13, ఆగస్టు 2012, సోమవారం

స్నేహం - స్వార్దం

స్నేహంలో స్వార్దం ఉంటుందా!

చాలా మంది స్నేహంలో స్వార్దం ఉండదు నిస్వార్దంగా ఆలోచిందే నిజమైన స్నేహం అంటారు.
అసలు స్వార్దం అంటే ఎలాటి స్వార్దం?

నాకు ఒక స్నేహితురాలు ఉంది. తను నాకు ఒక ఉత్తరం ద్వారా  పరిచయం అయినప్పుడు సంతోషం కల్గింది.

ముందుగా ఆమె నన్ను చూడటానికి వచ్చారు. అప్పుడు నేను కొంచెం ఆశ్చర్య పోయాను.నేను ఆ చొరవ చేయలేకపోయానే అని బాధ పడ్డాను కూడా. !

ఆమె గురించిన వివరాలు చెప్పారు. ఒక రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు.  మరుసటి రోజు వెళుతూ నన్నొక ప్రశ్న అడిగారు

 "మీరు మా సంస్థలో పని చేయడానికి రాగలరా?" అని.

ఆమె హిందూ ధర్మ ప్రచార సభలో స్వచ్చందంగా  అంకిత భావంతో పని చేస్తారు. నాకు అలాంటి సంస్థలలో పని చేయడానికి ఆసక్తి లేదు. ఆమె లా నేను అంత అంకితభావంతో పని చేయలేను అని కూడా  నాకు తెలుసు. అందుకే నేను ఆ పని నా నా వల్ల కాదని నిర్మొహమాటంగానే స్పష్టంగానే  చెప్పాను.అందుకు ఆమె కొంచెం కినుక వహించారు.

నా నుండి వీడ్కోలు తీసుకుని .. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నాకొక ఉత్తరం అందింది.

ఆ ఉత్తరంలో ఇలా ఉంది. మీరు దేశ భక్తికి,దేశ గౌరవంకి సంబంధించిన సంస్థలో పని చేయడానికి వీలు కాదని చెప్పారు. మీ స్నేహం నాకు నచ్చలేదు అని..చెబుతూ..

ఇంకా నా పని వాళ్ళ పట్ల నేను చూపించే ఔదార్యం,చొరవ తనకి నచ్చలేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.మీ పట్ల యజమాని  అన్న విలువ వాళ్ళకి లేదు   అని వ్రాసారు.
ఆమె అలా ఉత్తరం వ్రాసిన విధానాన్ని చూసి నేను చాలా నోచ్చుకున్నాను.

నేను మళ్ళీ ఆమెకి రిప్లై వ్రాయలేదు. నా దగ్గర పనిచేసే ఆడ పిల్లలు .. ఆ ఉత్తరం చూసి బాధపడ్డారు. ఇదేంటి ఆంటీ.. మిమ్మల్ని ఆమె ఇలా అనేసారు అని నన్ను అడిగేవారు.  (ఆమె పోస్ట్ కార్డ్ పై  ఆ లేఖ వ్రాసారు ). మా దగ్గర పని చేసేవాళ్ళలో అమ్మాయిలు ఇంటి పిల్లలు లాగానే ఉండేవారు. నేను వంట చేసుకుంటూనో..వేరే డిజైనింగ్ పనిలోనే ఉన్నప్పుడు .. ఫోన్ లిఫ్ట్ చేయడం చేస్తుంటారు కాబట్టి నాకు మరీ అంత పర్సనల్ అంటూ ఉండేవి కాదు కాబట్టి..ఆ చొరవ వారికి ఉండేది.

నిజానికి ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తీ మానసిక పరిస్థితి బాగోలేదు. అందువల్ల నేను అతని పట్ల సానుభూతి చూపుతూ.. చూసి చూడనట్లు పోయేదాన్ని. ఆమెకి ఆ సంగతి తెలియక అలా వ్రాసారు

కొన్నాళ్ళకి మరలా ఆమె మా ఇంటికి వచ్చారు.. నేను మాములుగానే ఆహ్వానించాను. ఆత్మీయంగానే మాట్లాడాను. ఆమె తను వ్రాసిన ఉత్తరం గురించి ప్రస్తావించి ..అలా వ్రాసినందుకు క్షమించమని అడిగారు. నేను ఆ సంగతి ఎప్పుడో మరచిపోయాని అని చెప్పాను.

తర్వాత తర్వాత ఆమె నాకు మంచి స్నేహితురాలయింది. తను బాగా అలసిపోయినప్పుడు భాద్యతల నుండి తప్పించుకుని ఓ..రెండు రోజులు మా ఇంట గడపడానికి వస్తూ ఉంటుంది. ఇష్టమైన పాటలు వినిపిస్తూ,పుస్తకాలు చదువుతూ ..రకరకాల చర్చలు లేవనెత్తుతూ.. సంతోషంగా ఉంటుంది.

