13, డిసెంబర్ 2011, మంగళవారం

వావ్..నాగా అందాలు ..


హాయ్.. ఫ్రెండ్స్.. 
ఈ రోజు అందమైన ప్రకృతిని..కొన్ని ఆసక్తికరమైనవిశేషాలని మోసుకుని వచ్చాను. 

 మన భారత దేశంలో.. "అక్కా-చెల్లెళ్ళు" గా వర్ణించు కునే  ఏడు ఈశాన్య రాష్ట్రాలలో.. మయన్మార్ కి..సరిహద్దుగా కల రాష్ట్రం ..నాగాలాండ్.  మా అన్నయ్య..తన వర్క్ నిమిత్తం ..ఒక ఆరేడు..నెలల క్రితం నాగాలాండ్ కి బదిలీ కావాల్సి వచ్చింది. నాగాలాండ్  అనగానే అమ్మో..అంత దూరమా? అనుకోవడంతో..పాటు..ఉల్ఫా , బోడో.. ల గురించి కొంచెం భయం కల్గింది. అందులోను మా అన్నయ్య సైట్ ఇంజినీర్ గా దేశం నలు చెరుగులా..పాతికేళ్ళ గా గిర గిర తిరుగుతూనే ఉన్నాడు.  

ఎప్పుడూ..అలా తిరిగే ఉద్యోగమేనా? రెండు ఏళ్ళు అయినా  ఒక చోట నిలకడగా ఉండేది లేదు.. మీ జి.ఎమ్ కి. చెప్పి  ఆంద్ర లోనే ఉండకూడదా..అంటే..  "లేదమ్మా..1100 వందల కోట్ల రూపాయల వర్క్.. నేను వెళితేనే.. నాలుగు పేకేజ్ లలో..వర్క్ బిగిన్ అవుతుంది..అంటూ. యూనిట్ అందరికన్నా..ముందు వెళ్ళాడు. అలా ముందుగా వెళ్ళినా అక్కడ వర్క్ మొదలు కావడానికి మూడు నెలలు టైం పట్టిందట. అక్కద ఒకటే..కుండపోత వర్షాలు.ప్రపంచంలోనే అత్యధిక వర్ష పాతం నమోదు అయ్యే ప్రాంతాలలో..నాగాలాండ్  ఒకటి.

ఇక నాగాలాండ్ గురిచి..యెంత ఆసక్తి కరంగా ఉందొ!..వింటుంటేనే..ఒక సారి వెళ్లి చూడాలనిపిస్తుంది. 
అస్సాం బోర్డర్ కి సమీపం లో ఉన్న దీమా పూర్ వరకు మాత్రమె..రైళ్ళు వెళతాయి. అక్కడ నుండి..ఆ రాష్ట్రం మొత్తం..బస్సు ప్రయాణం చేయ వలసిందే! సరిగా రోడ్డు సౌకర్యం కూడా లేని ఆరాష్ట్రం లో 320 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడమే.. మా అన్నయ్య పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెని పని. 

నాగాలాండ్ ప్రజలలో..ఎక్కువ శాతం మంది..నాగా జాతికి చెందినవారు.వారు మాట్లాడే బాష..నాగా అనే భాష. ఆభాషకి..లిపి లేదట. ఆ భాషని వ్రాయాలంటే..మన తెలుగుని మనం ఇంగ్లిష్ లో వ్రాసి నట్లు.. నాగా భాషని. ఇంగ్లిష్ లో..వ్రాస్తారట.అక్కడ ఉన్న  తక్కువ శాతం మంది ముస్లిం లు .ఉర్దూ కలసిన .హిందీ మాట్లాడతారట. కొంతమంది..ఇంగ్లిష్.. ఒక ఇరవయి సంవత్సరాల నుండి.. హిందీ.ఇంగ్లిష్ మీడియం లలో.. స్కూల్స్ నడుస్తున్తాయని..చెపితే ఆశ్చర్య పోయాను. ఏమిటీ.దేశంలో..ఇంట వెనుకబడ్డ ప్రాంతం ఉందా? అని. 

అక్కడ ఆ రాష్ట్రంలో.. సొంత ఆస్తులు ఏమి ఉండవట.అంటే..భూములు,స్థలాలు.కొనడాలు, అమ్మడాలు ..లాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు లేవట..370 ..ఆక్ట్ అమలులో ఉందట.ఇంత మంది జనాభాకి ఇన్ని చదరపు కిలోమీట్ల మేర 
వ్యవసాయమ  చేసుకోవడమే..అని గ్రామ పెద్ద నిర్ణయిస్తారట.అక్కడ పర్వత ప్రాంతాలలో.లభించే అటవీ ఉత్పత్తులని సేకరించి..అమ్ముకోవడం చేస్తున్తారట.  ఇలాటి వెసులుబాటు ఉండటం మూలంగానే ప్రత్యేక స్వయంప్రతిపత్తి కావాలని కొంత మంది వేర్పాటువాదం ని..బయలుదేరదీశారట. నేను అప్పుడు ఒక జోక్ చేసాను. మన ఆంద్ర వాళ్ళకి అటువంటి చోటు ఉందని తెలిస్తే..భూబకాసురులై.. ఆక్రమించుకుంటారు కదా..అని.  అక్కడ వారి కూడా బాగా పండుతుంది.

