యక్రమాల నిర్వాహకురాలుగా కాకుండానే..వేరేవిధంగా తెలుసు..
ఆమె ఒక శ్రోత..నేను ఒక ఆర్.జే. నేను.కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ లో..ఆర్.జే గా కూడా చేస్తాను.అలాగే..ఒక స్కూల్ లో టీచర్ గాను పని చేస్తున్నాను అని నాకు షాక్ ఇచ్చారు..
నాకు అంతకుముందు ఆమె తెలిసిన రెండు సంవత్సరాల కాలంలో..ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు. ఆమె..నాకు..మా "నెల నెలా వెన్నెల " కవిత్వం కార్యక్రమం లో ..పాలుపంచుకునే..కవయిత్రిగా తెలుసు..
ఆ రోజు..ఆమెలో..మూడు కొత్త కోణాలు బహిర్గతం అయ్యాయి.
ఆమె ఒక శ్రోత..నేను ఒక ఆర్.జే. నేను.కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ లో..ఆర్.జే గా కూడా చేస్తాను.అలాగే..ఒక స్కూల్ లో టీచర్ గాను పని చేస్తున్నాను అని నాకు షాక్ ఇచ్చారు..
నాకు అంతకుముందు ఆమె తెలిసిన రెండు సంవత్సరాల కాలంలో..ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు. ఆమె..నాకు..మా "నెల నెలా వెన్నెల " కవిత్వం కార్యక్రమం లో ..పాలుపంచుకునే..కవయిత్రిగా తెలుసు..
ఆ రోజు..ఆమెలో..మూడు కొత్త కోణాలు బహిర్గతం అయ్యాయి.
ఒక జర్నలిస్ట్ గా..ఒక టీచర్ గా, ఒక ఆర్.జే గా పని చేస్తూ..సామాజిక సృహతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణ విషయం కాదు. ఇంట్లో ఇద్దరి పిల్లల తల్లిగా గృహిణి గా ఎన్నో భాద్యతలు నిర్వహిస్తూ.. తనలోని అసమానమైన ప్రతిభతో..వివిధ అంశాలపై వ్యాసాలూ వ్రాస్తారు.ఆమె ఏ వార్తా పత్రికలో పనిచేసినా..ఆమె శైలి విభిన్నం.
అలాగే..రేడియోలో..ఆమె ఆర్.జే గా ఎంతోమందిని అలరిస్తూ మంచి ఆర్.జే అనిపించుకుంటారు.
ఆమె హాట్ సీట్ లో..కూర్చుంటే..గంటలు నిమిషాల్లా గడచిపోతాయి అంటే అతిశయోక్తి కాదు. ఆమెకి..ఎన లేని అభిమాన గణం ఉంది.. ఈ రోజు మా కళ గారు వచ్చారు..అంటూ..ఫోన్ ఇన్ ప్రోగ్రాం లైన్స్ బిజి అయిపోతాయి.
ఆమె హాట్ సీట్ లో..కూర్చుంటే..గంటలు నిమిషాల్లా గడచిపోతాయి అంటే అతిశయోక్తి కాదు. ఆమెకి..ఎన లేని అభిమాన గణం ఉంది.. ఈ రోజు మా కళ గారు వచ్చారు..అంటూ..ఫోన్ ఇన్ ప్రోగ్రాం లైన్స్ బిజి అయిపోతాయి.
ఇప్పుడు ఓ..కార్పోరేట్ స్కూలో..వైస్-ప్రిన్సిపాల్ గా చేస్తూ..ఇంకా ఓ..ప్రముఖ వార్తా పత్రికలో..విలేఖరిగా, ఆర్.జే గా. . చేస్తూ..ఇద్దరిబిడ్డ లని..స్వయంగా సంరక్షించుకుంటూ..
అంత పని ఒత్తిడిలో కూడా..ఆర్తుల గురించి తపన పడుతూ..కొన్ని సేవా కార్యక్రమాల్లో తనే స్వయంగా చేపట్టి..ఉత్తమ పౌరురాలిగా, మానవతా వాదిగా ఉండటం ఆమె సహజ శైలి.
ఆమె ఎవరో..కాదండీ.. మన అందరికి పరిచయం ఉన్న "తెలుగు కళ" కొత్తబంగారులోకం _తెలుగు కళ
ఆమె బ్లాగ్ లు నాకన్నా ముందు..మీ అందరికి పరిచయం.
ఆ రోజు సభ అయ్యాక ఆమె..నాకు తన గురించి చెబుతూ..బ్లాగ్ ఉందని చెప్పారు.
