7, ఆగస్టు 2012, మంగళవారం

కాలం మారిందిపెళ్లి అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక కూడా..అలాటి వన్నీ కొట్టి పారేసి అమ్మాయికి అబ్బాయి,. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్న వాళ్ళ సంఖ్యా తక్కువేమీ కాదు.

ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల వేటలో.. నమ్మకమైన వ్యక్తుల మాటలు నమ్మడం అంటూ లేదేమో! ఎందుకంటే మెట్రీమోనీ ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఒకటైన జంటలు కోకొల్లలు.

వారికి ఉన్న అర్హతలు, కావలసిన అర్హతలు తో స్పష్టమైన వివరాలతో.. మెట్రీ మోని వారి వెబ్ సైట్ లో అమ్మాయిలూ,అబ్బాయిలు దర్శనమిస్తున్నారు.

వారి
బయో డేటా లో వంశ పారంపర్య వ్యాధుల వివరాలుతో పాటు హెచ్ ఐ వి నెగిటివ్ అని కూడా మెడికల్ రిపోర్ట్ ని జత పరచాల్సి వస్తుంది.

మా
పరిచయస్తుల అమ్మాయి తరపు వాళ్ళకి ఇలాటి అనుభవమే ఒకటి ఎదురయింది..

అబ్బాయి
తండ్రి వారి కుటుంబ వివరాలు, అబ్బాయి వివరాలు చెపుతూ.. వ్యాదుల లేమి గురించి కూడా వివరంగా చెప్పడం ని అమ్మాయి వైపు వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు.

మనం
అమ్మాయిని ఇవ్వాలనుకుంటే..కుటుంబం సంప్రదాయం మంచి-చెడు,అబ్బాయి చదువు-ఉద్యోగం గుణగణాలు ఇవి తెలుసు కోవాలని ప్రయత్నిస్తాము.

అబ్బాయి
తరపు వాళ్ళే ఇలా అన్ని వివరాలు చెపుతూ.. వ్యాదుల లేమి గురించి చెప్పడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. రేపు అమ్మాయి గురించి వివరాలు ఇవ్వాలన్నా ఇలా అడుగుతారు కదా! అనుకుంటున్నారు. అది అవమానకరం గాను ఫీల్ అవుతున్నారు.
నిజానికి ఇలాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమైన రోజులు ఇవి.

పైగా ఆబ్బాయి తరపు వాళ్ళు మేము ఇంత కట్నకానుకలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యం! కానీ మీరు ఏమి ఇస్తారో చెప్పండి అని అడగడం కూడా ఒక అడుగు వెనక్కి తగ్గేతట్లు చేస్తుంది.కట్నం ఆశించం అంటూనే ఒత్తిడి తేవడం ఇక్కడ కనబడుతుంది. అమ్మాయి-అబ్బాయి ఇరువురుకి అన్ని విధాల సమ జోడీ. కానీ ఇలాటి అనుమానాలు వల్ల ఆదిలోనే గండి కొట్టే అవకాశాలు నాకు కనిపించాయి.

ఇలాగే
..మా పరిచయస్తురాలు ఒకావిడ వారి అబ్బాయికి తగిన అమ్మాయిని అన్వేషిస్తూ నాతొ ఒక మాట అన్నారు.

నేను నాకు తెలిసిన వారి అమ్మాయి గురించి చెప్పి ఆ అమ్మాయిని అడిగి చూడండి.. అని చెప్పాను.

అమ్మో
! వాళ్ళు మనకి ఇస్తారా? అని సందేహ పడ్డారు. ఆస్తులు-అంతస్తులు కోసం ప్రాకులాడకుండా అబ్బాయి,కుటుంబం కి ప్రాధాన్యం ఇచ్చేవారయితే.. తప్పకుండా అమ్మాయిని ఇవ్వాలని అనుకోవచ్చు. ఒక మారు అడిగి చూస్తే తప్పేముంది? అన్నాను.

మగ
పిల్లాడి వాళ్ళం. మనం అడగడం ఏమిటీ.. నామోషీ తనం కాదా!? అంది ఆవిడ.

ఈమె
ఇంకా బి సి కాలం లోనే ఉంది ఏమిటబ్బా..ప్చ్..అనుకున్నాను. కాలం మారింది కదా!

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

పెళ్ళిళ్ళ మార్కెట్ లో అమ్మాయిలదే డిమాండు.

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, కట్నం ఏదో రూపంలో ఆశించటం జరుగుతుంది.
ఇక పోతే అమ్మాయి వాళ్ళు వివరాలు కోరినప్పుడు, అమ్మాయి వాళ్ళు కూడా ఇవ్వటం తప్పదు,తప్పూ కాదు.

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
కన్యాశుల్కమైనా,
వరకట్నమైనా...
నష్టపోయింది ఎవరో వేరే చెప్పాలా?
శర్మ గారన్నట్లు అమ్మాయిలదే డిమాండు కరేక్టేనేమో..:-)
ఆడ మగ నిష్పత్తి తేడాల వలన ఇలా జరుగుతోంది...
@శ్రీ

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ ..
"కాలం మారింది".. మారుతూనే వుంది కానీ
ఆ మార్పు మంచికి దారి తీస్తే అందరికీ మంచిదే కదండీ..

వనజవనమాలి చెప్పారు...

కష్టేఫలె గారు.. మీరు చెప్పినది నిజమే నండీ!!
@అలాటి క్లారిఫికేషన్ వల్ల నష్టం లేదు .. అని నా అభిప్రాయం కూడా! అయితే కొంతమంది అంగీకరించరు. స్పందనకి థాంక్స్ అండీ!
@ శ్రీ గారు..మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
@రాజీ గారు.. అవునండీ! కాలం మారుతుంది.మనం మారాలి కదా! థాంక్ యు!!