16, ఆగస్టు 2012, గురువారం

ఓ..కవి హృదయం

పిల్ల గాలి ఊదింది పిల్లన గ్రోవి
పల్లవించి ఊగింది గున్నమావి

మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమో పొంగింది  ..పాలవెల్లిగా

చెలువ పంపిన పూల  రేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరల చదువు  కుందును
మనసు నిండా పొదుగు  కుందును
చిలిపి బాసల మూగలేఖలు
 చెలువ పంపిన పూల  రేకులు

పరిమళాల పల్లవులగా
ప్రణయ గీతములల్లు కుందును
బ్రతుకు పాటగా పాడుకుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల  రేకులు

విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే
పండు వెన్నెలేమో చండ్ర నిప్పులే  ఆయె
మరులు సైపగ లేక మల్లెలను దూయగా
మల్లియలు సైతం పల్లెరులైపోయే
ఇక సైపగా లేను ఈ మధుర బాధ
ప్రియ సఖీ నా పైన దయ చూపరాదా

ఎవరి కోసం రాధ ఏతెంచేనో
ఎదురుపడగా లేక ఎట పొంచెనో
తలుపు చాటున దాగి తిల కించేనో
తిలకించి లోలోన పులకించేనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు పట్టగా
నిలువెల్లా ఉలికిపడి  తల వాల్చెనో


4 వ్యాఖ్యలు:

శ్రీ చెప్పారు...

మీ కవయిత్రి హృదయం బాగుంది వనజ గారూ!
రాదామాధవీయాన్ని బాగా చిత్రించారు మీవైన అక్షయాక్షరాలతో...
@శ్రీ

oddula ravisekhar చెప్పారు...

బాగుందండి మీ కవిత.అప్పుడప్పుడు కవితలు వ్రాస్తూ ఉండండి.

వనజవనమాలి చెప్పారు...

శ్రీ గారు ..క్షమించాలి. ఈ కవి హృదయం పలికింది నా అక్షరాలూ కాదు. డాక్టర్ సి .నారాయణరెడ్డి గారి కవి హృదయం.
ఈ కవిత్వం.. చెల్లెలి కాపురం చిత్రం కి వారు వ్రాసినవి.

@ ఒద్దుల రవి శేఖర్ గారు.. మీరు కూడా క్రింద జతపరచిన పాట వినవలసినది. అయినా .. నా తప్పిదం ఉంది నేను వివరాలు జతపరచలేదు.
మరొకసారి.. క్రింద జతపరచిన పాట కూడా విని చూడండి.
కవికి అక్షర సుమాంజలిలు

Meraj Fathima చెప్పారు...

vanajaa kavayatri anipinchukunnaaru. baagundi