ఆ విషయం గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు
తర్వాత తర్వాత పత్రికల్లోను అక్కడ అక్కడ బ్లాగ్ లోకం గురించి చదవడం,వినడం వల్ల ఆసక్తి కల్గినా కూడా నాకు తీరిక లేని పనులవల్ల.. ఇంట్లో ఆరు సంవత్సరాలగా ఉన్న కంప్యూటర్ దానికి నెట్ కనెక్షన్ ఉన్నా కూడా ఇటువైపు తొంగి చూడలేదు.
కానీ గత సంవత్సరం ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ.. నవంబర్ ఆఖరిలో..ఇలా బ్లాగ్ లోకం లోకి అడుగుపెట్టాను..
కళ గారిని చూస్తే..చాలా ఆశ్చర్యం కల్గుతుంది. అన్ని పనులు చేస్తూ కూడా..ఉత్సాహంగా ఉంటారు.ఎనర్జిటిక్ గా పని చేసుకుంటూ పోవడమే కాదు అన్నింటా ముందంజలో..ఉంటారు. కవిత్వం వ్రాస్తారు.
గత నెలలో..తల్లి-దండ్రులు అనే అంశంతో..
ఒక కవిత్వ కార్యక్రమం కి..హోస్ట్ చేసి..మంచి కవిత్వంతో..సామాజిక భాద్యతని.బిడ్డలగా..తమ కర్తవ్యాన్ని మరువ వద్దంటూ..చైతన్యంతో..పిలుపునిచ్చారు.
నాకు..ఆమె స్ఫూర్తి.
వనజగారు..మీరు బ్లాగ్ లోకం లోకి రండీ..అది..మీకు ఒక మంచి వేదిక. మీలోని కవయిత్రికి.. పాటల ఆసక్తికి..అక్కడ మీకు మంచి ఉత్సాహం అందుతుంది అని ప్రోత్సహించారు, ఆమెలోని ఎన్నో..ఉత్తమ గుణాలు నాకు ప్రేరణ. కష్టించి పనిచేయడం,కళాత్మకంగా ఆలోచించడం,అందరికన్నా ముందు ఉండటం,విభిన్నంగా నిరూపించుకోవడం లాటి ఉత్తమ లక్షణాలు అంటే ఇష్టం.
పద్మ కళగారు నాకు పంపిన వ్యాఖ్య ఇది.
వనజ గారికి బ్లాగ్ లోకానికి స్వాగతం ! మంచి భావుకత, సామాజిక అవగాహన, బాధ్యత గల మహిళలు కోకొల్లలుగా ఉన్న ఈ అందమైన లోకంలోకి తెల్లంచు నల్లచీర కట్టిన తెలుగు ఆడపడుచులాగా (మీ బ్లాగ్ డిజైన్ సుమండీ...) ౨౦౧౦ చివర్లో వచ్చారు. మీ సాహిత్యాభిలాష .. సంగీతపిపాస తీర్చుకునేందుకు ... బ్లాగరులను చక్కని టపాలతో అలరించేందుకు...... ౨౦౧౧ గొప్ప వేదిక కావాలని, నిరంతరాయంగా మీ బ్లాగ్ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిస్తూ.... నూతన సంవత్సర శుభాకాంక్షలతో....... తెలుగుకళ - పద్మకళ.
ఈ వ్యాఖ్య చూసి నాకు ఆనందం.
ఇంకా..నాలాటివారికి స్పూర్తిగా ఉండాలని..ఆకాంక్షిస్తూ.
బ్లాగ్ లోకంలోకి తీరిక చేసుకుని తప్పక రావాలని ఆమె ముద్ర అందరిని..అలరిస్తూ..ఆలోచింపజేయాలని ఆశిస్తూ..
4 కామెంట్‌లు:
రెండూ పనులు ఒకే సారి చేయడానికే సతమయిపోతున్న ఈ రోజుల్లో అన్నిటిలో ముందంజలో ఉండటం నిజంగా మెచ్చుకోవలసిన విషయం. క్రొత్త వ్యక్తిని, ఆమె బ్లాగుని పరిచయం చేసినందుకు ధన్యవాదములు!
వీరిని గురించి ఒకసారి సిరిసిరిమువ్వ గారి బ్లాగులో చదివానండీ.. అప్పట్లో 'నానోలు' రాశారు వీరు.. బ్లాగు ఈమధ్య రాయడం తగ్గించినట్టున్నారు, అగ్రిగేటర్లలో కనిపించడం లేదు.. మీ టపా చాలా బాగుంది.. అలా వచ్చారన్న మాట మీరు ఇక్కడికి..
చాలా బాగా చెప్పారు.ఆవిడ ని చూడాలనిపిస్తూ
ఉంది.నిజంగానె మాకు మంచి బ్లాగర్ ని ఇచ్చారు.
చాలా సంతోషం.
Best wishes to both of you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి