5, డిసెంబర్ 2011, సోమవారం

ఆదా హై చంద్రమా రాత్ ఆది

రెండు రోజుల క్రితం.. నాకు ఇష్టమైన పాటలు అన్నీ  మెమరీ కార్డ్లో సేవ్ చేసుకుని ప్లే చేసుకుని వింటూ .. ఎన్నాళ్లైందో చదువుకుని అనుకుని ...బుద్దిగా చదువుకుంటున్నాను..అలా ఇష్టమైన వ్యాపకంలో సమయం యిట్టె గడచిపోయి యెంత పోద్దుపోయిందో తెలియదు కదా!.. అర్ధ రాత్రి దాటి పోయింది నేను వింటున్న పాటని బ్రేక్ చేస్తూ ..ఫోన్ కాల్ .. నెంబర్ చూసుకుని లిఫ్ట్ చేసాను. 

ఏమిటీ తల్లి ! ఈ అర్ధ రాత్రి పలకరింపులు.. ఇక నాకు నిద్ర కరువేమో..అన్నాను. నువ్వు అంత త్వరగా నిద్రపోతే.నే . కదా నిన్ను నిద్ర లేపడం..అన్నది. నిశాసుర సంతతిలా మెలుకువగానే   ఉంటావులే!  నాకే నిద్ర పట్టక కాసేపు మాట్లాడదామని చేసాను.అంది.  

నాకు వళ్ళు మండిపోయి  "చూసావా నీకు యెంత  స్వార్ధమో.. ?  రోజూ బాగా  నిద్ర పడితే శుభ్రంగా   నిద్ర పోయి..ఎప్పుడు  అయినా నేను కనపడగానే.. తిండి నిద్రలు లేకుండా ఏమి చూడటాలు,ఏమి వినడాలు,ఏమి చదవడాలు..అని తరగతులు తీసుకుంటావు..కానీ.. నీకు నిద్ర పట్టకపోతే నేను అనే దాన్ని గుర్తుకు వచ్చాను చూడు..అందుకైనా మెచ్చుకోవు..దేనికైనా పారదర్శకత ఉండాలమ్మాయి.!!." అన్నాను నిష్టూరంగా.. 

సరేలే! ఏం చేస్తున్నావు చెప్పు? అని అడిగింది. పాటలు  వింటున్నాను + చదువుతున్నాను. అన్నాను. నీ టాప్ సీక్రెట్ వీటిల్లోనే ఉంటాయి. అందుకే ఆనందంగా బతికేస్తావ్ అంది. "అవును కదా! " అన్నాను. 

ఏం పాటలు వింటూ ఉన్నావ్  ? ఆరాగా అడిగింది. 

ఇదిగో విను..   అని ఈ పాట ప్లై చేసాను. ఆ సమయానికి తగిన పాట కూడా !
సూపర్ సాంగ్ కదా..అంటే..

అమ్మో ఇంత  పాత పాట ? నా వల్ల కాదు వినడం అంది. 

అవును...పాత పాటే! వి.బి.ఎస్. చాయా గీత్ లో విని విని నాకు మనసైంది. ఇది పాత పాటే! కానీ మీనింగ్ చాలా బాగుంటుంది తెలుసా? అన్నాను. 

ఏ కళ నుందో.. ఏమో  కానీ  సరే చెప్పు   వింటాను. .అంది. కాస్త వేచి ఉండు ..ఈ లోపు ఈ పాత  పాత వింటూ ఉండు అని..నేను  సిస్టం ఆన్ చేసి  

ముందుగా లిరిక్స్ వెతికి ఇదిగో ఇక్కడే అప్పటికప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. 