ఆమె వచ్చిన రోజుల్లో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసినా, ఎవరైనా వచ్చినా వారితో కూడా స్నేహంగా ఉండటం ఆమెకి నచ్చదు.  ఒక ఫ్రెండ్ తన వైవాహిక జీవితంలో తలెత్తిన  ఇబ్బందులవల్ల కొద్ది కాలం మా ఇంట్లో ఉండటానికి నేను అవకాశం కల్పించాను. తను చదువుకోవడానికి,కొద్దిగా ఆర్ధిక స్థిరత్వం సంపాదించుకోవడానికి సాయం చేస్తే బావుంటుందని నేను అనుకున్నాను.  ఆమె అలాగే కొన్ని నెలలు మా ఇంట్లో ఉంది.తర్వాత మాకు దగ్గరలోనే ఓ..ఇల్లు చూసుకుని వెళ్ళిపోయింది కూడా. ఆమె వస్తే చాలు ,లేదా ఇంకెవరైనా వస్తే   వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా..అన్నట్లు చూస్తుంది. లేదా వెంటనే బయలు దేరి వెళ్ళిపోతుంది.  రెండు మూడుసార్లు  నేను అది   గమనించి ఎందుకు లా చేస్తున్నావు అని అడిగాను. నీ అంత ఓపిక నాకు లేదు.వాళ్ళ సోది నేను వినలేను  నాకు కొంచెం మంది స్నేహితులు ఉంటె చాలు. మీ విస్తారమైన స్నేహ ప్రపంచంలో నేను ఇమడలేను.. ఇక్కడ నాకు విలువలేదు.. అందుకే దూరంగా ఉంటాను అని చెప్పింది.

ఆమె స్నేహంలో నాకు స్వార్దం కనిపించింది.ఆమె వెళ్ళిన కొన్నాళ్ళకి ఆమెకి ఒక ఉత్తరం వ్రాసాను.

ప్రియమైన స్నేహితురాలికి.. ఓ..ఆత్మీయ లేఖ.

పరిమితమైన స్నేహితులు ఉండటం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.  చిన్ననాటి స్నేహం, జీవన విధానానికి తగ్గట్టు అవసరమైన స్నేహాలు, అభిరుచిలు కలసిన స్నేహాలు, ఎన్నటికి విడిపోని  గాఢమైన స్నేహాలు.. వీటి మధ్య బ్రతుకుతున్న చాలా మందికి కొంతమందికే పరిమితమైన స్నేహం ఉండాలనుకోవడం సాధ్యం కాకపోవచ్చు.   నేను అందుకు అతీతం ఏమి కాదు.

స్నేహం అంటే కాస్తంత సాయం చేయడం, ఎదుటిమనిషి ఉన్న స్థితిని అర్ధం చేసుకోవడం, మనం  వారికి అండగా ఉన్నామని భరోసా  ఇవ్వడం..

ఇందులో మనకి కొన్ని వ్యక్తీ గత ఇబ్బందులు ఉండవచ్చు కాని వాటిని ప్రక్కనపెట్టి మన స్వంత వాళ్ళకి, రక్త సంబందీకులకి అయితే మనం చేయమా? అని మనకి మనం ప్రశ్నించుకోగల్గితే ..  ఎలాటి ఇబ్బంది ఉండదు కదా  నీకు నావల్ల కల్గిన ఇబ్బందికి క్షమించు....

ఆఖరిగా ఒక మాట.. నిత్యం మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే స్నేహంగా ఉండటం సాధ్యం కానప్పుడు వారికి సాయం చేయలేను అని భావిన్చుకున్నప్పుడు .. పై పై మాటలతో వారికి  స్నేహం రుచి - రంగు చూపిస్తూ కప్పదాటు స్నేహం నేను చేయలేను,నటించలేను   అంటూ  ఉత్తరం ముగించాను.

లింగ బేదం  లేని వారి పట్ల చూపే స్నేహంలోనే ఎన్నో అభ్యంతరాలు ఉంటె.. ఇక స్త్రీ-పురుష స్నేహాలు ఎలా ఉంటాయి అని నాకు గొప్ప సందేహం ముంచుకొస్తుంది. అది ఏమిటంటే ...  అసలు స్నేహంలో స్వార్ధం ఉండాలా-వద్దా?

 నా ఈ అనుభవం తర్వాత  మనఃస్పూర్తిగా  స్నేహహస్తంని ఇవ్వడం సాధ్యం కానివాళ్ళు ఇక సంస్థలలో ఎలా అంకిత భావంతో పని చేయగలరు..అని అనుకుంటాను. ఇంతకీ ఆ మిత్రురాలు నాతొ స్నేహం కట్ చేసుకుందా ..!? అంటే అదేమీ  లేదు..

ఆమె వచ్చినప్పుడు పవర్ కట్ లేకుంటే  ఇంట్లో '"చిట్టేమ్మ" సీరియల్ చూస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం నాశనం చేసిందని విమర్శిస్తూ  రాధిక గురించి ఆవిడ వ్యాఖ్యనిన్చుతారు. నేను ఆమెతో తగవు పడతాను.. అదీ సంగతి.

ఫ్రెండ్ షిప్ అంటే.. నా మాటల్లో..

