10, సెప్టెంబర్ 2011, శనివారం

వాగ్భూషణమ్ భూషణమ్


ఇది   ఆకాశవాణి లో.. సంస్కృత  పాఠం ముందు వచ్చే శ్లోకం ఇది. 


వినడానికి యెంత మధురంగా ఉంటుందో!


సంస్కృతము నేర్చుకోలేదు కానీ ఈ..సుభాషితం వినడానికే కాచుకుకూర్చునేదాన్ని.


నేను తెలుసుకుని వ్రాసుకున్న అర్ధంతో ఆ శ్లోకం ని ఇక్కడ ఉంచాను.


నిజంగా చక్కని సంభాషణ అలంకారమే!

కానీ చక్కగా సంభాషణ నేరిపే వ్యక్తుల అంతరంగం కూడా సంస్కారవంతంగా ఉంటుందని నమ్మకం లేకుండా పోయిన రోజులివి.

అంతటా పయోముఖ విషకుంబులు.

ఇక పోతే.. ఇప్పటి కాలం చూస్తే బాడీ స్ప్రేలు,డియోడరెంట్స్ లేకుండానా!? అసలు కుదరదు. తెర మీద ఆడ వెంట మగ, మగ వెంట ఆడ పరిమళాల వాసనలకే మత్తెక్కి మైమరచి క్యూ లు కడుతుంటే విలేపనాలు వద్దంటే ఎలా? అసలు కుదరదు.



కస్తూరి మృగం, పురివిప్పిన నెమలి స్వభావ సిద్దంల గురించి మర్చిపోవడం మంచిది కదా!

ఇప్పుడు చక్కగా సంభాషించడం ఎలా? అలంకారం ఎలా చేసుకోవాలి? మానసిక స్థితిని బట్టి ఎలాటి విలేపనాలు వాడాలి? ఇవి ప్రత్యేక తరగతి పాఠాలు.పైన చెప్పిన సుభాషితం పొసుగుతుందా?

ఈ సుభాషితం అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది. ఎప్పుడో వ్రాసుకున్నది తీసి ఇలా జత చేసాను.

"అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్  
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే " అని  భగవద్గీత..లో భగవంతుడు చెప్పిన విషయాన్ని..
"సత్యం బ్రుయాత్, ప్రియం బ్రుయాత్, నబ్రుయాత్ సత్య మప్రియం" అని వేద వాక్యము గుర్తుంచుకుంటే..  
అర్ధం చేసుకోగల్గితే మాటకి, మనిషికి విలువ అని తెలుసుకుందాం.
దయచేసి గమనించండి.
పైన నేను జతపరచిన శ్లోకం లో కొన్ని తప్పులు ఉన్నట్లు గమనించాను.
అది మార్చడం నాకు కొంచెం ఇబ్బంది.

సంస్కృత మూలం:

కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

very nice.
వీలుంటే ఇది చూడండి
http://kottapali.blogspot.com/2007/02/blog-post_12.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొత్తపాళీ గారు..మీరు చాలా చక్కగా..చెప్పారు. నేను..మీ అంత బాగా చెప్పలేకపోయాను . ఈ పోస్ట్ చూసిన మిత్రులకి..మీరు వ్రాసిన పోస్ట్ చూడమని మనవి చేసాను. మీకు..మరి మరీ ధన్యవాదములు.

మురళి చెప్పారు...

నిజం కదూ.. ఈ శ్లోకం చూడగానే సంస్కృత పాఠమే గుర్తొచ్చిందండీ నాకూనూ..