ఆదా హై చంద్రమా రాత్ ఆది

LYRICS ;-
aadhaa hai chandrmaa raat aadhi
aadhaa hai chandrmaa raat aadhi
rah na jaaye teri meri baat aadhi, mulaaqaat aadhi
aadhaa hai chandrmaa raat aadhi
rah na jaaye teri meri baat aadhi, mulaaqaat aadhi
aadhaa hai chandrmaa

piyaa aadhi hai pyaar ki bhaashhaa
aadhi rahne do man ki abhilaashhaa
piyaa aadhi hai pyaar ki bhaashhaa
aadhi rahne do man ki abhilaashhaa
aadhe chhalke nayan aadhe dhalke nayan
aadhi palkon ki bhi hai barsaat aadhi
rah na jaaye teri meri baat aadhi, mulaaqaat aadhi
aadhaa hai chandrmaa

aas kab tak rahegi adhoori
pyaas hogi nahin kyaa ye poori
aas kab tak rahegi adhoori
pyaas hogi nahin kyaa ye poori
pyaasaa-pyaasaa pawan pyaasaa-pyaasaa chaman
pyaase taaron ki bhi hai baaraat aadhi
aadhaa hai chandrmaa raat aadhi
rah na jaaye teri meri baat aadhi, mulaaqaat aadhi
aadhaa hai chandrmaa

sur aadhaa hai shyaam ne saadhaa
rahaa raadhaa kaa pyaar bhi aadhaa
sur aadhaa hai shyaam ne saadhaa
rahaa raadhaa kaa pyaar bhi aadhaa
nain aadhe khile honth aadhe hile
rahi pal mein milan ki wo baat aadhi
aadhaa hai chandrmaa raat aadhi
rah na jaaye teri meri baat aadhi, mulaaqaat aadhi
aadhaa hai chandrmaa...


తెలుగు  అనువాదం యధాతదంగా  ఇలా ఉంటుంది.విను.. అంటూ.. ఒక విషయం ఏమంటే.. మనకి హిందీని తెలుగులోకి యధాతదంగా అనువదిస్తే..అసలు తలకెక్కదు. హింది బాగా వచ్చి ఉంటె..హిందీ భాష పరంగా సాహిత్యాన్ని అర్ధం చేసుకుని ఆస్వాదించ గల్గితే..ఆ సాహిత్యం రసమయంగా ఉంటుంది. అది ఆస్వాదించడం  తప్ప  అర్ధవివరణ ఇవ్వగలగడం నాబోటివారికి సాధ్యం కాదు.ఎందుకంటె.. నాకు తెలిసిన విషయం ఏమంటే హిందీ పదాలకి ఉన్న అర్ధం సందర్భాల్ని బట్టి వ్యాక్యంలో ఇమిడిపోతూ ఉంటాయి. మన మాతృ   బాషలో మనకి ఒక పదానికి అనేక అర్ధాలు గోచరిస్తాయి ..మనం చెప్పగలం  కూడా .హిందీ అలా కాదు.కష్టం అనిపిస్తుంది.అందుకే ..ఈ పాటకి యదాతదంగా..అనువాదాన్ని.. అలాగే..నేను నా భావనలో పాట అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులుంటే క్షమించేయాలి !!!అని  విన్నమిచుకుంటా.. చెప్పడం మొదలెట్టాను . .. ఆ అనువాదం ఇలా ఉంది 

హిందీకి   తెలుగు అనువాదం:
పల్లవి:
అర్ధ చంద్రుడు అర్ధ (సగం)రాత్రి 
నీ నా సంభాషణ (మాటలు) ,కలయిక సగంలో ఆగిపోకూడదు (ఉండిపోకూడదు)
చంద్రుడు సగం గా ఉన్నాడు,రాత్రి సగం గడచి పోయింది.
నా,నీ ఈ కలయిక మాటలు సగంలో ఆగిపోకూడదు 
సగంగా ఉన్న చందమామా!

చరణం :1 
 ఓ..ప్రియా !ప్రేమ బాష సగమే ..
నీ మనసులోని కోరిక కూడా అలానే..సగంలో ఉండనీ...
సగం కన్నులు సగం కదులుతూ,సగం ఊగుతూ 
అరవిరిసిన కనురెప్పలలో (కళ్ళలో)కురుస్తున్న వాన కూడా సగంగానే ఉన్నది.
నీ,నా ఈ సంభాషణ,కలయిక ఇక్కడ ఇలానే ఆగిపోకూడదు 
సగంగా ఉన్న చందమామా 