అక్కడ..కొండ చరియలలో..అనుకూలంగా ఉన్న చోట ఇల్లు నిర్మించుకోవడం .. రెండుమూడు కొండల ప్రాతాలలో.. వ్యవసాయం చేసుకోవడం..ఆహార అవసరానికి తగినట్లు పంటలు పండించుకోవడం.. కోళ్ళు,పందులు,మేకలు లాటి పెంపకం వలన ఆదాయం సమకూర్చుకోవడం చేస్తారట. విద్యుత్ చార్జీలు కూడా..బహు స్వల్పంగా..వసూలు చేస్తారట. నాగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కి.. చాలా పనులు చేపట్టి.బాగా పని చేస్తుందని చెప్పారట. అక్కడ ఆ రాష్ట్రంలో..ఉన్న ఏడు జిల్లాల  వారితోనూ కో..ఆర్డినేషన్ చేసుకుంటూ రోడ్డు పనులు చేయడం మా అన్నయ్య వాళ్ళ పని కాబట్టి.. .  కొంత మంది అధికార గణం తో..చాలా విషయాలు చర్చిస్తారట. వారు చెప్పిన మాటల్లో.. సారాంశం ఏమిటంటే.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భారత దేశంలో..అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయడానికి బాగా పని చేస్తుందని చేపారట.
ఇక అక్కడ ప్రజలలో..ఎక్కువ శాతం మంది.. క్రైస్తవ మతస్తులు.ప్రజల సంస్కృతీ ..సంప్రదాయాలు అన్నీ.. విభిన్నం గా   ఉన్నా..కూడా.. వారందరిలోను భారతీయ భావన బాగా ఉంటుందట.ప్రజలకి.. ఇతర ప్రపంచం గురించి.. అంత పెద్దగా సమాచారం తెలియదట. వార్తా పత్రికలూ.. టీ.వి ల ప్రభావానికి లోనవక..ఓ..ఎభయ్యి ఏళ్ళు వెనుకబడ్డ ప్రాంతంగా అనుకోవచ్చు..అని మా అన్నయ్య చెప్పారు. కానీ వారంతా..స్నేహ స్వభావులు కానీ  వారి ఆచారాల్ని గౌరవించాలని..బలంగా కోరుకుంటారట. అడవి జంతువులని వేటాడటం..మాంసాహారం భుజించడం కూడా..వారి వృత్తిలో భాగమే నట. వారు..వేటాడిన ఎనుమల మాంసాన్ని..గ్రామంలో అందరితో..పంచుకోవడం. ఎన్ని ఎనుమలని వేటాడి ఆ..మాంసాన్ని అందరితో..పంచుకోవడం అన్నదానికి గుర్తుగా.. వేటాడిన జంతువుల కొమ్ములని ఇంటి ముందు.. అలంకరించుకుని..గొప్పగా ప్రదర్శించుకోవడం ని.. చూస్తే.. అయ్యో..పాపం అడవి జంతువులు  వీళ్ళ పాలబడి..ప్రాణాలు కోల్పోతున్నాయి కదా  అనిపించింది. అని జాలిగా చెప్పాడు. మా అన్నయ్య. ఇవన్నీ విన్నాక నేను ఒకటి రెండు సార్లు అయినా నాగాలాండ్ వెళ్లి ఓ..సారి చూసి రావాలనిపించిది.  అక్కడ యాలక్కాయలు  కాస్తాయట. భలే ఉన్నాయి..అవి. 

మా అన్నయ్య ప్రక్రుతి ప్రేమికుడు. అందమైన చిత్రాలని బంధించి..తీసుకుని వచ్చి చూపిస్తే..వావ్..అనుకోకుండా ఉండలేక పోయాను. ఆ..చిత్రాలలో..కొన్ని..ఇక్కడ పంచుకుంటున్నాను. 
మీరు..నాగాలాండ్ అందాలని చూసేయండీ!

పచ్చికపై నడచి వెళుతున్న మేఘాలు.. 


                                           చెక్క బొమ్మల తయారీ.. ఎంత జీవం ఉట్టి పడుతున్నాయో....కదా!

                                          నదీ..ప్రవాహం అద్భుతమైన  మనోహరమైన చిత్రం..

                                                          నల్లని దట్టమైన అడవి.