 అండర్ స్టాండింగ్, కేరింగ్,షేరింగ్,సపోర్టింగ్... అంతే!!


మైత్రి దినోత్సవం నాడు వ్రాసుకోవాల్సిన పోస్ట్..ఈ రోజు ఇలా.. మనసైంది. :)

7 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

ఏ స్వార్ధంలేని స్నేహం లభించడం అదృష్టం. మనుషులను అర్ధం చేసుకుని మెలగడంలో మీకు మీరేసాటి వనజగారూ..

buddha murali చెప్పారు...

వనజ వనమాలి గారు బాగుంది ... సహాయ పడే మీ మనస్తత్వానికి అభినందనలు ....అది అందరి వల్ల కాదు .. నేను మాట సహాయం చేయగలను కానీ మీ మాదిరిగా అంతగా అదుకోలేను . అంత మాత్రాన అలా ఆదుకునే వారిని నిరుత్సాహ పరచను. ఆదుకొనే అవకశం , మనస్తత్వం మీకు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు . వారి కోసం మీ అలవాటు మార్చుకోకండి... ఇబ్బందులు, ప్రమాదాలు లేకుండా నలుగురికి మీరు అలానే సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటూ ....

Jai Gottimukkala చెప్పారు...

ప్రతి సంబంధంలో ఇరువురికి కొన్ని ఆకాంక్షలు expectations) ఉంటాయి. స్నేహంలోనూ అంతే.

తేడా ఏమిటంటే ఇతర సంబంధాలలో ప్రతి ఒక్కరి పాత్ర (roles) కొంతవరకు సమాజం నిర్ణయిస్తే, స్నేహంలో ఆ పాత్రలను స్నేహితులే నిర్వచించుకుంటారు. అందువల్ల mismatch of expectations జరిగే అవకాశాలు ఇతర సంబంధాల కన్నా స్నేహంలో ఎక్కువ.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

స్నేహానికి స్వార్థపు రంగంటుకో వచ్చేమో గాని ,
స్నేహ హస్తం మాత్రం-
నిస్వార్థ త్యాగం భూషణంగా శోభిల్లు తుంది .
కష్ట కాలంలో మన దరికి చేరిన వారికి -
స్నేహ హస్తాన్ని అందించి -
ఆదరించడం -
అందరూ చేయలేని పని .
అందులోని ఆత్మ సంతృప్తి అనిర్వచనీయ ఆనందాన్నిస్తుంది .
అనుభవిస్తే గాని ఆరుచి తెలియదు .
సదరు అలంకారాన్ని కంకణంగా ధరించిన మీరు ధన్య జీవులు . అభినందనలతో -----
-----సుజన-సృజన

రాజి చెప్పారు...

"స్నేహం అంటే కాస్తంత సాయం చేయడం, ఎదుటిమనిషి ఉన్న స్థితిని అర్ధం చేసుకోవడం, మనం వారికి అండగా ఉన్నామని భరోసా ఇవ్వడం.."

స్నేహం గురించి మీ ఆలోచన బాగుందండీ.. స్నేహితుల నుండి అవసరమైనప్పుడు సహాయం కోరటం తప్పు కాదు..
కానీ అవసరాల కోసమే స్నేహం చేస్తే ఆ స్నేహం ఎక్కువ కాలం నిలవలేదేమో ..!!

oddula ravisekhar చెప్పారు...

స్నేహం పై మీ భావాలు చాలా బాగున్నాయి.ఆమె మనస్తత్వం కొంచెం విభిన్నంగా ఉంది.అసలు మీ స్నేహాన్ని ఆమె సరిగా అర్థం చేసుకోలేదేమో!గుడ్ పోస్ట్ .స్నేహం పై నేను వ్రాస్తున్న పోస్ట్ లు చూ సారనుకుంటా!ఈ అంశం పై ఇంకా వ్రాయండి.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. ధన్యవాదములు .
@బుద్దా మురళీ గారు.. ధన్యవాదములు. కొంతమందికి సాయం చేయగల శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ శక్తిని కాపీనం చూపి దాచుకోవడం కన్నా చేతనైన సాయం చేయడం బావుంటుందని అనుకుంటాను.స్నేహితులకి సాయం చేయగలగడం కన్నా ఇంకేమి కావాలండి!
@.జై గొట్టిముక్కల గారు... స్నేహంలో అపార్ధాలు తొందరగానే సమసి పోతాయండి. :) థాంక్ యు!!
@రాజారావు గారు.. మనఃపూర్వక ధన్యవాదములు.
@ రాజీ గారు.. అభిప్రాయ బేధాలు ఉన్నా కొనసాగ గల్గేది స్నేహం. ఎందుకంటే ఆ బంధంలో స్వార్దం ఉండదు కాబట్టి. థాంక్ యు వేరి మచ్.. అండీ!
@ ఒద్దుల రవిశేఖర్ గ్గు.. మీరు అన్నది నిజమేనండీ! ఆమె అర్ధం చేసుకోలేదు అనిపిస్తుంది. మీ ఆర్టికల్స్ చదువుతున్నాను. థాంక్ యు వేరి మచ్.. .