చరణం :2 

ఇవాళ ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది ఈ దూరం 
ఈ కోరిక తీరదా ఎప్పటికీ !? దాహం వెయ్యట లేదా?
దాహంతో ఉన్నటువంటి ఈ పవనాలు ..
దాహంతో ఉన్నటువంటి ఆకాశం 
ఆకాశంలో ఉన్న నక్షత్రాల ఊరేగింపు కూడా సగం గానే ఉంది..
అర్ధ చంద్రుడు ..అర్ధరాత్రి 

చరణం: 3 

గానం సగంలోనే  ఉంది శ్యాముడు సాధారణంగానే ఉన్నాడు 
కానీ రాధమ్మ ప్రేమ మాత్రం సగంగానే మిగిలింది 
నయనాలు సగం విచ్చుకున్నవి 
పెదవులు సగం కదిలాయి 
కలవాలనుకున్న ఆ మాట క్షణంలో సగంలో ఆగిపోయింది 
చందమామ సగంగా..రాత్రి సగం గడచిపోగా 
నా ఈ కలయిక ,మాటలు సగంలో ఆగిపోకూడదు 
అర్ధ చంద్రుడు అర్ధరాత్రి ..

పాట.. నీ అనువాదం ఏమో కానీ  మీనింగ్ మాత్రం చాలా బాగుంది ..అన్నది.
మరి  నేను వినే పాటలు ఏమనుకుంటున్నావ్ ?అన్నాను..గర్వంగా.. 
పాట చూస్తే ఇంకా మెచ్చుకున్తావ్.. ఈ పాట పాడిన  గాయని అంటే..నాకు ఇష్టం ఏర్పడింది..ఈ పాట వినడం మూలంగానే! ఇక ఈ పాటలో స్పెషల్స్ చాలా ఉన్నాయి ..ఇప్పటి తరం వాళ్ళు కోతి గంతులకి, కప్ప గంతులకి,పూనకం వచ్చి  ఊగినట్లు ఊగిన దానికి వండర్ ఫుల్ డాన్స్.అని కితాబులు ఇస్తారు. నువ్వు..అర్జంట్గా ఈ పాట చూడాల్సిందే! నీ కూతురిని బతిమలాడి రేపు యూ ట్యూబ్ లో..ఈ పాట చూడు.. అనిచెపుతూ  వివరాలు .కూడా .మెసేజ్ పెట్టాను. 

ఏమిటో..అంత స్పెషల్? అంది .క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో.. ఈ పాటలో చూస్తావు? మీ అమ్మాయి చేసే  " బర్సోరే మేఘ " పాటకే..మురిసి పోతావు కదా..! ఇది చూడు అన్నాను. అయితే తప్పకుండా చూస్తాను కానీ.. పాటకి బాగా అర్ధం చెప్పవా..! అంది..తప్పదా..?అడిగాను..తప్పదు..నా మట్టి బుర్రకి..నువ్వు ఇందాక చెప్పినది అర్ధం కాలేదు అంది. 
నేను నవరంగ్..చిత్రం అయితే చూడలేదు కానీ..అర్ధం మాత్రం చాలా బాగుంటుంది.రేపు చెపుతానులే!  ఇప్పటికి వదిలేయి   తల్లీ!..అని తప్పించుకున్నాను.. నాలో.. ఉన్న కవి రాణి ని అప్పుడు బయటకి తక్షణం తీయలేక కూడాను.  

ఇంకొచెం  వివరాలు అందిస్తూ.. హీరోయిన్  " సంధ్య"  ఆవిడ .. మంచి డాన్సర్,యాక్టర్..కూడా.. ఇండియన్ పిల్మ్ లెజండ్ వి .శాంతా రామ్ మూడవ భార్య అని అంటారు. అని నేను కాస్త తెలిసిన వివరాలు చెప్పాను. 

సంగీతం కూడా బాగుంది..అంది. 

