12, ఆగస్టు 2012, ఆదివారం

వనమాలి కోసం

వనమాలి కోసం

నీ స్వరచాలనం
కలల ప్రయాణంలో ఉన్న
నన్ను మేల్కొలిపింది

నీ కరచాలనం
ఎన్నెన్నో జన్మల బంధాన్ని
జ్ఞప్తికి తెచ్చింది


నీ ఆత్మీయ చుంబనం
నాఆలోచనలపై..
తీయని ముద్ర వేసింది

నీ ఆలింగనం
అలజడితో నిండిన
నా ఆత్మని శాంతింపజేసింది.

నా ఆత్మదీపం
నీలో కలిసేవరకు
నా నిరంతర అన్వేషణ ముగిసేనా

నీవెవరివో
ఎవరికైనా తెలిసేనా
వనమాలి...  నీవే కదా
నడిపేది నడిపించేది
కలలో అయినా ఇలలో అయినా
జీవితాన్వేషణలో అయినా

8 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

బాగు! బాగు!! ఇదేదో స్వా.......ఉందే!!!

శ్రీ చెప్పారు...

నీ.. స్వరచాలనం..
కలల ప్రయాణంలో ఉన్న..
నన్ను మేల్కొలిపింది...

స్వరచాలనం...
మంచి పద ప్రయోగం...
కవిత ప్రేమానురాగాల భక్త్యాంజలి...
అభినందనలు వనజ గారూ!
@శ్రీ

శశి కళ చెప్పారు...

నా హృదయ రాగమే ఆలపిస్తూ ....నన్ను నీలోనే కలుపుకో.బాగా వ్రాసారు.మీ కవిత చదివితే నాకు ఎందుకో ఇలా వ్రాయాలని అనిపించింది

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, కవిత అద్భుతంగా ఉంది.
ప్రేమా, భక్తీ, ఆరాధనా మిళితమై.
అందమైన పదప్రయోగం చాలా బాగుంది..

రాజి చెప్పారు...

"వనమాలి..నీవే కదా..!!
నడిపేది.. నడిపించేది..
కలలో అయినా. ఇలలో అయినా.."

"వనమాలి కోసం" మీ కవిత చాలా బాగుందండీ..

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

మా ' వనజా 'క్షర కవితా
పావన వనమాల దాల్చి పరవశుడగుటన్
ఆ వనమాలి వదనమున
నేవో 'అనురాగ రేఖ' లిరవుగ మెరసెన్ .
----- సుజన-సృజన

వనజవనమాలి చెప్పారు...

కష్టేఫలే.. గారు.. మీ వ్యాఖ్యకి ఆనందం. ధన్యవాదములు. మీరన్నది నిజమే! :):)
@శ్రీనివాస్ గారు.. మీ ప్రశంస కి ధన్యవాదములు. అప్పుడప్పుడు..ఇలా వస్తూ ఉంటాను. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
@ శశి కళ..గారు..ఎంత చక్కగా వ్యక్తీకరించారు. మీరు అలా భావ ప్రకటన చేసారంటే.. పర్లేదు..నేను బాగానే వ్రాస్తానని దైర్యం వచ్చింది. థాంక్ యు వెరీ మచ్ ..టీచరమ్మా!
@మేరాజ్.. పాతిమా .. థాంక్ యు థాంక్ యు వేరి మచ్!!
@రాజీ గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. ఈ కవిత్వం వనమాలి..కోసమే! నా గమనంలో,నా హృదయంలో ..ఎప్పుడూ.. ఉండే వనమాలి.. కోసం.

వనజవనమాలి చెప్పారు...

వెంకట రాజారావు గారు..లక్కాకుల గారు .. వనమాలీ కోసం వ్రాసిన కవిత్వం మీకు నచ్చినందుకు ధన్యవాదములు.