8, డిసెంబర్ 2011, గురువారం

ప్రేమ బృందావనం


ప్రేమ బృందావనం  .. పలికేనే.. స్వాగతం అనే పాట పరిచయం

ఈ రోజు జి.ఆనంద్ గారి "దూరాన దూరాన తారా దీపం" అనే పాట కోసం వెదుకుతుంటే.. ఆనంద్ గారి  పాటల సమాహారం దొరికింది. "మా  బంగారక్క"  చిత్రం లో  ఆపాట కనబడ లేదు కానీ.. ఈ పాట కనబడింది. ఆనంద్ గారి గళం లో.. ఓ..విధమైన వైవిధ్యం   ఆకట్టుకుంటుంది. అమెరికా అమ్మాయి చిత్రంలో.. ఒక వేణువు   పాట కూడా వారి గళం నుండే వెలువడింది.

అక్కినేని గారు,శ్రీ దేవి,సుజాత  గార్లు నటించిన  "బంగారు కానుక "  ఈ చిత్రంలో.. ఇంకో..  రెండు మంచి పాటలు ఉన్నాయి..నడక హంస ధ్వని, చేమంతి పువ్వంటి ..అనే పాటలు.  సత్యం గారి మధుర స్వరాలూ.. అందిస్తే.. సాహిత్యం "సాహితి"  తొలినాళ్ళప్పుడు   అందించారు  .కార్తీక దీపం ఒరవడిలో..వచ్చిన  చిత్రం ఇది. చూడాలంటే ఓపిక కావాలి. కానీ ఈ పాట బాగుంటుంది  కాబట్టి.. ఈ పరిచయం...


పాట సాహిత్యం   

ప్రేమ బృందావనం ..
పలికేనే స్వాగతం
ఆ రాముడు నా వరునిగా...  చేరగా..
ప్రేమ బృందావనం

ప్రేమ బృందావనం..
పలికేనే  స్వాగతం
ఆ సీతే ..నా వధువుగా చేరగా.. ప్రేమ బృందావనం

పెళ్లికే కాలమనే పందిరే వేసేనయ్య
పచ్చని తీగలనే తోరణం చేసేనయ్యా.
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా..
నా... కన్నుల ... కళ్యాణ జ్యోతుల కాంతులు మెరిసే..
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

గాలికే నీ అందం కవితలే నేర్పెనమ్మా
వీణకే నీ గానం స్వరములే  తెలిపెనమ్మ
చందమామ నీ ముందు ఎందుకే బొమ్మా
ఆ.. ..అమ్మమ్మ  ..అపురూప సుందర అప్సర నువ్వు
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

పాలలో తేనెవలె
మనసులే కలిసేనయ్య
కలసిన కొంగులు రెండు విడిపోవమ్మ
మా.. జంటనే దీవించగా గుడి గంటలు మ్రోగే
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

ఇక్కడ ఈ పాట వినేయండి!!!  ప్రేమ  బృందావనం తమిళంలో  ఇదే ట్యూన్ ఉన్న పాట 

4 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

!!వనజవనమాలి!! మంచి సాంగ్ పరిచయం చేశారు ధన్యవాదములు

Tejaswi చెప్పారు...

వనజగారూ, ఇది రజనీకాంత్, శ్రీదేవి నటించిన ఒక తమిళ సినిమాలోని పాటకు కాపీ అని గుర్తు.

Tejaswi చెప్పారు...

అయితేనేం, మంచి పాట. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

మంచి పాటండీ.........