ఆ.సంగీత దర్శకుడు.. మన తెలుగు చిత్రానికి సంగీతం అందించారు. అక్భర్ -సలీం-అనార్కలి. అంటూ ఇంకా యేవో పాటలు పాడుకుని .. ఆవలింతలు మద్య..  శుభోదయం చేప్పుకున్నాం. నాకు ఉదయం నడక కి సమయం అయి.. ఇక నిద్ర కి బై చెప్పి .. ఇలా ఈ పాట మీద మమకారం మరొకసారి పుట్టి .. ఒకసారి ఇష్టంగా చూసి కష్టంగా..వదిలి  వెళ్లక తప్పదు..అనుకుని ఉదయపు నడకకి వెళ్లాను. .
మీరు ఈ పాటని చూసేయండి. ఇక పాట అర్ధం .. పండితుల భాషలో ఏమో కానీ.. నా హృదయ భాషలో..చెప్పాలంటే.. ఇరువురు ప్రేమికులు.. మనసులోని మాటని పూర్తిగా వెల్లడించుకో లేక సతమతమైయి పోతూ.. 

అర్ధరాత్రి సమయంలో.కలుసుకుని.. 

ఇప్పుడు..సగం రాత్రి అయింది సగం చంద్రుడు ఉన్నాడు.. నీ నా..ప్రేమ,మాట మన ఈ కలయిక సగంలోనే ఉన్నాయి..అవి అలా ఉండిపోకుండా ఉంటె ఎంత బాగుండును... 

ఓ..ప్రియా..ప్రేమ భాష ఎప్పుడు సగమే.. నీ మనసులో కోరిక కూడా సగంగానే ఉండనీ..నేను భావనని గాంచి ప్రేమ వర్షంలోసగం  తడచిన అరమోడ్పు కన్నులతో..సగం మూసి సగం తెరచి..నిన్ను చూస్తూ..నా నీ..ఈ మాటలు,కలయిక ఆగిపోకూడదని   కోరుకుంటున్నాను. అంది ఆమె.. 

ఈ రోజు కూడా ఇంకా ఎప్పటి దాకా ఉంటుందో..దూరం.మన ఒకటి కావాలన్న కోరిక ఎప్పటికి నేరవేరదా? ఎప్పటికి ఈ    వలపు దాహార్తి తీరదా..? ఈ గాలి,ఆకాశం కూడా దాహంతో అలమటిస్తూ ఉన్నట్లు ఉంది.ఆకాశంలో ఉన్న నక్షత్రాల ఊరేగింపు కూడా సగం గానే ఉంది. ఈ అర్ధ చంద్రుడు సాక్షిగా  .ఈ అర్ధ రాత్రి .నా ఈ మాటలు .మన మాట,మన కలయిక సగంలోనే ఆగిపోకూడదు. ..అంటున్నాడు అతను. 

 అలరించే గానం సగంలోనే ఉంది నల్లనయ్య మాత్రం మాములుగానే ఉన్నాడు. కానీ రాధమ్మ ప్రేమ మాత్రం సగంగానే మిగిలింది .నయనాలు సాంతం తెరుచుకోలేదు..పెదాలు దాటి మాట రానంటుంది  కలవాలన్న మాట కూడా.. అరక్షణంలో..ఆగిపోయింది..
ఈ..అర్ధ చంద్రుడు సాక్షిగా..ఈ అర్ధ రాత్రి గడచి పోగా.. నా నీ కలయిక సగంలోనే ఆగిపోకూడదు. అని అంటుంది ఆమె. 

ఇంత మధురానుభూతి ని అందించిన ఈ పాటకి ..జీవం ఉంటుంది కదా.. అందుకే..కలకాలం ఉంది. ఎప్పటికి  ప్రేమికులు.. ప్రేమ సందిగ్దావస్థలో.. గుర్తుకు తెచ్చుకునేలా ఉంది. 
అందుకే.. నాకు ఇష్టమైన పాట అయింది.  

8 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

"నా హృదయ భాషలో..చెప్పాలంటే.. ఇరువురు ప్రేమికులు.. మనసులోని మాటని పూర్తిగా వెల్లడించుకో లేక సతమతమైయి పోతూ..

అర్ధరాత్రి సమయంలో.కలుసుకుని..

ఇప్పుడు..సగం రాత్రి అయింది సగం చంద్రుడు ఉన్నాడు.. నీ నా..ప్రేమ,మాట మన ఈ కలయిక సగంలోనే ఉన్నాయి..అవి అలా ఉండిపోకుండా ఉంటె ఎంత బాగుండును..."