                                                        చెక్క తో తయారైన కొవ్వొత్తి స్టాండ్

                                                ఇలాటి దృశ్యం అడుగడుగునా..నిత్యం..

స్వచ్చమైన పూలు..మనసు పారేసుకునేటట్లున్నాయి. .


లేత గులాబీ పూబాల నేల చూపులు చూస్తుంది. సిగ్గు పడుతుందేమో!


                                           పసుపు తక్కువేం కాదు..సిగ్గు  భారం అధికమైనది అనుకుంటాను.


                                              దట్టమైన మంచు తో..కొండలే కనబడటం లేదు


                                                       అన్నయ్య పూల చెట్ల పెంపకం

                                              విలేజ్ కౌన్సిలర్ల మీటింగ్లో.. మా అన్నయ్య                                                              మీడియా.. షూటింగ్

మీడియాకి రహదారి నిర్మాణాల గురించి వివరిస్తున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు.. శ్రీ..లోహి


                                          రోడ్డు వేయడం కోసం కొండను   తొలుస్తున్న  జే.సి.బి.


                                                        మా అన్నయ్య గారి జి  ఎమ్


                                              స్థానిక అధికారులకి..రోడ్డు మ్యాప్ వివరిస్తున్న మా అన్నయ్య


ఈ కొండల పైనే ..నివాసం..వ్యవసాయం 


                                                                   కుందేళ్ళ పెంపకం

                                                వేటాడిన ఎనుమల గుర్తుగా కొమ్ములు


                                                  వెతకగా వెతకగా కనబడిన హిందూ దేవాలయం  
విజయదశమి రోజు పూజ సందర్భంగా   .మా అన్నయ్య ఆయుధ సంపత్తి  


                                                          ఇంటి వెనుక పూల తోటే!

                                          మంచు కాదు,నీరు కాదు ..కొండల మధ్య మేఘాల ప్రయాణం..                                              మా అన్నయ్య వాళ్ళ క్యాంపు నిర్మాణ దశ..

తెల్ల ఎలుక ..


నాగా చిన్నారులు..ఆట పాటల్లో. 

                                                                  మిడిల్ ఖోమి అనే చిన్న పట్టణం

                               బొమ్మల తయారీకేంద్రంలో.. మా వదినమ్మ,తెల్ల చుడిదారులో..అక్కడి స్కూల్ టీచర్.

ఇంకో విషయం మర్చిపోయాను. ఒక రోజు అర్ధ రాత్రి వేళ.. ఇరవై మంది..సాయుధ దళం.. మా అన్నయ్య క్యాంపు ని చుట్టుముట్టి .. మొబైల్ ఫోన్ లాక్కుని .. రెండు మూడు గంటలు మాటలు పెట్టి.. ఇబ్బందికి గురిచేసి అధిక మొత్తం డబ్బు కావాలని ఇబ్బంది పెట్టారట. హెడ్ ఆఫీస్ కి కనక్ట్ చేసి మాట్లాడించాక వెళ్లి పోయి.. మరలా.. ఇంకో రోజు వచ్చి వెళ్లారట. .మొదటి రోజు ఆ విషయం విన్నాక మాకు చాలా భయం వేసింది. అవన్నీ..మామూలే!..వాళ్ళకి.. ముడుపులు..అందించకపోతే .వర్క్ లని సవ్యంగా   సాగనీయక, కిడ్నాప్ లు చేసి బాధపెదతారని భయం తో..వణికి  పోవాల్సిందే !    అని చెప్పాడు మా అన్నయ్య.

ఈ అన్నల కథలు బోలెడు ఉన్నాయి. మా అన్నయ్య తిరిగిన చోట్ల అన్నిటా.. వాళ్ళు ఉంటూనే ఉంటారట. ఏదైనా.. ప్రజలు కోసం ప్రభుత్వం పని చేయాలి.. ఆ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకోవాలి. చేసే పనులని బట్టీ.. అభివృద్ధి జరుగుతుంటుంది. నాగాలాండ్ ప్రజలకి...ఈ రోడ్డ్ల ద్వారా అభివృద్ధి జరగడమే..కావాల్సింది..అని మా అన్నయ్య అంటే..అవును..నాలాటి వాళ్ళు సుఖంగా ప్రయాణం చేసి..ఆ..ప్రాంతాలన్నీ కూడా చూసి రావచ్చు అన్నాను.
ఈ సారి కొహిమా  విశేషాలు వ్రాస్తాను. చాలా చిత్రాలు జత చేస్తాను.  వెయిట్ ప్లీజ్!

11 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

నాగాలాండ్ ఫోటోలు బావున్నాయండీ...కొత్త విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు.

తెలుగు పాటలు చెప్పారు...

తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనపడుట లేదు? మాలిక లో కనపడటం లేదు? మీకు ఎవరికీ అయిన కనిపించినను నాకు తెలియపరచండి
ఇట్లు
మీ తెలుగు పాటలు బ్లాగ్
అడ్రస్: తెలుగువారి వీది,
ఉరు : ఆంద్రప్రదేశ్
ఇగా నేను వెళ్లి వెతుకుతా ధన్యవాదములు

durgeswara చెప్పారు...

చాలా బాగున్నాయండీ.

sunita చెప్పారు...

చాలా చాలా చాలా బాగున్నాయండీ!!!

రసజ్ఞ చెప్పారు...

ఈ అందాలు ఎంత రమణీయంగా ఉన్నాయో! కాసేపు అలా భూతల స్వర్గంలో విహరింపచేశారు!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

నాగా లాండ్ అందాలు కళ్ళ ముందు దించారు. ధన్యవాదాలు.

విరిసిన అరవిందం చెప్పారు...

వనజ
గారు మీబ్లాగ్ ద్వార నా నాగాలాండ్ టూర్ విశేషాలు గురుకొచ్చాయి.
వనజ
గారు మీబ్లాగ్ ద్వార నా నాగాలాండ్ టూర్ విశేషాలు గురుకొచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను మావారు కలిసి సరదాగా ఎటు వెళ్ళడం అనుకోని
ఇండియా స్వితెజేర్లాండ్ అంటారు కోహిమనిఅక్కడికి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి గోవతి అక్కడ్నునుచి దీమాపూర్ మళ్ళి అక్కడనుంచి
కారులో (టాక్సీలో) కోహిమాకి. నిజంచెప్పాలంటేఅక్కడి ప్రజలజీవనవిధానం మనతో పోలిస్తే చాలబిన్నం గవుంటుంది. అక్కడ
ప్రజలకి మేము హైదరాబాద్ నుంచి నాగాలాండ్ చూడటానికి వచ్చాం అంటేచాలవిస్తుపోయారు. ఇక్కడ
వాళ్ళు అయతే మీకు వేరేప్లేస్ దొరక లేదా అని ఎద్డవ కూడా చేసారు. కాని
మాకు మటుకు ఇలాంటి చోటుకు వెళ్లి వాళ్ళ జీవన్ విధానం చూడాలని అక్కడి ప్రకృతి అందాల వీక్షిచాలని అనుకున్నాము.

వాళ్ళు కూడా మనలని గురుంచి ఇతరులుకు తెలుసుఅని చాల ఆనందపడ్డారు.
అక్కడి తీసినకొన్ని చిత్రాలు.ముఖ్యమైనది war cemetery, అలాగే మేము వెళ్ళినప్పుడు
అక్కడ అంగామీ అనే తెగవారిది పండగ జరిగింది ఆ
ఫొటోలు మరియుఎంతో ప్రతిష్టకారమైన నాగ
డాన్సు

రాజి చెప్పారు...

నాగాలాండ్ ఫోటోలు,విషయాలు బాగున్నాయండీ.
కొత్త విషయాలు తెలియచేశారు..
మీ అన్నయ్య గారు పెంచిన పూలతోట
చాలా బాగుంది..

Shabbu చెప్పారు...

వావ్ సూపర్,,,, చాలా బాగున్నాయి, మేఘాల మద్య భలేగా అన్పిస్తుంది,,, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము, నేను సిమ్లా వెళ్లినప్పుడు ఆ అనుభూతిని స్వయంగా పొందా,,,,, ఈ ఫోటోలు చూస్తున్నప్పుడు నాకు అవే గుర్తుకొచ్చాయి.,,, ఇక్కడ మీ అన్నయ్యకి బదులుగా మీరున్నట్లయితే ,,,,, బ్లాగు మొత్తం అదరహో,,,,,
Shabbu, KNR

buddha murali చెప్పారు...

బాగుందండి ... డబ్బులు అడగడం ఇవ్వడం లాంటి వ్యవహారాలు రాయవచ్చో లేదో మీ అన్నయ్యను అడిగి రాయండి ... వీలును బట్టి నాగజాతి వారి జీవన విధానం , వారి సంస్కృతి గురించి రాయండి . భుకబ్జలపై మనవాళ్ళ గురించి మీ అభిప్రాయం బాగుంది .. ౧ /70యాక్ట్ ఉన్నతరువత కూడా మన రాష్ట్రంలో గిరిజనుల భూములను ఆక్రమిన్చేసుకున్నారు . దీనికోసం గిరిజన మహిళలను పెళ్లి చేసుకున్నారు ( నిజమైన పెళ్లి కాదు చట్టం కోసం మాత్ర్రమే )

Praveen Sarma (www.teluguwebmedia.in) చెప్పారు...

రేపు నేను చత్తీస్‌గఢ్‌లోని కాంగేర్ లోయ జాతీయ అరణ్యానికి వెళ్తున్నాను. ఫొటోలు తీస్తాను.