"వనజవనమాలి" గారు మీరు పరిచయం చేసిన పాట బాగుంది..
ఈ పాటకి మీ హృదయభాషలో మీరు చేసిన వ్యాఖ్యానం ఇంకా బాగుంది...

జ్యోతిర్మయి చెప్పారు...

"ఇప్పటి తరం వాళ్ళు కోతి గంతులకి, కప్పు గంతులకి,పూనకం వచ్చి వచ్చి ఊగినట్లు ఊగిన దానికి వండర్ ఫుల్ డాన్స్.అని కితాబులు ఇస్తారు" హహహ..
చక్కటి నృత్యకళా ప్రావీణ్యం. ధన్యవాదాలు వనజగారూ..

తెలుగు పాటలు చెప్పారు...

చాలా బాగా తెలుగులో చెప్పారు నాకు అసలు హిందీ రాదు:( ..మంచి పాట పరిచేయం చేశారు దన్యవాదములు

sunita చెప్పారు...

naaku kooDaa baagaa ishTamaina paaTa. intakumundu buz loe kooDaa raasaanu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

అద్భుతమైన పాట. గుర్తు చేసినందుకు దన్యవాదాలు.

జయ చెప్పారు...

నాకు కూడా ఎంతో ఇష్టమైన పాట ఇది. అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియచేసే పాట:)

బుద్దా మురళి చెప్పారు...

వనజ వనమాలి గారు బాగా రాశారండి . వ్యాసాన్ని , కథను ఒక భాషనుండి మరో భాషలోకి అనువాదం చేయవచ్చు కానీ పాటను చేయడం కష్టం సాధ్యమైనంతలో అనువాదం బాగా ఉంది . హిందీ భాష అర్థం అయిన కాక పోయినా పాత కాలం నాటి పాటలు బాగా ఎంజై చేయవచ్చు. రాజస్తాన్ జానపద గీతాలు వింటుంటే అధ్బుతం అనిపిస్తుంది .. ఆ భాషలో ఒక్క పదం కూడా తెలియక పోవచ్చు కానీ పాట వింటే అద్భ్భుతం అనిపిస్తుంది

వనజ వనమాలి చెప్పారు...

రాజీ ..మీకు ఈ పాట పరిచయం నచ్చినందులకు ధన్యవాదములు.

@ జయ గారు.. ధన్యవాదములు. నవరంగ్ చిత్రంలో పాటలు..హావభావాలు అన్నీ చాలా అద్భుతం కదండీ!

@ బాలు మీకు ధన్యవాదములు. హిందీ పాటలు అర్ధం చేసుకోవడానికే నేను హిందీ భాష నేర్చుకుంటున్నాను. మీరు నేర్చుకోండి.అప్పుడు హిందీ పాటలు పరిచయం చేయవచ్చు:)))))))

@ జ్యోతిర్మయి గారు .. ధన్యవాదములు. మరి ఇప్పటి తరానికి ఆ ట్రెండ్ నచ్చాడు.. కదండీ .అందుకే..అలా ఉక్రోషంగా చెప్పాను. సంప్రదాయ నాట్య కళలని ఆడరించాడంలేదని బాధ ఉంది.

@ సునీత గారు..ధన్యవాదములు. దయచేసి ఈ పాట మీరు పరిచయం చేసినప్పటి..బజ్ లింక్ ఇవ్వరా?

@కృష్ణ గారు పాట ని ఆస్వాదించే గుణం ఉండాలే కానీ.. ఏ తరం అయినా మంచిని గుర్తిస్తుంది.. అని నా నమ్మకం. పాటని గుర్తుచేసే ప్రయత్నం చేసాను.

@ మురళీ గారు. చాలా సంతోషం గా ఉందండీ! అనువాదము చేస్తున్నప్పుడు నాకు భయం.. తప్పు చేస్తానేమో..అని. కానీ సంగీత రస స్వాదనకి భాషతో పని లేదు కదండీ! అయినా పాట సాహిత్యం అర్ధమైతే .. ఆ ఆస్వాదన కి ఇంకా విలువ ఉంటుంది. ధన్యవాదములు.